newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

విపక్షాలది గుడ్డి వ్యతిరేకత..మండిపడ్డ మంత్రులు

21-05-202021-05-2020 17:51:30 IST
Updated On 21-05-2020 17:59:19 ISTUpdated On 21-05-20202020-05-21T12:21:30.180Z21-05-2020 2020-05-21T12:21:22.742Z - 2020-05-21T12:29:19.561Z - 21-05-2020

విపక్షాలది గుడ్డి వ్యతిరేకత..మండిపడ్డ మంత్రులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి  వ్యవసాయం పటిష్టం చేసేందుకు కేసీఆర్ మహాయజ్ఞం చేస్తున్నారని, 40 రోజులుగా అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో సుధీర్ఘ చర్చలు జరిపారన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న అధికంగా ఉత్పత్తి అయ్యి నిల్వలు పేరుకుపోయాయని,  అందుకే ఈసారి మొక్కజొన్న పంట వేయొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారన్నారు. మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా కంది వేయాలని చెబుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సంస్కరణలు క్షేత్రస్థాయిలో రైతులు ఆహ్వానిస్తున్నారని,  నిర్మాణాత్మకమైన సూచనలు ఎప్పుడన్నా విపక్షాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చాయా ? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. 

నిరంతరం దుమ్మెత్తిపోయడమే విపక్షాల పనా ? మిమ్మల్ని సంప్రదించే రైతుబంధు ప్రవేశ పెట్టామా ? మిమ్మల్ని సంప్రదించే రైతు బీమా ప్రవేశపెట్టామా ? మిమ్మల్ని సంప్రదించే 24 గంటల కరంటు ఇచ్చామా ? మిమ్మల్ని సంప్రదించే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టామా ?  ప్రభుత్వం చేసిన ఏ మంచి పనైనా బాగుందని ప్రతిపక్షాలు స్వాగతించాయా ? అని ఆయన ప్రశ్నించారు.  తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తూలనాడడమే ఏకైక లక్ష్యంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కల్పించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని,  కాంగ్రెస్ హయాంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు..  ఆత్మహత్యలను రాజకీయంగా వాడుకోవడం తప్పితే రైతాంగంలో ఆత్మస్థైర్యం నింపే కార్యాచరణ కాంగ్రెస్ ఏనాడూ చేయలేదన్నారు.  వ్యవసాయంలో కూలీల కొరత తీర్చడానికే తెలంగాణ ప్రభుత్వం ఉపాధిహామీని అనుసంధానం చేయాలని కోరుతున్నదని, తెలంగాణ రైతుకున్న చైతన్యం దేశంలో ఎవరికీ ఉండదు .. నూతన విధానాన్ని వారు మనసారా ఆహ్వానిస్తారన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.  తెలంగాణ ప్రజలకు అన్ని పోషక ఆహారాలు అందుబాటులో ఉండాలన్నదే కేసీఆర్ ఉద్దేశమన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై విపక్షాల వ్యతిరేకతను ఎండగట్టారు మంత్రి. 

ఇటు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్  బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ అబిడ్స్ లోని బి టి ఎన్ జీ ఓస్ నూతన కార్యాలయాన్ని దేవీ ప్రసాద్, మమత, సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. బిజెపి నాయకులు దమ్ముంటే తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తీసుకురావాలన్నారు. కరోనా వచ్చినపుడు సహాయం కోరతామని.. కేంద్రం ఇచ్చిన నిధుల పై ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్నారు. బిజెపి నాయకులకు రోషం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇప్పించండన్నారు. బిజెపి నాయకులది ఓట్ల రాజకీయమని.. ప్రజల గుండెల్లో కేసీఆర్ స్టాంప్ పడిపోయిందని... బిజెపి నాయకులు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరన్నారు శ్రీనివాస్ గౌడ్. కరోనా వ్యాధి కంటే వలస కార్మికులు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భయంకరమైన కష్టాలు పడుతున్నారన్నారు. బిజెపి నాయకులవి తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు నాలుకలు, ఇప్పటికీ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   2 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   3 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   4 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   4 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   4 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   5 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   5 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   17 hours ago


 రాబోయే 24 గంటలు జాగ్రత్త అవసరం

రాబోయే 24 గంటలు జాగ్రత్త అవసరం

   17 hours ago


నీటి లెక్కలు తేల్చుకుంటాం.. తెలంగాణ:  మేమూ రెడీగా ఉన్నాం.. ఏపీ

నీటి లెక్కలు తేల్చుకుంటాం.. తెలంగాణ: మేమూ రెడీగా ఉన్నాం.. ఏపీ

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle