newssting
BITING NEWS :
*హైదరాబాద్ లో చాప కింద నీరులా డ్రగ్స్ దందా..నిన్న పంజ‌గుట్ట‌లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రు యువ‌కుల అరెస్ట్ *హైదరాబాద్ లో మరో హత్య..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉదోగి హత్య*పదవతరగతి పరీక్షలు మరోసారి వాయిదా* ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం..18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ *తెలంగాణ, ఏపీ మధ్య బార్డర్ చెక్ పోస్టు రేపు ఎత్తివేత *ఆంధ్రప్రదేశ్‌లో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలి *గత 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 9,971 కరోనా కేసులు, 287 మంది మృతి.. 2,46,628కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 6,929 మంది మృతి *తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు 400 పైగా కేసులు.. తెలంగాణలో కొత్తగా 206 కొత్త కేసులు..మొత్తం 3496కి చేరిన పాజిటివ్ కేసులు. ఇందులో యాక్టివ్ కేసులు 1663 ఉండగా, కోలుకున్నవారు 1710 మంది ఉన్నారు..ఈరోజు కరోనాతో 10 మంది మృతి చెందారు..దీంతో మొత్తం మృతుల సంఖ్య 123*తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా వివాదం..ఇరువర్గాల పై కేసులు నమోదు చేసిన పోలీసులు *ఏపీలో ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు నమోదు.. మొత్తం 4460 కేసులు *విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రెండవరోజు హైపవర్ కమిటీ విచారణ

బాహుబలి ది గ్రేట్.. కరోనాపై పోరాటానికి భారీ విరాళం

27-03-202027-03-2020 07:27:09 IST
Updated On 27-03-2020 09:03:39 ISTUpdated On 27-03-20202020-03-27T01:57:09.961Z27-03-2020 2020-03-27T01:57:03.855Z - 2020-03-27T03:33:39.767Z - 27-03-2020

బాహుబలి ది గ్రేట్.. కరోనాపై పోరాటానికి భారీ విరాళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ నివారణకు దేశం కదిలివస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి విరాళాలు ఇస్తున్న వారి జాబితా క్రమక్రమంగా పెరుగుతోంది.  తాజాగా బాహుబలి ఫేం తన ఉదారతను చాటుకున్నారు. ఏకంగా 4 కోట్లు విరాళం ప్రకటించి ది గ్రేట్ అనిపించుకున్నాడు. ఇందులో 3 కోట్లు ప్రధానమంత్రి సహాయనిధి, చెరో 50 లక్షలు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేటాయించారు. 

ప్రస్తుతం ఈయన ఫారెన్ షూటింగ్ నుంచి వచ్చి హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే కరోనా బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో 50 లక్షలు అనౌన్స్ చేసాడు. ఇక ఇప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా భారీ విరాళం అందించడం, అందునా తెలుగు హీరోలు ఎవరూ అందనంత దూరంలో వున్నాడు.తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే ఇంత భారీగా విరాళం అందించిన హీరో ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇస్తే.. దానికి రెండింతలు విరాళం ప్రకటించి సంచలనం సృష్టించాడు ప్రభాస్.

Image

ప్రభాస్.ఈ జాబితాలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చేరారు. ఏపీ, తెలంగాణలలో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్టు దిల్ రాజు సొంత చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ఇంతకుముందే పవన్ 2 కోట్లు, రాంచరణ్ 70 లక్షలు విరాళం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోటిరూపాయలు సినీ కార్మికులకు విరాళం ఇచ్చారు. హీరో నితిన్ 10 లక్షలు అందచేశారు. 

ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'ఓ డియర్' షూటింగ్ వాయిదా పడింది. దీంతో నాగ్ అశ్విన్ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు తెలుస్తోంది.ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసింది.  'ఓ డియర్' వాయిదా పడటంతో వైజయంతీ మూవీస్ సినిమాని కూడా వాయిదా వేశారని సమాచారం. మొత్తం మీద చూస్తే 2020లో ప్రభాస్ సినిమా రిలీజ్ కూడా కావని ఓ వార్త ఫిలిం వర్గాలలో హల్-చల్ చేస్తోంది. 'సాహో' సినిమా తరువాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle