newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

23న ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం

18-05-201918-05-2019 08:57:46 IST
2019-05-18T03:27:46.941Z18-05-2019 2019-05-18T03:26:22.631Z - - 10-12-2019

23న ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు  ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ఈ నెల 23న జరగనుంది. కౌంటింగ్ కోసం ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 18 జిల్లాల్లోని 35 ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన 82 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈనెల 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకు మొత్తంగా 1,841 టేబుళ్లు ఏర్పాటు చేయను న్నట్లు వివరించారు. 110 సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్‌లో 15 టేబుళ్లను, నిజామాబాద్‌లోని 7 సెగ్మెంట్లలో 19 టేబుళ్లను, మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని మేడ్చల్, ఎల్‌బీనగర్‌లోని 2 సెగ్మెంట్లలో 29 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్‌ సబార్డినేట్స్, ఇద్దరు కార్మికులు, ఒక డీఈవో ఉంటారని వివరించారు. వీరితోపాటు 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఉంటారని, మొత్తం 6,745 మంది లెక్కింపులో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ర్యాండమ్‌గా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్లలోని పేపర్‌ స్లిప్పులను కూడా లెక్కిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల ప్రకటన 3 గంటలు ఆలస్యం కావొచ్చని రజత్‌ కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉంటే గత 40 రోజులుగా వీవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల సమీపంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కాపలా కాశారు. కేంద్ర రాష్ట్ర పోలీసులు స్ట్రాంగ్ రూంల భద్రతను పర్యవేక్షించారు. ఈ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్ధులతో పాటు కార్యకర్తలు, జనం కూడా ఎదురుచూస్తున్నారు. 

 

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

   3 hours ago


సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

   5 hours ago


దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్:  హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

   6 hours ago


దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

   6 hours ago


ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

   7 hours ago


 తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

   8 hours ago


అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

   8 hours ago


మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

   9 hours ago


రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

   11 hours ago


నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle