newssting
BITING NEWS :
* కరోనా నెగిటివ్ రిపోర్టుతో వ‌చ్చిన‌వారికి మాత్ర‌మే గోవాలోకి అనుమ‌తి *భ‌ద్రాద్రి: నేటి నుంచి మూడు రోజుల పాటు దేశ‌వ్యాప్త బొగ్గుగ‌నుల స‌మ్మె*ఏపీ: క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ఆన్‌లైన్‌లోనే హైకోర్టులో కేసుల విచార‌ణ‌.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా కేసుల విచార‌ణ*తూర్పుగోదావరి జిల్లా : కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో నేటి నుండి జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గింపు *ఛత్తీస్ గడ్: రాజానందగావ్ జిల్లాలో భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు. చూరియా సర్కిల్ పరిధి కటెంగా అటవీప్రాంతంలో జిల్లా పోలీసులు, డిఆర్జీ, ఐటిబిపి సిబ్బంది, మావోయిస్టుల ఏరివేతకు కూబింగ్... కాల్పులు. ప్లాటూన్ 1 డివిసి కమాండర్ డేవిడ్ అలియాస్ ఉమేష్ అనే మావోయిస్టు మృతి *ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి కేంద్రం నోటీసు. ఆగష్టు 1 లోపు ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం*తెలంగాణలో ఈరోజు 1018 కరోనా కేసులు. కరోనాతో ఇవాళ ఏడుగురు మృతి. ఇవాళ ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణలో మొత్తం 17,357 కరోనా కేసులు నమోదు *గుంటూరు జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్. అచ్చెన్నాయుడు కోలుకున్నారని వైద్యుల రిపోర్ట్. అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్ జైలుకు తరలింపు*తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం. పలువురు అధికారులకు సోకిన కరోనా. మిగతా ఉద్యోగులకు టెస్టులు చేయించిన అధికారులు. 18 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ *పిల్లి సుభాష్, మోపిదేవి ఎమ్మెల్సీ పదవుల రాజీనామాలు ఆమోదం. నోటిఫికేషన్ జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీ*సింగరేణి సీఎండీపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేసు నమోదు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో రూ. 200 కోట్ల డీజిల్ కుంభకోణంపై విచారణ

కమల నాథుల దూకుడు.. 2023 టార్గెట్ సాధ్యమేనా?

19-08-201919-08-2019 09:07:34 IST
Updated On 20-08-2019 11:34:18 ISTUpdated On 20-08-20192019-08-19T03:37:34.939Z19-08-2019 2019-08-19T03:37:25.154Z - 2019-08-20T06:04:18.278Z - 20-08-2019

కమల నాథుల దూకుడు.. 2023 టార్గెట్ సాధ్యమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో బీజేపీ దూకుడు గులాబీ నేతలను కలవర పెడుతోంది. 2023లో అధికారంలోకి వస్తామని, తెలంగాణ రూపురేఖలు మారుస్తామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా ధీమా వ్యక్తంచేయడం చూస్తుంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ అర్థం చేసుకోవచ్చు. టీఆర్​ఎస్​పై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని, ఇందుకు మొన్నటి లోక్​సభ ఎన్నికలే నిదర్శనమని బీజేపీ నేతలు అంటున్నారు. 

Image may contain: 14 people, people smiling, people standing and indoor

ఒకవైపు తెలంగాణ టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకుంటున్న బీజేపీ.. టీఆర్ఎస్ నేతలకు వల వేస్తోంది. ఇప్పటికి 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని, 2023నాటికి అప్పటికి 25 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని, అందులో తెలంగాణ ఉంటుందని చెబుతున్నారు జేపీ నడ్డా. 

తెలంగాణ పర్యటనలో ఉన్న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎంపీ గరికపాటి మోహనరావు నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర నేతలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఆదివారం బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక నడ్డా తొలిసారి తెలంగాణ వచ్చారు. ఈసందర్భంగా ఆయన తెలంగాణకు విముక్తి కల్పించిన వల్లభాయ్‌ పటేల్‌ను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి తెలంగాణలో కేసీఆర్‌ నిరంకుశ, కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. 

టీఆర్ఎస్ వారసత్వ రాజకీయాలపై మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరమని నడ్డా స్పష్టంచేశారు. కొడుకు కోసం.. కూతురు కోసం అనేది ఉండదని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త నుంచి మోదీ ప్రధాని అయ్యారని, అమిత్‌షా పార్టీ అధ్యక్షుడు అయ్యారని వివరించారు.

దేశంలో సెక్రటేరియట్‌కెళ్లని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని, ఇంతవరకు ఎవరినీ అలా చూడలేదని, అలాంటి సీఎంకు కొత్త సెక్రటేరియట్‌ ఎందుకు అని నడ్డా ప్రశ్నించారు. వాస్తు సరిగా లేదని సెక్రటేరియట్‌ భవనాన్ని కూల్చుతారా అని నిలదీశా>రు. 2023లో వాస్తు సరి అవుతుందని, సీఎం కేసీఆర్‌కు వాస్తు అంటే ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల నిధులను దారి మళ్లించడమే కాకుండా రాష్ట్ర పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడంలేదని విమర్శించారు. 

రాష్ట్రంలో 2023 టార్గెట్​గా బీజేపీ ముందుకు వెళ్తున్నదని, వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్​రెడ్డి సైతం ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్​ ప్రకారమే 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు  ఎన్నికల కోసం తామేమీ తొందరపడటం లేదని స్పష్టం చేశారు.  తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మొత్తం మీద  బీజేపీ నేతలు తమ యాక్షన్ ప్లాన్‌తో టీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు ఉండడం లేదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle