newssting
BITING NEWS :
*హైదరాబాద్ లో చాప కింద నీరులా డ్రగ్స్ దందా..నిన్న పంజ‌గుట్ట‌లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రు యువ‌కుల అరెస్ట్ *హైదరాబాద్ లో మరో హత్య..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉదోగి హత్య*పదవతరగతి పరీక్షలు మరోసారి వాయిదా* ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం..18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ *తెలంగాణ, ఏపీ మధ్య బార్డర్ చెక్ పోస్టు రేపు ఎత్తివేత *ఆంధ్రప్రదేశ్‌లో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలి *గత 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 9,971 కరోనా కేసులు, 287 మంది మృతి.. 2,46,628కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 6,929 మంది మృతి *తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు 400 పైగా కేసులు.. తెలంగాణలో కొత్తగా 206 కొత్త కేసులు..మొత్తం 3496కి చేరిన పాజిటివ్ కేసులు. ఇందులో యాక్టివ్ కేసులు 1663 ఉండగా, కోలుకున్నవారు 1710 మంది ఉన్నారు..ఈరోజు కరోనాతో 10 మంది మృతి చెందారు..దీంతో మొత్తం మృతుల సంఖ్య 123*తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా వివాదం..ఇరువర్గాల పై కేసులు నమోదు చేసిన పోలీసులు *ఏపీలో ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు నమోదు.. మొత్తం 4460 కేసులు *విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రెండవరోజు హైపవర్ కమిటీ విచారణ

చెర్రీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ అప్ డేట్

27-03-202027-03-2020 07:44:56 IST
Updated On 27-03-2020 09:00:13 ISTUpdated On 27-03-20202020-03-27T02:14:56.852Z27-03-2020 2020-03-27T02:12:01.661Z - 2020-03-27T03:30:13.106Z - 27-03-2020

చెర్రీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్ఆర్ఆర్ అప్ డేట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్ఆర్ఆర్ మూవీ తన ట్రెండ్ కొనసాగిస్తోంది.  ఈచిత్రం పేరుని బయటపెట్టడంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం రౌద్రం రణం రుధిరం మోషన్ పోస్టర్ విడుదల కావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఉగాది సందర్భంగా టైటిల్‌ లోగోతో పాటు, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసి, అభిమానుల్లో ఆసక్తి పెంచేసింది చిత్ర బృందం.

Image

ఇవాళ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘బ్రదర్.. నీ పుట్టినరోజును ఘనంగా చేయాలని కోరుకుంటున్నా. మనం లాక్ డౌన్లో వున్నాం. ఇంట్లో ఉండడమే మనకు సేఫ్ 10 గంటలకు డిజిటల్ వేదికగా సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఈ సర్ ప్రైజక్ ఎప్పటికీ మర్చిపోలేవు’’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై వెంటనే స్పందించాడు చెర్రీ. ‘‘వావ్.. సరైన సమయంలో నేను ట్విటర్లో చేరా. లేదంటే నువ్వు ఇచ్చే అద్ధుతమయిన సర్ ప్రైజ్ మిస్ అయ్యేవాడిని బ్రదర్.. ’’ అంటూ ట్వీట్ చేశాడు,. వీరిద్దరి ట్వీట్లు అభిమానులకు మంచి కిక్ ఇస్తున్నాయి.

Image

ఈ నేపథ్యంలో చిత్రటీం ఒక అప్ డేట్ ఇచ్చింది. బీమ్ ఫర్ రామరాజు పేరుతో వీడియో విడుదల చేయనుంది. తెలుగు వీడియోను డీవీవీ మూవీస్, తమిళ వెర్షన్ ను తారక్, హిందీని అజయ్ దేవగఱ్, కన్నడను వారాహి, మలయాళం రామ్ చరణ్ ల సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ కు జంటగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ నటిస్తోంది. 300 కోట్లు ఈ మూవీకోసం ఖర్చుపెడుతున్నారు. కీరవాణి సంగీతం హైలైట్ అంటున్నారు. ఈ మూవీని జనవరి 8న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle