newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ మెడకు ఈడీ ఉచ్చు

02-07-202002-07-2020 12:08:13 IST
Updated On 02-07-2020 19:03:59 ISTUpdated On 02-07-20202020-07-02T06:38:13.977Z02-07-2020 2020-07-02T06:37:57.550Z - 2020-07-02T13:33:59.115Z - 02-07-2020

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ మెడకు ఈడీ ఉచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ శాటిలైట్ వార్తా ఛానెల్ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఈడి కేసు నమోదు చేసింది. అక్రమంగా నిధులు  విత్ డ్రా చేసినందుకు రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌నుంచి 2018 సెప్టెంబర్‌ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను విత్ డ్రా చేసిన రవిప్రకాశ్‌, మరో ఇద్దరు ఉద్యోగులు. అనుమతుల్లేకుండా డబ్బులు విత్ డ్రా చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది నూతన యాజమాన్యం.

గతంలోనే ఈ ఫిర్యాదుపై రవి ప్రకాష్ తో పాటు పలువురు పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు రవిప్రకాష్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేయడంతో కేసు వేగం పుంజుకుంది. రవిప్రకాష్ విత్ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించాడన్న అంశంపై  ఆరా తీయనుంది ఈడీ. ఇదే అంశంపై రవిప్రకాష్ ను విచారించనుంది ఈడీ. 

2018 సెప్టెంబర్ నుండి 2019 మే వరకు యాజమాన్యానికి తెలియకుండా రవి ప్రకాష్ నిధుల్ని ఉపసంహరించినట్లుగా చెప్తున్నారు. ఈ  నిధుల విషయంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ వర్గాలు ఎన్ ఫోర్స్ మెంట్ కేసు నమోదు చేశాయి. 2019 అక్టోబర్ లో ఇదే వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. గతంలో ఆయన మీద టీవీ9 యాజమాన్యం ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్‌ టీవీ 9 నిధులు ఫోర్జరీ డాక్యుమెంట్ లతో మళ్ళించారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై నమోదైన కేసులు తెలిసిందే.

ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డి కలిసి రవి ప్రకాష్ సొంత మొబైల్ టీవీకి టీవీ9 లోగోలను యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేశారని , టీవీ 9 కు వచ్చే యాడ్స్ ను కూడా సదరు మొబైల్ టీవీ కి మళ్ళించారని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

టీవీ 9 లోగోను మెజార్టీ వాటాదారులకు తెలీకుండా అమ్మేశారనే ఫిర్యాదు మేరకు కూడా ఆయనపై అప్పట్లోనే కేసు నమోదయ్యింది.ఇప్పటికే నమోదైన కేసులతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న రవి ప్రకాష్ పై ఇప్పుడు మరో కేసు నమోదు అయ్యింది. ఆయన మెడకు ఈడీ ఉచ్చు బిగుస్తుంది. ఈయనపై ఈడీ ఇప్పుడు విచారణ జరపనుంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle