newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

తెలంగాణ కాంగ్రెస్ పయనం ఎటువైపు?

02-07-202002-07-2020 12:54:25 IST
Updated On 02-07-2020 16:42:40 ISTUpdated On 02-07-20202020-07-02T07:24:25.631Z02-07-2020 2020-07-02T07:24:14.984Z - 2020-07-02T11:12:40.559Z - 02-07-2020

తెలంగాణ కాంగ్రెస్ పయనం ఎటువైపు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎటువెళ్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రస్థానం ఒడిదుడుకులతో సాగుతూనే వుంది. ఎన్నో ఏండ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయిన టీ ఆర్ ఎస్ చేతిలో ఓటమిని చవిచూసింది.  ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున కాంగ్రెస్ పార్టీకి తగిన హోదా లేకుండా పోయింది. కానీ కేసీఅర్ ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. 

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకే నియోజకవర్గ పరిధిలోని నాయకుల్లో తరుచు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని పార్టీ అధిష్టానం సైతం చూసి చూడనట్లు వ్యవహరించేది. కానీ 2018 ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చాయి. ప్రస్తుతం నలుగురైదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 3 ఎంపీలు మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తున్నారు. మిగతా లీడర్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ప్రభుత్వ లోపాలను ప్రధానంగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎత్తి చూపుతున్నారు. 

రేవంత్ రెడ్డి తో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భువనగిరి ఎంపి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడ్  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీహెచ్ హన్మంతరావు, మల్లు భట్టి విక్రమార్కుడు, మల్లు రవిలతో పాటు మరి కొందరు మాత్రమే రాష్ట్రంలో ఉన్న సమస్యలపై తమ గొంతును వినిపిస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణలో కేసీఅర్ సర్కార్ రెండేళ్ళ పదవీకాలం ముగించుకుంది. ఇంకా ఎన్నికలకు మూడేళ్ళ కాలం మాత్రమే ఉంది. రాబోయే ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. 

రాష్ట్రంలో కొంత మంది కాంగ్రెస్ లీడర్లు మాత్రమే ఫేమస్ అవుతున్నారు. దీనివల్ల మిగతా లీడర్ల పరిస్థితి ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని నాయకులు కింది స్థాయి కార్యకర్తలను పాటించుకోక పోవడం కూడా పార్టీలో ప్రధాన సమస్యగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబీర్ అలీ, శ్రీధర్ బాబు వంటి వారు.. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. 

అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో కొంత మేర కాంగ్రెస్ హవా నడుస్తుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోను కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఈ మూడేళ్ల కాలాన్ని సరిగ్గా వాడుకొని ప్రజల్లోకి వెళ్తే కొంత మేర పార్టీ పట్టు సాధించే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మూడేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన సీట్లు కూడా గెలచుకోవడం అనుమానమే.

కాంగ్రెస్ నేతలు ఇదే విధంగా ముందుకు సాగితే మరోమారు అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం స్వంతం చేసుకోవడం ఖాయం. మూడేళ్ళే కాంగ్రెస్ పార్టీకి కీలకం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందని భావించినా అది జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో మార్పు ఉంటుందని ఊహించలేం. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle