newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అర్హుడైన ప్రతి రైతుకూ రైతుబంధు.. మార్గదర్శకాలివే

17-06-202017-06-2020 11:12:36 IST
Updated On 17-06-2020 14:31:27 ISTUpdated On 17-06-20202020-06-17T05:42:36.217Z17-06-2020 2020-06-17T05:41:40.597Z - 2020-06-17T09:01:27.980Z - 17-06-2020

అర్హుడైన ప్రతి రైతుకూ రైతుబంధు.. మార్గదర్శకాలివే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు దేశానికి ఆదర్శం అనీ, అర్హులైన రైతులందరికీ రైతుబంధు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీయార్. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్నదాతలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో వెంటనే రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం అన్నారు. ఏ ఒక్క రైతునూ మినహాయించకుండా అందరికీ రైతుబంధు డబ్బులు వచ్చేలా చూడాలి.

ఎవరికి రాకున్నా వారి వివరాలు తీసుకొనైనా పెట్టుబడి సాయం అందేలా చూడాలని ఆదేశించారు.  వానాకాలంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగుచేయాలని ప్రభుత్వం పిలుపునిస్తే రైతులు సంపూర్ణంగా పాటించారని, చెప్పిన ప్రకారం పంటలు సాగుచేస్తున్నారని చెప్పారు. ధాన్యం ఎక్కువగా పండించకుండా ఆహార పంటలు, కూరగాయలు, కందులు సాగుచేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. 

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రయత్నానికి రైతుల నుంచి మద్దతు లభించిందన్నారు. యాసంగిలో కూడా ఏ పంటలు వేయాలనే విషయంలో ప్రణాళిక రూపొందించి, అందుకు అనుగుణంగా సాగుచేయించాలని అధికారులకు సూచించారు. ‘తెలంగాణ దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నది. ఈ సమయంలో రైతులకు మరింత చేదోడు వాదోడుగా ఉండాలి. రైతులకు అవసరమైన అవగాహన కల్పించడానికి, రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా క్లస్టర్లవారీగా రైతు వేదికలు నిర్మించాలని నిర్ణయించాం. ఈ వేదికల నిర్మాణం నాలుగు నెలల్లో పూర్తికావాలి’ అని సీఎం అన్నారు.  

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతోంది. సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, ఆదిలాబాద్‌ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి సౌకర్యం పెరుగుతున్నది. దీనికి అనుగుణంగా ఇరిగేషన్‌ నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌చేయాలి. జిల్లాలవారీగా నెట్‌వర్క్‌ వివరాలు కలెక్టర్ల దగ్గర ఉండాలి. రైతులు చెరువుల్లోని పూడిక మట్టిని స్వచ్ఛందంగా తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలి.

దీనివల్ల అటు పంట పొలాల్లో భూసారం పెరుగుతుంది. ఇటు చెరువుల్లో పూడిక పోతుంది. కాబట్టి రైతులను ప్రోత్సహించాలి. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు కచ్చితంగా ప్రతి నెలా కరెంటు బిల్లులు చెల్లించాలి. బకాయిలు ఉంటే క్షమించే ప్రసక్తే లేదు. పట్టణాలు, గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారానే మంచినీటి సరఫరా జరుగుతున్నందున గతంలో వాడిన మోటర్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. 

రైతుబంధు కింద దరఖాస్తు చేసుకున్న కొత్తవారికి, అర్హులకు పదిరోజుల్లో రైతుబంధు సాయం వారి ఖాతాల్లోే జయచేయనున్నారు. ఎకరానికి ఐదువేలు చొప్పున రైతుబంధు సాయం చేస్తారు. పెద్దపల్లిలోని దేవాదాయ శాఖ భూములు సాగుచేసుకుంటున్న 621 మంది పట్దాదారులకు సైతం రైతుబంధు సాయం చేయనున్నారు. రైతుబంధు కోసం ఏడాదిలో ఒకసారి వివరాలు తీసుకుంటారు. అమ్మిన భూముల వివరాలు సేకరించడం, రైతుబంధు జాబితాలో కొనుగోలు దారుల పేర్లను చేరుస్తారు. తక్కువ భూమి వున్నవారికి త్వరగా రైతుబంధులు నిధులు అందిస్తారు. ఇప్పటికే ఆర్థిక శాఖ 5500 కోట్లు విడుదల చేసింది. మిగిలిప మొత్తం 10 రోజుల్లో విడుదల చేయాలని సీఎం కేసీయార్ ఆదేశించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle