newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

బాలయ్య బాబు బాగా బిజీ

12-06-201912-06-2019 07:07:58 IST
2019-06-12T01:37:58.028Z12-06-2019 2019-06-12T01:34:56.337Z - - 22-09-2019

బాలయ్య బాబు బాగా బిజీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
'ఎన్టీఆర్' సినిమాతో దారుణమైన పరాజయాన్ని చవిచూసిన బాలకృష్ణ ఏపీలో జరిగిన ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘనవిజయాన్ని సాధించారు. ఎన్నికలు పూర్తి కావడంతో బాలయ్య తిరిగి సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపాడు. ఈ నేపథ్యంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీకి దర్శకత్వం వహించేందుకు కేఎస్ రవికుమార్ కు ఛాన్స్ ఇచ్చారు. కేఎస్ రవికుమార్ కంటే ముందే బోయపాటి శ్రీను బాలయ్యకు కథ చెప్పాడు. 

బాలయ్యకు బోయపాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్టోరీని చెప్పారని కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా స్టోరీని మార్చామని బాలయ్య చెప్పడంతో ప్రాజెక్టు ఆలస్యమైందట. అంతే కాకుండా బోయపాటి సినిమాలో బాలకృష్ణ ఒక పాత్రలో చాలా స్లిమ్ గా కనబడాలట. దీంతో బాలయ్య మూడు నెలల టైంని బోయపాటిని అడిగారని అందుకే ఈ మూడు నెలల గ్యాప్ లో కేఎస్ రవికుమార్ తో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. 

 గతంలోనే బాలకృష్ణ-కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'జై సింహ' మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. హిట్ కాంబినేషన్ లో రెండో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకి ముందుగా 'రూలర్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కానీ ఈ టైటిల్ పై పాజిటివ్ ఫీడ్ రాకపోవడంతో వేరే టైటిల్ ని ఫిక్స్ చేశారు. 'క్రాంతి' అనే టైటిల్ ని చిత్రానికి ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో బాలయ్య పేరిట ఈ టైటిల్ ని ఫిక్స్ చేశారని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి.

'టెంపర్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర లాగే బాలయ్య పాత్ర ఈ చిత్రంలో ఉండనుందని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. హరిప్రియ, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్ర పూజ కార్యక్రమాలు బుధవారం జరగనున్నాయి. సి.కే ఎంటర్టైన్మెంట్స్ పై సి.కళ్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాని 2020 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle