newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

వరవరరావు ఆరోగ్యం ఆందోళనకరం.. .. కుటుంబీకుల వినతి

02-07-202002-07-2020 21:48:55 IST
Updated On 02-07-2020 22:10:45 ISTUpdated On 02-07-20202020-07-02T16:18:55.046Z02-07-2020 2020-07-02T16:11:41.203Z - 2020-07-02T16:40:45.031Z - 02-07-2020

వరవరరావు ఆరోగ్యం ఆందోళనకరం.. .. కుటుంబీకుల వినతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన  విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మహారాష్ట్రలోని తలోజా జైలు సిబ్బంది ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. 

వరవరరావు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.  భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఆయన నివాసంలో అరెస్టయిన వరవరరావుని అనంతరం మహారాష్ట్రకు తరలించారు. ఇటీవల వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొద్దిరోజుల క్రితం కోర్టు కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. 

మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. అనంతరం ఈఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.

వరవరరావుని మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వివిధ పార్టీలకు చెందిన 14 మంది ఎంపీలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేకు లేఖ రాశారు. ఆయన అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం వారు అభ్యర్థించారు. 

‘‘వీవీ నుంచి నాకు ఈరోజు ఫోన్ వచ్చింది. ఆయన ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగానే వుంది. మాట్లాడినప్పుడు తన గొంతు బలహీనంగా, ముద్దగా ఉంది. మాట పొంతన లేకుండా వుంది. వీవీని ఆస్పత్రిలో చేర్పించి చికిత్ప చేయాల్సిన అవసరం వుంది. అలాగే నేను వీవీని కలవడానికి ముంబై వెళుతున్నాననే ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. అక్కడి కోర్టు అనుమతి లేకుండా వీవీని కలవడం సాధ్యంకాదు’’ అని ఒక ప్రకటనలో తెలిపారు వరవరరావు సతీమణి హేమలత

వరవరరావుకి మెరుగైన వైద్యం అందించాలి.. మహారాష్ట్ర సీఎంకి ఎంపీల లేఖ


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle