newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కరోనా బాధితులకు బన్నీ కోటి 25లక్షల విరాళం

27-03-202027-03-2020 13:34:23 IST
Updated On 27-03-2020 13:35:20 ISTUpdated On 27-03-20202020-03-27T08:04:23.318Z27-03-2020 2020-03-27T08:03:30.686Z - 2020-03-27T08:05:20.063Z - 27-03-2020

కరోనా బాధితులకు బన్నీ కోటి 25లక్షల విరాళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ విస్తరిస్తోంది. దేశంలో కేసులు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా సినీ ప్రముఖులు కరోనా బాధితులకు సాయం చేయడానికి ముందుకు వస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ 4 కోట్లు సాయం చేశారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి బాటలో బన్నీ కోటి25 లక్షల రూపాయల విరాళం ప్రకటించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల సహాయనిధికి మొత్తం కోటి 25 లక్షల చొప్పన విరాళం ప్రకటించాడు బన్నీ.

కరోనా బాధితులను ఆదుకునేందుకు అంతా ముందుకు రావాలని ఈ సందర్భంగా బన్నీ పిలుపునిచ్చాడు. ఈ కష్టకాలంలో అంతా మానవత్వంతో ఆలోచించాలని, తగిన సాయం అందించాలని కోరాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘కోవిడ్‌-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. అంతేకాకుండా మన రోజువారి జీవితాల్ని మార్చేసింది. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, మిలటరీ, పోలీసులు, ఇలా మన కోసం ఎంతగానో కష్టపడుతున్న వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. వారి స్ఫూర్తితో నా వంతుగా చిన్నపాటి సాయం చేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలకు రూ. 1.25 కోట్లు విరాళంగా ఇస్తున్నాను. చేతులను తరుచు కడుక్కోవడం, స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారా మనం కరోనా వ్యాప్తిని నివారించవచ్చు. అతి త్వరలోనే కరోనా అంతమవ్వాలని ఆశిస్తున్నాను’అని బన్నీ కోరాడు.

ఇటు, ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ కూడా కరోనాపై పోరాటానికి తన వంతు సాయం అందించారు. తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 5 లక్షల చొప్పును విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందచేస్తానన్నాడు సుకుమార్. ప్రముఖ నిర్మాత చినబాబు(ఎస్‌ రాధాకృష్ణ) కూడా కరోనాపై పోరాటానికి తనవంతు సాయంగా రూ. 20లక్షల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకు రూ. 10లక్షల చొప్పున విరాళం అందజేయనున్నారు. 

బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ అభిమానులు వున్నారు. ఈనేపథ్యంలోనే మూడు రాష్ట్రాలకు సాయం చేయాలని నిర్ణయించడం చర్చనీయాంశం అయింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle