newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

న‌మ్మినబంటుకు కేసీఆర్ న్యాయం చేస్తారంట‌..!

09-07-201909-07-2019 08:06:03 IST
Updated On 09-07-2019 11:49:06 ISTUpdated On 09-07-20192019-07-09T02:36:03.504Z09-07-2019 2019-07-09T02:36:00.495Z - 2019-07-09T06:19:06.913Z - 09-07-2019

న‌మ్మినబంటుకు కేసీఆర్ న్యాయం చేస్తారంట‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవ‌లి పార్ల‌మెంటు ఎన్నిక‌లు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు చేదు ఫ‌లితాలు మిగిల్చాయి. 16 సీట్లు గెలుస్తామ‌నుకున్న ఆయ‌న అంచ‌నాలు త‌ప్పి 9 సీట్ల‌తో గులాబీ పార్టీ స‌రిపెట్టుకుంది.

అన్నింటి కంటే ముఖ్యంగా నిజామాబాద్‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌, క‌రీంన‌గ‌ర్‌లో బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ ఓడిపోవ‌డం పార్టీతో పాటు కేసీఆర్‌కు కూడా తీవ్ర ఎదురుదెబ్బ‌.

ఇద్ద‌రూ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు. క‌విత కేసీఆర్ కూతురు కాగా, వినోద్ కుమార్ కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు. టీఆర్ఎస్ స్థాప‌న నుంచి తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు ఆయన కేసీఆర్‌కు కుడిభుజంలా వ్య‌వ‌హ‌రించారు.

అనేక సంద‌ర్భాల్లో కేసీఆర్‌కు ఆయ‌న అండ‌గా నిలిచారు. వినోద్ కుమార్‌ ఓడిపోవ‌డంతో మ‌రో ర‌కంగా ఆయ‌న‌కు న్యాయం చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వినోద్ కుమార్‌ను మంత్రివ‌ర్గ విస్త‌రణ‌లో క్యాబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. తెలంగాణ క్యాబినెట్‌లో మ‌రో ఆరుగురిని తీసుకునే అవ‌కాశం ఉంది. వ‌రుస ఎన్నిక‌ల వ‌ల్ల క్యాబినెట్ విస్త‌ర‌ణ ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.వ‌చ్చే నెల‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఉండే అవ‌కాశం ఉండ‌టంతో ఆ ఎన్నిక‌లు ముగ‌య‌గానే క్యాబినెట్ విస్త‌ర‌ణ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

అయితే, ఎప్పుడు విస్త‌ర‌ణ జ‌రిగినా వినోద్ కుమార్‌ను ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్‌లోకి తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. వినోద్ కుమార్‌కు ఒక బెర్త్ ఖాయ‌మైందని పార్టీలోనూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే, వినోద్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుంటే సామాజ‌క‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల్లో భాగంగా కేటీఆర్ లేదా హ‌రీష్‌రావును తీసుకోక‌పోవ‌చ్చు. వెల‌మ‌ సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఇప్ప‌టికే క్యాబినెట్‌లో ఉన్నారు.

ఇప్పుడు వినోద్ కుమార్‌ను కూడా తీసుకుంటే కేసీఆర్ స‌హా క్యాబినెట్‌లో ఒకే సామాజ‌క‌వ‌ర్గం నుంచి ముగ్గురు ఉన్న‌ట్ల‌వుతుంది. కేటీఆర్‌, హ‌రీశ్‌ను సైతం తీసుకుంటే ఐదుగురు అవుతారు.

దీంతో అన్ని సామాజ‌క‌వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌డం క‌ష్టం అవుతుంది. గ‌త క్యాబినెట్‌లో వెలమ సామాజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్ స‌హా న‌లుగురు మంత్రులు ఉన్నారు. ఈసారి కూడా అంత‌కు మించి తీసుకునే అవ‌కాశాలు త‌క్కువే. దీంతో వినోద్ క్యాబినెట్‌లోకి వ‌స్తే మాత్రం కేటీఆర్‌, హ‌రీష్ రావుల‌లో ఒక‌రికి మాత్రం ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle