newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

వరల్డ్ టాప్-10లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చోటు!

10-05-201910-05-2019 16:54:45 IST
Updated On 29-06-2019 12:12:00 ISTUpdated On 29-06-20192019-05-10T11:24:45.222Z10-05-2019 2019-05-10T11:24:40.096Z - 2019-06-29T06:42:00.994Z - 29-06-2019

వరల్డ్ టాప్-10లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చోటు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రయాణికులకు సేవలందించడంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు గొప్ప ప్రగతి సాధించింది. ప్రపంచంలోని టాప్‌టెన్‌ ఎయిర్‌పోర్టుల్లో 8వ ర్యాంకు పొందింది. ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో నిలవగా.. టోక్యో, ఏథెన్స్‌ ఎయిర్‌పోర్టులు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా నుంచి మరే ఇతర ఎయిర్‌పోర్టు టాప్‌ 20లో కూడా నిలవలేదు. అయితే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 24వ స్థానంలో నిలిచింది. ఇక అత్యంత చెత్త ఎయిర్‌పోర్టులుగా.. లండన్‌లోని గత్విక్‌, కెనడాలోని బిల్లీ బిషప్‌ విమానాశ్రయాలు నిలిచాయి. 

అగ్రభాగాన రెండోసారి ఖతార్ నిలిచింది. ఎయిర్‌లైన్స్‌ సేవల్లో కూడా ఖతార్‌ వరుసగా రెండో ఏడాది మొదటి ర్యాంకు సాధించింది. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిరోమెక్సికో, ఎస్‌ఏఎస్‌ స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఖంతాస్‌ ఎయిర్‌లైన్స్‌ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వరస్ట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసుల్లో ర్యానైర్‌ ఎయిర్‌వేస్‌, కొరియన్‌ ఎయిర్‌, కువైట్‌ ఎయిర్‌వేస్‌, యూకేకు చెందిన ఈస్ట్‌ జెట్‌, థామస్‌ కుక్‌ టాప్‌ ర్యాంకుల్లో నిలిచాయి.

టాప్‌ టెన్‌ ఎయిర్‌పోర్టులు..

1. హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - ఖతర్‌

2. టోక్యో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - జపాన్‌

3. ఏథెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - గ్రీస్‌

4. అఫోన్సో పీనా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్‌

5. డాన్సిక్‌ లెచ్‌ వాటెసా​ ఎయిర్‌పోర్టు - పోలెండ్‌

6. మాస్కో షెరెమ్‌త్యేవో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - రష్యా

7. సింగపూర్‌ చాంగీ ఎయిర్‌పోర్టు - సింగపూర్‌

8. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఇండియా

9. టెనెరిఫ్‌ నార్త్‌ ఎయిర్‌పోర్టు - స్పెయిన్‌

10. విరాకోపోస్‌/కాంపినాస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్‌

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అతి తక్కువ కాలంలోనే ప్రయాణికుల ఆదరణ పొందింది. హైదరాబాదు నగరానికి సుమారు 22 కి.మీ దూరంలో శంషాబాద్ వద్ద నెలకొల్పబడింది. ఈ విమానాశ్రయం అంతకు ముందున్న బేగంపేట విమానాశ్రయం స్థానంలో మార్చబడింది. ఈ విమానాశ్రయం ద్వారా వాణిజ్య సేవలను మార్చి 23 2008 నుండి ప్రారంభించారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత పబ్లిక్-ప్రైవేట్ ఉమ్మడి నిర్వహణలో నడుపబడుతున్న రెండవ విమానాశ్రయం. 2010-11 లో భారతదేశ విమానాశ్రయాలలో అతి రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఆరవస్థానం పొందింది. ఈ విమానాశ్రయంలో జి.ఎం.ఆర్ గ్రూపు 63శాతం, తెలంగాణ ప్రభుత్వం మరియు ఎయిర్ పోర్ట్స్ ఆఫ్ ఇండియాలకు 13శాతం వాటాలున్నాయి. ఈ విమానాశ్రయాన్ని మూడు దశలలో అభివృద్ధి చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అనేక అవార్డులు పొందింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌కి  ఉత్తమ 'కార్గో ఎయిర్ పోర్ట్' అవార్డు లభించింది. ఈ అవార్డు రెండుసార్లు అందుకుంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle