newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

20-02-202020-02-2020 09:47:18 IST
Updated On 21-02-2020 18:48:51 ISTUpdated On 21-02-20202020-02-20T04:17:18.241Z20-02-2020 2020-02-20T04:17:10.447Z - 2020-02-21T13:18:51.195Z - 21-02-2020

కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ దృష్టి మారుతోందా? 

తెలంగాణనుంచి ఆయన జాతీయం వైపు మళ్ళుతున్నారా?

కేటీయార్ కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? 

మళ్ళీ తెరమీదకు ఫెడరల్ ఫ్రంట్

కేటీయార్ చేతికి ప్రభుత్వ పగ్గాలు

కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలను తాటిపైకి తేనున్నారా? 

అవుననే అంటున్నాయి గులాబీ వర్గాలు. తెలంగాణ సీఎం కేసీయార్ ఎప్పటినుంచో ఆశిస్తున్న జాతీయ రాజకీయాలపై ఆయన చూపు సారిస్తున్నారనే వాదన వినబడుతోంది. ఇప్పటినుంచే ఆయన అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఇటీవల ఆయన అడుగులన్నీ ముందస్తు వ్యూహంతోనే ఉన్నాయనిపిస్తోందని పరిశీల‌కులు భావిస్తున్నారు. ఈ సారి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆయన కచ్చితమైన ప్లాన్ వేస్తున్నారని అందుకు ముందుగా పార్లమెంటుకు వెళ్ళాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

ఇందుకు ఆయనకు బాగా అచ్చి వచ్చిన కరీంనగర్ నుంచి పోటీ చేసి ఢిల్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారట. అందుకే ఆయన ఎక్కువగా కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా కరీంనగర్ వైపు వెళుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సహా.. ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు .. ఆయనే స్వయంగా జిల్లాలో పర్యటించారు. కరీంనగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే కేవలం నెలల వ్యవధిలోనే ఇలా కరీంనగర్‌పై ఇంత స్పెషల్ ఫోకస్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంద‌నే ప్రచారం జోరందుకుంది.

ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ కు కట్టబెట్టి తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నారంటున్నారు. గత కొంతకాలంగా మంత్రులు ఒకరి తర్వాత మరొకరు కేటీయార్ ని హైలైట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కేసీయార్ కీలక నిర్ఱయం తీసుకోనున్నారు. 

ఇందుకు ముహుర్తం కూడా ఖరారు చేయాలనుకుంటున్నారట. రాబోయే ఎన్నికల నాటికి కరీంనగర్ లో టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా ఉండేలా ఇప్పటినుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారంటున్నారు.

తాను కరీంనగర్ లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ఉత్తర తెలంగాణలో బీజేపీ ని దెబ్బ కొట్టాలని కూడా కేసీఆర్ వ్యూహాల్లో భాగమని తెలుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలో తన కూతురు కవితను నిలబెట్టి ఆమెకు ప్రభుత్వం లో అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం మీద కేసీయార్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle