newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ల‌ష్క‌ర్ విజేత ఆయ‌నేనా..?

17-04-201917-04-2019 08:33:51 IST
Updated On 18-04-2019 15:32:14 ISTUpdated On 18-04-20192019-04-17T03:03:51.193Z17-04-2019 2019-04-17T03:03:41.292Z - 2019-04-18T10:02:14.107Z - 18-04-2019

ల‌ష్క‌ర్ విజేత ఆయ‌నేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సికింద్రాబాద్ పార్ల‌మెంటు స్థానంపై భార‌తీయ జ‌న‌తా పార్టీ భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. సిట్టింగ్ స్థాన‌మైన ఈ సీటును తిరిగి ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న పార్టీ బాగానే ప్ర‌య‌త్నించింది. బీసీలు ఎక్కువ‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టిసారిగా ఓసీని నిల‌బెట్టి ప్ర‌యోగం చేసింది. పార్టీ బ‌లానికి అభ్య‌ర్థి కిష‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మా కూడా తోడ‌వ‌డంతో మ‌ళ్లీ ల‌ష్క‌ర్ సీటు మాదే అని బీజేపీ ధీమాగా ఉంది.

ఆదినుంచీ సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు జాతీయ పార్టీల‌నే ఆద‌రించారు. అయితే, కాంగ్రెస్ లేదా బీజేపీ అన్న‌ట్లుగానే ఇక్క‌డి ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చారు. ఒక్క‌సారి మిన‌హా నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన నాటి నుంచి ఇక్క‌డ ఈ రెండు పార్టీలే గెలుస్తూ వ‌చ్చాయి. ఈసారి మాత్రం టీఆర్ఎస్ ఇక్క‌డ బాగా బ‌ల‌ప‌డింది. క‌చ్చితంగా విజ‌యం సాధిస్తామ‌ని న‌మ్మ‌కంగా ఉంది. సికింద్రాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఆరు టీఆర్ఎస్ చేతిలోనే ఉండ‌టం, మ‌రో స్థాన‌మైన నాంప‌ల్లిలో మిత్ర‌ప‌క్షం ఎంఐఎం ఎమ్మెల్యే ఉండ‌టం టీఆర్ఎస్‌కు బాగా క‌లిసి వ‌చ్చింది.

టీఆర్ఎస్ నుంచి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కుమారుడు సాయికిర‌ణ్ యాద‌వ్‌, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ బ‌రిలో నిలిచారు. అంజ‌న్ సైతం ఇక్క‌డినుంచి రెండుసార్లు ఎంపీగా ప‌నిచేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో త్రిముఖ పోటీ జ‌రిగింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ ప‌రిధిలో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ సుమారు రెండు ల‌క్ష‌ల ఓట్లు అధికంగా సాధించింది. బీజేపీ మూడో స్థానంలో ఉంది.

గ‌తంలో ఎప్పుడూ క‌నీసం రెండో స్థానంలో కూడా నిల‌వ‌లేక‌పోయిన టీఆర్ఎస్ ఈసారి ల‌ష్క‌ర్‌లో గులాబీ జెండా ఎగ‌రేయ‌డం ఖాయ‌మ‌ని ధీమాగా ఉంది. అయితే, పోలింగ్ స‌ర‌ళిని చూస్తే టీఆర్ఎస్‌కు అంత ఈజీ కాద‌నే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పోటీ చేసిన మూడు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల్లో కిష‌న్ రెడ్డి బ‌లంగా క‌నిపిస్తున్నారు. ఆయ‌నకు నియోజ‌కవ‌ర్గంలో మంచి గుర్తింపు ఉంది. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌ను గౌర‌విస్తారు. ఇది ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఉత్త‌ర భార‌తీయుల ఓట్లు గ‌ణ‌నీయంగా ఉండ‌టం బీజేపీకి క‌లిసి వ‌చ్చింది. అంబ‌ర్ పేట‌లో స్వ‌ల్ప తేడాతో ఓడిన కిష‌న్ రెడ్డి ప‌ట్ల బాగా సానుభూతి ఉంది. ఇక్క‌డి ఆయ‌న‌కు టీఆర్ఎస్ కంటే ఎక్కువ‌గా ఓట్లు రావ‌చ్చు. ముషిరాబాద్‌, ఖైర‌తాబాద్ లోనూ కిష‌న్ రెడ్డికే ఎక్కువ ఓట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. స‌న‌త్ న‌గ‌ర్‌, సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, జూబ్లీహిల్స్ లో టీఆర్ఎస్ వైపు మొగ్గు క‌నిపిస్తోంది. పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు, సామాజ‌క‌వ‌ర్గ బ‌లంగా ఉన్న కాంగ్రెస్ అభ్య‌ర్థి అంజ‌న్ కుమార్ యాద‌వ్ ఓట్లు బాగానే సాధించే అవ‌కాశం ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం కిష‌న్ రెడ్డి, త‌ల‌సాని సాయి కిర‌ణ్ మ‌ధ్యే జ‌రిగింది.

అభ్య‌ర్థి ఎంపిక టీఆర్ఎస్‌కు కొంత మైన‌స్ గా క‌నిపిస్తోంది. సాయి కిర‌ణ్‌కు తండ్రి బ‌లం క‌లిసివ‌చ్చినా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇది బాగా న‌ష్టం చేసిన‌ట్లు ఉంది. మొత్తానికి టీఆర్ఎస్ - బీజేపీ మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగిన‌ట్లు క‌నిపించింది. బీజేపీకి ఇక్క‌డ ఎక్కువ విజ‌యావ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల సమరంపై ప్రత్యేక కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

నిజామాబాద్‌లో గెలుపెవరిది? https://www.newssting.in/p/5cb553dd8d8b2455686b3cef

 

కరీంనగర్ ఫైట్ https://www.newssting.in/p/5cb555b78d8b2455686b3cf1

 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   4 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle