newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాలకు ఎర.. మునిసిపల్స్ సిత్రాలు

21-01-202021-01-2020 09:41:45 IST
2020-01-21T04:11:45.013Z21-01-2020 2020-01-21T04:11:28.162Z - - 21-09-2020

ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాలకు ఎర.. మునిసిపల్స్ సిత్రాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల ఘట్టంలో కీలకమయిన ప్రచారం సోమవారం సాయంత్రానికే ముగిసింది. బుధవారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగియడంతో ఎన్నికల సంఘం పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 22న పోలింగ్ జరుగనుండగా.. 25న ఓట్ల లెక్కింపు చేపడతారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీల్లో 6325 పోలింగ్ కేంద్రాలు, 9 కార్పొరేషన్లలో 1586 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఎన్నికలు జరుగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 53, 36, 505 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్స్, బార్లు మూసి ఉంచాలని పోలీసు శాఖ ఆదేశించింది. అదే విధంగా ఎస్సెమ్మెస్, ఇంటర్నెట్ ద్వారా ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం తెలిపింది. ఇటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపులను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో భారీగా మద్యం పట్టుబడుతోంది. అభ్యర్ధులు మందుబాబుల కోసం మద్యం కొని దాచేస్తున్నారు. 

ఇటు అభ్యర్ధులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ఎత్గుగడలు వేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్లు మాంసం ప్రియులకు చికెన్ పంపిణీ చేస్తున్నారు. కిలోకి తగ్గకుండా ఆర్మూర్లో అభ్యర్ధులు చికెన్ పంచుతున్నట్టు తెలుస్తోంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రలోభాలు భారీగా ఉన్నాయి. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో కుంకుమ భరిణెలు అందిస్తున్నారు. ఎక్కువ ఓట్లున్నవారికి బైక్ లు వల విసురుతున్నారు. ఓటర్ల విషయంలో వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్నారు. కొందరికి మద్యం, మరికొందరికి వస్తువులు, సామగ్రి వంటివి పంపిణీ చేస్తున్నారు.డబ్బులు బాగా ముట్టజెప్పే వారు దేవుడిపై ప్రమాణం చేయించుకుని ఓటర్లపై సెంటిమెంట్ ఆయుధం ప్రయోగిస్తున్నారు. 

హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లిలో ఓటర్లతో సాముహిక విందు ఏర్పాటుచేశారు. వెయ్యి నుంచి రెండువేలు ఓటుకి ఇస్తున్నారు. కౌన్సిలర్ అభ్యర్ధులు డబ్బుని ఖర్చుపెట్టేందుకు వెనుకాడడం లేదు. ఖమ్మం జిల్లాలోని మునిసిపాలిటీల్లో రెండువేలు, 25 కిలోల బియ్యం ప్యాకెట్ ఇస్తున్నారు. ఎన్నికల సంఘానికి దొరకకుండా కూపన్ల రూపంలో వీటిని ఇస్తున్నారు. కాదేదీ ప్రలోభాలకు అనర్హం అన్నట్టు తెలంగాణ వ్యాప్తంగా అభ్యర్ధులు ఓటర్లను వలలో వేసుకుంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle