newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

టీఆర్ఎస్‌కు వార్నింగ్ బెల్స్

31-05-201931-05-2019 11:45:11 IST
Updated On 25-06-2019 14:09:28 ISTUpdated On 25-06-20192019-05-31T06:15:11.300Z31-05-2019 2019-05-31T06:15:09.259Z - 2019-06-25T08:39:28.596Z - 25-06-2019

టీఆర్ఎస్‌కు వార్నింగ్ బెల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో 16 సీట్లు సాధిస్తామ‌ని ధీమాగా వ్యక్తం చేసిన‌ తెలంగాణ రాష్ట్ర స‌మితికి లోక్ సభ ఎన్నికల ఫ‌లితాలు షాక్ ఇచ్చాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రిపీట్ అయ్యి స్వీప్ చేస్తామ‌నుకున్నా ఆ పార్టీకి పార్లమెంటు ఎన్నిక‌లు డేంజ‌ర్ బెల్స్ మోగించాయి. నాలుగు నెల‌ల్లోనే టీఆర్ఎస్ సీన్ రివ‌ర్స్ అయ్యింది. కేవ‌లం 9 పార్లమెంటు స్థానాల‌కే ప‌రిమితం అవ్వాల్సి వ‌చ్చింది. ఈ ఫ‌లితాల‌ను స‌మీక్షించుకోక‌పోతే టీఆర్ఎస్ కు భ‌విష్యత్ లో తీవ్ర న‌ష్టం త‌ప్పదు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. త‌ర్వాత స్వతంత్ర అభ్యర్థులుగా, కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన 12 మందికి పైగా ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకోవ‌డంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 100కు చేరింది. కానీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అనుకున్న స్థాయిలో స‌త్తా చాట‌లేక‌పోయింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకుంది. మ‌రో రెండు సీట్లను కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో కోల్పోయింది. ఒక స్థానంలో టీఆర్ఎస్ మిత్రప‌క్షం ఎంఐఎం విజ‌యం సాధించింది.

ఒక్కో పార్లమెంటు ప‌రిధిలో 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అంటే టీఆర్ఎస్ 9 పార్లమెంటు స్థానాలే గెలిచినందున ఆ పార్టీ బ‌లం 63 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలకే ప‌రిమితం అయింద‌ని లెక్క.  100 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ 63 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే స‌త్తా చాట‌డం అంటే టీఆర్ఎస్ కు నాలుగు నెల‌ల్లోనే ఊహించ‌ని షాక్ ఎదురైన‌ట్లు చెప్పాలి. ముఖ్యంగా సిద్దిపేట‌, సిరిసిల్ల వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ మెజారిటీ త‌గ్గిపోయింది.

పార్లమెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలు టీఆర్ఎస్ మూడు విష‌యాల‌ను స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఊహించ‌ని రీతిలో తెలంగాణ‌లో బ‌ల‌ప‌డుతోంది. ఇక‌, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ లో చేర్చుకున్నా ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు, ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గలేదు. ఇక‌, టీఆర్ఎస్ నాలుగు నెల‌ల పాల‌న ప‌ట్ల ప్రజ‌ల్లో కొంత వ్యతిరేక‌త ఏర్పడుతుంద‌ని అర్థం.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇంత‌వ‌ర‌కు అమ‌లు చేయ‌క‌పోవ‌డం, ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం, చాలా రోజుల పాటు మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం వంటి అంశాలు టీఆర్ఎస్ ను దెబ్బతీశాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నిక‌లు కావ‌డంతో జాతీయ పార్టీల వైపు ప్రజ‌లు మొగ్గు చూపారు. 

ఈ లెక్కన కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లడం ఆ పార్టీకి చాలా క‌లిసి వ‌చ్చింది. పార్లమెంటు ఎన్నిక‌ల‌తో క‌లిసి వెళ్లి ఉంటే ఆ పార్టీ గెలుపు అంత సులువ‌య్యేది కాదు. మొత్తంగా పార్లమెంటు ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను హెచ్చరిక‌గా భావించి లోపాలు స‌రిదిద్దుకోక‌పోతే టీఆర్ఎస్ కు మ‌రింత ఇబ్బంది ఖాయ‌ం అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.        040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle