newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

మండుటెండల్లో మెట్రో జర్నీ హాయ్.. హాయ్!

17-05-201917-05-2019 15:23:44 IST
Updated On 27-06-2019 16:42:34 ISTUpdated On 27-06-20192019-05-17T09:53:44.587Z17-05-2019 2019-05-17T09:53:38.930Z - 2019-06-27T11:12:34.693Z - 27-06-2019

మండుటెండల్లో మెట్రో జర్నీ హాయ్.. హాయ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. బయటకు వెళ్లాలంటేనే జనం ఎండకు భయపడిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇప్పుడు సరికొత్త ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. నగరంలో ఇంతకుముందు ప్రజా రవాణాకు ఆర్టీసీతో పాటుగా ఎంఎంటిఎస్‌ రైళ్లు, ఆటోలు, క్యాబ్, ఓలా వంటి వాహనాలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు హాయిగా, ఏసీలో ప్రయాణించేందుకు మెట్రో రైలు వచ్చేసింది. దీంతో జనం తమ వాహనాలను పార్కింగ్ ప్రాంతాల్లో ఉంచి మెట్రో ఎక్కేస్తున్నారు. 

ఆర్టీసీతో పోలిస్తే కాస్త ఖర్చు ఎక్కువైనా మెట్రో ప్రయాణం హాయిగా ఉందంటున్నారు. ప్రయాణంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు.  మెట్రో రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు మెరుగ్గా ఉండటం చేత రాకపోకలు సులభంగా సాగిస్తున్నారు.

తాజాగా నాగోల్-హైటెక్ సిటీ మార్గంలో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా ఈ మార్గంలో జూబ్లిహిల్స్ స్టేషన్ శనివారం ప్రారంభం కానుంది. ఇది ప్రారంభం అయితే ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరగగలదని మెట్రో అధికారులు చెబుతున్నారు. 

Image may contain: 4 people

నిన్న మొన్నటిదాకా అంతగా ఆదరణ లేని మెట్రో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. స్టేషన్లలో ప్రయాణించే మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైలులో కూర్చోవడానికి కూడా వీలులేనంతగా ఎక్కేస్తున్నారు. సుదూర ప్రయాణమైనా నిల్చొని ప్రయాణిస్తున్నారు. ఏసీ ఉండడంతో ప్రయాణ బడలిక కనిపించడంలేదు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే రాకపోకలు సాగిస్తున్నాయి.

రైళ్లలో ఏసీని వినియోగించడం, రైల్వే స్టేషన్లలో లిప్టులు, ఎస్కలేటర్లు, మంచినీరు, ఏటీఎం,  పార్కింగ్‌ వంటి సౌకర్యాలను సమకూర్చడంతోనే ఎక్కువ మంది మెట్రో రైళ్లలో ప్రయాణం సాగిస్తున్నారు. 

హైటెక్ సిటీ నుంచి నాగోల్ వెళ్లే ఉద్యోగులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మాదాపూర్ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్ళే రాఘవ్ అనే ప్రయాణికుడు తనకు మెట్రో ప్రయాణం హాయిగా ఉందని, టూ వీలర్ పార్కింగ్ చేసి మెట్రో ఎక్కి వచ్చేస్తున్నానని జర్నీ అద్భుతంగా ఉందని ‘న్యూస్ స్టింగ్’ తో తన ఆనందం పంచుకున్నారు.

Image may contain: 8 people, people smiling, people standing

రాఘవ్ లాంటి ప్రైవేట్ ఉద్యోగులు ఖర్చుకి వెనుకాడకుండా మెట్రోని ఎంచుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులైతే ఇది తమకు వరంలా మారిందంటున్నారు. మహిళా ఉద్యోగులు మెట్రో ప్రయాణం తమకు సేఫ్ అంటున్నారు. 

ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆక్యుపెన్సీ తక్కువగా ఉందని ఆర్టీసీ కండక్టర్లు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలా వరకు బస్సులు ఖాళీగానే రాకపోకలు సాగిస్తున్నామని కండక్టర్లు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఎక్కితే ఉక్కపోతతో ప్రయాణికులు బస్సు జర్నీ అంటే అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.

దీంతో మెట్రోలో  డబ్బులు ఎక్కువైనా సరే ఏసీలో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణం ముగించుకుంటూ ఇంట్లోకి చేరుతున్నారు.  మెట్రో రావడంతో వాహనాల రాకపోకలు కూడా తగ్గాయని, కాలుష్యం తగ్గుముఖం పడుతోందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మియాపూర్-ఎల్బీ నగర్ మార్గంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య కూడా తగ్గింది. ఈబస్సుల్ని రద్దీగా ఉండే, మెట్రో అందుబాటులో లేని ప్రాంతాలకు ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle