newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

నీలినీలి ఆకాశానికి కరోనా దెబ్బ.. ప్రదీప్‌ ఆశలు నెరవేరేనా?

28-03-202028-03-2020 10:50:29 IST
Updated On 28-03-2020 10:53:33 ISTUpdated On 28-03-20202020-03-28T05:20:29.205Z28-03-2020 2020-03-28T05:20:25.371Z - 2020-03-28T05:23:33.308Z - 28-03-2020

నీలినీలి ఆకాశానికి కరోనా దెబ్బ.. ప్రదీప్‌ ఆశలు నెరవేరేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలను కుదిపేస్తోంది. కరోనా వైరస్ భయంతో సినిమా షూటింగులు, విడుదల ఆగిపోయాయి. ప్రముఖ టీవీ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ సినిమా టైటిల్ ఇప్పుడు యూత్ లో ట్రెండ్ అయింది. తొలిసారి హీరోగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుందామ‌నుకున్న ప్ర‌దీప్ ఆశలపై కరోనా వైరస్ నీళ్ళు చల్లింది. తాజా ప‌రిస్థితులతో ఆందోళన చెందుతున్నాడు ప్రదీప్.  ఈ సినిమాపై భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. అతను ఊహించని విధంగా కరోనా దెబ్బ‌కు సినిమా రిలీజ్‌లు వాయిదా ప‌డ‌టమేకాకుండా..థియేట‌ర్లు కూడా బంద్ అయ్యాయి. 

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్ర‌కారం మార్చిలో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కాస్తా..క‌రోనా ఎఫెక్ట్‌తో ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకొస్తుందో చెప్ప‌లేకపోతున్నారు. బుల్లితెరపై మెరిసిన ప్ర‌దీప్ ఇపుడు వెండితెరపై దూసుకుపోవాలని భావించాడు. ప్ర‌మోష‌న్స్‌తో పాటు చాలా క‌ష్టాలు ప‌డ్డాడు. తనకున్న పరిచయాలతో అన్ని టీవీఛానెల్స్ డిస్కషన్స్, షోలలో పాల్గొన్నాడు. కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్ డౌన్ మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రోజులు పెరుగుతూ విడుద‌ల జాప్యం అవుతుండ‌టంతో ప్రదీప్ డిఫ్రెషన్లో వున్నాడని ఫిలింన‌గ‌ర్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది.

రొమాంటిక్ డ్రామా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో అమృతా అయ్య‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. మున్నా ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ పాట ఎంత హిట్ అయిందో చెప్పలేం. 70 మిలియన్ల వ్యూస్ సాధించింది. నిర్మాత బాబు  ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందించడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.

కానీ ఏం లాభం కరోనా అన్నిటినీ తుడిచేసింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా 30 రోజుల తర్వాత అయిన విడుదల అవుతుందో లేదో చూడాలి. లాక్ డౌన్ మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో అనేక సినిమాల విడుదల వాయిదా పడింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle