newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

20-01-202020-01-2020 18:30:36 IST
Updated On 21-01-2020 11:01:31 ISTUpdated On 21-01-20202020-01-20T13:00:36.069Z20-01-2020 2020-01-20T13:00:34.019Z - 2020-01-21T05:31:31.769Z - 21-01-2020

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ధర్మపురి శ్రీనివాస్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ డీఎస్ అంటే ఇట్టే గుర్తుపడతారంతా. కాంగ్రెస్ పార్టీని వీడీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఆయన చాలాకాలం నుంచి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల వేళ ఆయన మళ్లీ మీడియా ముందుకి వచ్చారు. సోమవారం మనసు మాటల బయటపెట్టారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశానని పశ్చాత్తాపానికి గురయ్యారు.

కాంగ్రెస్ పార్టీని వీడడానికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో దిగ్విజయ్ సింగ్ తనకు వ్యతిరేకంగా సోనియాకు నివేదిక ఇచ్చారన్న అలకతో కాంగ్రెస్ పార్టీని వీడానని చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. ఒక్క కుటుంబం బాగుపడినంత మాత్రాన బంగారు తెలంగాణ వచ్చినట్టు కాదన్నారు. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డిపై మండిపడ్డారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి తల తిక్క మాటలు మానుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. ప్రశాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను చేసింది తప్పు అని నిరూపించే ధైర్యం ఉంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి చూడాలనిని కేసీఆర్‌కు సవాల్ విసిరారు డిఎస్. కొంత మంది ఎమ్మెల్యేలు తమకు ఇష్టం లేకున్నా తన సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు పెట్టారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే చర్యలు తీసుకోవాలన్నారు. తన రాజకీయ ప్రస్తానంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో వుండగానే ఆయన తనయుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి బీజేపీ తరఫున లోక్ సభకు పోటీచేసి గెలిచారు. ఈ సీటులో కవిత ఓటమి పాలవ్వడంతో గులాబీనేతలు డీఎస్ పై గుర్రుగా వున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ పై సీఎం కేసీయార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle