newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

తెలంగాణలో మళ్లీ 1,018 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కేసులు 17,000

02-07-202002-07-2020 07:13:07 IST
Updated On 02-07-2020 10:56:52 ISTUpdated On 02-07-20202020-07-02T01:43:07.893Z02-07-2020 2020-07-02T01:43:03.254Z - 2020-07-02T05:26:52.805Z - 02-07-2020

తెలంగాణలో మళ్లీ 1,018 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కేసులు 17,000
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వ‌హించ‌గా కొత్తగా 1,018 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 788 మంది డిశ్చార్జ్‌ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,082గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా నేడు కరోనాతో మరో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 267కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 881 ఉండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది.

ఒకే రోజులో మరోసారి వెయ్యి దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరోసారి వెయ్యి మార్కును దాటింది. జూన్ 27న 1,087 కేసులు నమోదు కాగా మళ్లీ ఈరోజే అంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. ప్ర‌భుత్వం టెస్టులు పెంచిన త‌ర్వాత రోజుకో కొత్త రికార్డు త‌ర‌హాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే జూన్ 27 తర్వాత 24 గంటల్లో వెయ్యిలోపే కేసులు నమోదు అవుతూ వచ్చాయి. మళ్లీ నాలుగు రోజుల తర్వాత ఈరోజే 1,018 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు ఏడుగురు కరోనా వల్ల మృతి చెందారు.

ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇంతకు ముందుతో పోల్చితే ఈ రెండు జిల్లాల్లో బుధవారం తక్కువ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాల్లో ఈరోజు కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357కు పెరిగింది. 

కాగా బుధవారం నమోదైన మరణాలతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వల్ల 267 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,008 యాక్టివ్ కేసులు ఉండగా, 8,082 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle