newssting
BITING NEWS :
*హైదరాబాద్ లో చాప కింద నీరులా డ్రగ్స్ దందా..నిన్న పంజ‌గుట్ట‌లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రు యువ‌కుల అరెస్ట్ *హైదరాబాద్ లో మరో హత్య..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉదోగి హత్య*పదవతరగతి పరీక్షలు మరోసారి వాయిదా* ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం..18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ *తెలంగాణ, ఏపీ మధ్య బార్డర్ చెక్ పోస్టు రేపు ఎత్తివేత *ఆంధ్రప్రదేశ్‌లో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బదిలి *గత 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 9,971 కరోనా కేసులు, 287 మంది మృతి.. 2,46,628కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 6,929 మంది మృతి *తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు 400 పైగా కేసులు.. తెలంగాణలో కొత్తగా 206 కొత్త కేసులు..మొత్తం 3496కి చేరిన పాజిటివ్ కేసులు. ఇందులో యాక్టివ్ కేసులు 1663 ఉండగా, కోలుకున్నవారు 1710 మంది ఉన్నారు..ఈరోజు కరోనాతో 10 మంది మృతి చెందారు..దీంతో మొత్తం మృతుల సంఖ్య 123*తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా వివాదం..ఇరువర్గాల పై కేసులు నమోదు చేసిన పోలీసులు *ఏపీలో ఒక్కరోజే కొత్త‌గా 210 కేసులు నమోదు.. మొత్తం 4460 కేసులు *విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై రెండవరోజు హైపవర్ కమిటీ విచారణ

ఈ రైతు ఎందరికో ఆదర్శం

28-03-202028-03-2020 11:34:28 IST
Updated On 28-03-2020 11:55:52 ISTUpdated On 28-03-20202020-03-28T06:04:28.340Z28-03-2020 2020-03-28T06:04:18.442Z - 2020-03-28T06:25:52.603Z - 28-03-2020

ఈ రైతు ఎందరికో ఆదర్శం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనదేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్త‌గా 150 వరకూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 834కు చేరింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా 19కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా అందరినీ కదిలిస్తోంది. చిన్నా పెద్దా తేడాలేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలుచేస్తోంది. కరోనాపై పోరు కొనసాగుతున్న వేళ ఓ అన్నదాత పెద్ద మనసు చాటుకున్నారు. 50 వేల రూపాయలు  విరాళంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ సహాయ కార్యక్రమాలకు అండగా నిలిచారు.

సన్నకారు రైతే అయినా తనకు దేశం ముఖ్యం అని  అలాగని.. ఆయనేదో మోతుబరి రైతు అనుకుంటే పొరపాటే. కేవలం నాలుగంటే నాలుగు ఎకరాల భూమి కలిగిన అతి సామాన్య రైతు. చదువుకోకపోయినా.. ప్రపంచానికి వచ్చిన కష్టాన్ని చదివారు. తన కుమారుల ద్వారా విషయం తెలుసుకున్నారు. ప్రాణాల కంటే డబ్బు ముఖ్యమా అంటూ ముందుకొచ్చారు. 

ఆదిలాబాద్ జిల్లా  లాండసాంగి గ్రామానికి చెందిన మోర హన్మాండ్లు తన వంతుగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దేవసేనను కలిశారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన50 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందచేశారు. తనను చూసి మరింత మంది ముందుకొస్తారనే ఆశతోనే ఇలా చేసినట్లు వివరించారు. ఆ కరోనాకు ప్రపంచమే వణికిపోతోంది. డబ్బులు ఉండి ఏం జేస్తయి.. సార్ పనికొస్తయా? మనం చచ్చిపోతే.. డబ్బులు ఏం జేస్తయ్.. నా లాంటోళ్లు ఇంకా ఎందరో సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతూ తనకు తోచింది సహాయం చేసినట్లు తెలిపారు రైతు హన్మాండ్లు.

రైతు ఔదార్యానికి కలెక్టర్ ప్రశంసలు కురిపించారు. కరోనావైరస్‌ నివారణకు చేపట్టే చర్యల్లో ప్రజలు సహకరించాలని వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు కలెక్టర్ దేవసేన. సినిమా తారలు, పారిశ్రామిక వేత్తలు భారీగా విరాళాలు అందిస్తున్నారు.  తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున, తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాలస రూ.48 కోట్లు.. హీరో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రాంచరణ్ ఇలా విరాళాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 

తక్కువ ఖర్చుతో కరోనా టెస్టింగ్ కిట్.. ఐఐటీ హైదరాబాద్ ఘనత

తక్కువ ఖర్చుతో కరోనా టెస్టింగ్ కిట్.. ఐఐటీ హైదరాబాద్ ఘనత

   2 hours ago


ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఎత్తివేత

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఎత్తివేత

   3 hours ago


మృగశిర కార్తెతో ఉపశమనం... చేపల మార్కెట్లకు కళ

మృగశిర కార్తెతో ఉపశమనం... చేపల మార్కెట్లకు కళ

   3 hours ago


అందరి దృష్టి హైపవర్ కమిటీ పైనే

అందరి దృష్టి హైపవర్ కమిటీ పైనే

   6 hours ago


వైసీపీ వైపు పదిమంది టీడీపీ ఎమ్మెల్యేల చూపు? తెలుగు తమ్ముళ్లలో గుబులు

వైసీపీ వైపు పదిమంది టీడీపీ ఎమ్మెల్యేల చూపు? తెలుగు తమ్ముళ్లలో గుబులు

   6 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెర్రర్.. జాగ్రత్తలు లేకుంటే అంతే సంగతులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెర్రర్.. జాగ్రత్తలు లేకుంటే అంతే సంగతులు

   6 hours ago


బ్రేకింగ్.. తెలంగాణలో పది పరీక్షలు మరోమారు వాయిదా

బ్రేకింగ్.. తెలంగాణలో పది పరీక్షలు మరోమారు వాయిదా

   18 hours ago


మ‌ళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఘ‌ట్ట‌మ‌నేని చూపు..?

మ‌ళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఘ‌ట్ట‌మ‌నేని చూపు..?

   20 hours ago


రంగారెడ్డి, హైదరాబాద్ మినహా పదవతరగతి పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

రంగారెడ్డి, హైదరాబాద్ మినహా పదవతరగతి పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

   21 hours ago


డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్.. పోలీసుల అదుపులో లేరన్న ప్రభుత్వం

డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్.. పోలీసుల అదుపులో లేరన్న ప్రభుత్వం

   06-06-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle