newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఇల్లే కరోనా హాస్పిటల్.. కమల్ హాసన్ నిర్ణయానికి ప్రశంసలు

26-03-202026-03-2020 10:18:51 IST
Updated On 26-03-2020 11:45:15 ISTUpdated On 26-03-20202020-03-26T04:48:51.422Z26-03-2020 2020-03-26T04:48:45.499Z - 2020-03-26T06:15:15.416Z - 26-03-2020

ఇల్లే కరోనా హాస్పిటల్.. కమల్ హాసన్ నిర్ణయానికి ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ స్ఫూర్తికి నిలుస్తున్నారు  విలక్షణ నటుడు కమల్ హాసన్. దేశం కోసం తాను ఏమైనా చేస్తానని నిరూపించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు కమల్. తమిళనాడులో కమల్ హాసన్ అటు సినీ రంగాన్ని, రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దుకొంటూ స్వచ్ఛంద సేవలో నిరంతరం బిజీగా వుంటారు. ‘మక్కల్ నీది మైయమ్’ అనే పార్టీతో ప్రజలను చైతన్య పరుస్తూనే తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా బాధితుల కోసం కమల్ హాసన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన చూపిన మానవత్వానికి సలాం చేస్తున్నారు. 

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న సగటు ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రధాని మోదీకి కమల్ హాసన్ లేఖ రాశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి పనిచేయలేని రైతులకు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. కమల్ లేఖపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు కరోనా లాక్‌డౌన్‌తో చేసేందుకు పనిలేక, తినేందుకు తిండిలేక బాధపడుతున్నవారిని ఆదుకునేందుకు  కమల్ హాసన్ ముందుకు వచ్చారు. రెండురోజుల క్రితమే కమల్, శృతీహాసన్, అక్షర హాసన్ లు ముగ్గురు సెల్ప్ ఐపోలేషన్ కి వెళ్ళినట్టు ప్రకటించారు. జనం బయటకి రావద్దని, లాక్ డౌన్ పాటించాలన్నారు.

కరోనాతో ఉపాధి కోల్పోయిన రోజువారి వేతన కార్మికులు, పేద కార్మికులకు ఆహారం, అత్యవసర వస్తువులను అందించేందుకు రెడీగా ఉన్నానని ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే తాను ముందుకు వచ్చానని చెప్పారు. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు కమల్ మరో సంచలన నిర్ణయం తీసుకొన్నారు. తన ఇంటినే తాత్కాలిక హాస్పిటల్‌గా మార్చారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కమల్ కే సాధ్యం.. కమల్ సార్ మీరు చాలా  గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమల్ ప్రస్తుతం భారతీయుడు2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదం ఆయన్ని బాగా కదిలించింది. చిత్రయూనిట్ సభ్యులు ముగ్గురు మరణించడంతో వారికి ఆర్థిక సహాయం చేసేవరకూ షూటింగ్ కి వెళ్లలేదు కమల్. అంతేకాదు బాధిత కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు. 

కరోనా బాధితులకు సినీనటులు అనేకమంది సాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 2 కోట్ల విరాళం ప్రకటించారు. పేద కళాకారుల కోసం రాజశేఖర్, జీవితా దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కళాకారుల నిత్యావసరాలు అందించేందుకు ముందుకు వచ్చారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, నానిలు కూడా పేదలకు ఆహారం అందించానికి సాయం చేస్తున్నారు. మొత్తం మీద సిని ప్రముఖులు తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle