గోదావరి జలాల తరలింపు ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం?
13-08-201913-08-2019 15:28:21 IST
2019-08-13T09:58:21.720Z13-08-2019 2019-08-13T09:58:15.367Z - - 16-01-2021

గోదారి జలాల తరలింపు విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటనలు, ఆలోచనలు ఏపీ ప్రజలలో భరోసా నింపుతోందా? భవిష్యత్ పై బెంగ కలిగేలా చేస్తున్నదా? అంటే ఇతమిద్థంగా చెప్పలేం. ఎగువ నుంచి దిగువకు పారే నది నీటిని దిగువ నుంచి ఎగువకు మళ్లించి అంటే తెలంగాణ భూభాగానికి మళ్లించి అక్కడ నుంచి మళ్లీ శ్రీశైలంకు తరలించడం ఏమిటి? ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమౌతుంది. పట్టి సీమ చేసిందేమిటి? గోవవరి నీటిని కృష్ణలోనికి ఎత్తిపోయడమే కదా ! తెలంగాణ నుంచి కిందకు పారిన నీటిని మళ్లీ ఆ రాష్ట్రంలోనికి మళ్లించి కిందకు వదులుతామనడం ఏమిటి? అన్న ప్రశ్నలు సహజంగానే ఆంధ్రులలో వ్యక్తమౌతున్నాయి.
అయితే జల వివాదాల పరిష్కారం విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సమన్వయంతో వ్యవహరించడం కచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఉభయ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి అద్భుతాలు సాధిస్తామన్న కేసీఆర్ ధీమా, విశ్వాసం అభినందనీయమే. అయితే ఈ సమన్వయం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రాంతానికి అన్యాయం చేసి, మరో ప్రాంతానికి న్యాయం చేసేదిగా ఉండటం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. కలిసి నడుద్దాం, కలిసి అభివృద్ధి సాధిద్దామన్న పిలుపు చాలా గొప్పగా కనిపిస్తున్నది, వినిపిస్తున్నది. అయితే ఏపీలో అభివృద్ధి అడుగులను చెరిపివేస్తూ...తెలంగాణ సర్కార్ తో కలిసి నడిచి అభివృద్ధి ఎలా సాధిస్తారన్నది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. పోలవరం పనులు నిలిచిపోయిన పరిస్థితి. ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతాయన్న విషయంలో ఇంకా ఒక స్పష్టత రాలేదు.
రాయల సీమ రతనాల సీమగా మార్చాలన్నదే తన ధ్యేయమని కేసీఆర్ ఉద్ఘాటించడంలో ఔచిత్యం ఎంత ఉన్నా...ఆ మాట ఏపీ సీఎంల నోట ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే ఆ దిశగా పడిన అడుగులు మాత్రం అంతంతే. ప్రజా మద్దతు ఉన్నంత కాలం ఇరు రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలూ నెరవేర్చుందుకు సమష్టిగా కృషి చేయాలన్న సంకల్పం మెచ్చదగినదే కానీ...ఒక రాష్ట్రానికి ఎక్కువ మేలు, మరో రాష్ట్రానికి తక్కువ మేలు జరిగేలా ఆ సంకల్పం ఉండటాన్ని మాత్రం జనం ఆమోదించరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిలాల మళ్లింపు విషయంలో ఇప్పటికే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ముందడుగు వేస్తే ప్రతిఘటన తప్పదన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గోదవరి గోదావరి జిల్లాలకు జీవధార. నిజమే గోదావరి జిలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. అలా కలవకుండా...ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది. దీనిలో రెండో అభిప్రాయానికి తావేలేదు. అయితే నదుల అనుసంధానంతో ఈ సమస్య పరిష్కారంపై కూడా చాలా కాలంగా చర్చ నడుస్తున్నది.
తొలి అడుగుగా పట్టిసామ ద్వారా సత్ఫలితాలు సాధించిన అనుభవం కూడా ఉంది. పట్టి సీమ సమయంలోనే గోదావరి జిల్లాల ప్రజలలో, రైతాంగంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. గోదావరి ప్రాంతంలో వ్యవసాయం దెబ్బతింటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని అప్పట్లో పాక్షికంగా నివృత్తి చేయగలిగారు. ఇప్పుడు దిగువ నీటిని ఎగువకు మళ్లించి శ్రీశైలం ద్వారా దిగువకు వదలడం అన్న ప్రక్రియపై గోదావరి రైతాంగంలో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గోదావరి జలాలకు గోదావరి జిల్లాలను దూరం చేసే కుట్ర ఇందులో ఉందన్న ఆరోపణలు, అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.
ఏటా రెండు, మూడు పంటలు పండించే రైతాంగం ఇప్పటికే నీటి కొరత వళ్ల రెండో పంట వేయడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏపీ ప్రజల సందేహాలను నివృత్తి చేసిన తరువాతనే గోదావరి జలాల మళ్లింపు విషయంలో ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. అయినా పోలవరం సత్వరమే పూర్తి చేస్తే నీటి కొరత, కరవు ఉండే అవకాశమే లేదన్న విషయం సుస్పష్టంగా తెలిసినప్పుడు ఆ ప్రాజెక్టు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
3 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
4 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
4 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
9 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
10 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
12 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
12 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
13 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
14 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
14 hours ago
ఇంకా