newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

బ్రిటిష్ హయాంలోని చ‌ట్టంతో ఇప్పుడు క‌రోనాపై పోరాటం

24-03-202024-03-2020 07:32:30 IST
2020-03-24T02:02:30.940Z24-03-2020 2020-03-24T02:02:18.419Z - - 01-06-2020

బ్రిటిష్ హయాంలోని చ‌ట్టంతో ఇప్పుడు క‌రోనాపై పోరాటం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోజురోజుకూ విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్ష‌లు అమ‌ల్లోకి తెస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వంతో పాటు మ‌రికొన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఎపిడెమిక్స్ డిసీసెస్ యాక్ట్ - 1897 చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చాయి. 123 ఏళ్ల క్రితం బ్రిటీష్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ఈ చ‌ట్టంతో ఇప్పుడు మ‌న ప్ర‌భుత్వాలు క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతున్నాయి.

దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. వైర‌స్ బాధితుల సంఖ్య  నాలుగు వంద‌ల‌కు చేరువ‌లో ఉంది. ఇప్ప‌టికే ఏడుగురు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణించారు. ఈ ద‌శ‌లో క‌రోనా వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వేగంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని ఇట‌లీ, ఇరాన్ వంటి దేశాల అనుభ‌వాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను ఎక్కువ‌గా ఇళ్ల‌కే ప‌రిమితం చేయ‌డం, క‌రోనా వైర‌స్ అనుమానితుల‌ను గుర్తించి, సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి వేరు చేసి, ఐసోలేష‌న్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో బ్రిటీష్ హ‌యాంలో తెచ్చిన 1897 ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్‌ను ప్ర‌భుత్వాలు బ‌య‌ట‌కు తీశాయి.

1890ల‌లో అప్ప‌టి బాంబే ప్ర‌సిడెన్సీలో ప్లేగూ వ్యాధి విజృంభించింది. బాంబే ప్ర‌సిడెన్సీలోనే ఈ వ్యాధి మొద‌లైన త్వ‌ర‌లోనే ఇత‌ర ప్రాంతాల‌కు కూడా విస్త‌రించింది. దీంతో ఈ వ్యాధిని నిర్మూలించ‌డానికి కొన్ని ఆంక్ష‌లు విధించాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం భావించి 1897 ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్‌ను రూపొందించింది.

ప్లేగూ వ్యాధి కార‌ణంగా బాంబే ప్ర‌సిడెన్సీలో నివ‌సించే ప్ర‌జ‌లు ఈ వ్యాధి లేని ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్ల‌డం ప్రారంభించారు. దీంతో ఆయా ప్రాంతాల‌కు కూడా వ్యాధి సోకింది. దీనిని అరిక‌ట్టేందుకు ప్ర‌జ‌ల‌పై ఈ యాక్ట్ ద్వారా అప్ప‌టి బ్రిటీష్ ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించాల్సి వ‌చ్చింది.

ఎప్పుడైనా వ్యాధులు ప్ర‌భ‌లుతున్న‌ప్పుడు సాధార‌ణంగా అమ‌లులో ఉన్న నిబంధ‌న‌లు స‌రిపోవు అనుకున్న‌ప్పుడు, వ్యాధిని అదుపు చేయ‌డానికి మ‌రికొన్ని అసాధార‌ణ నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డిన‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎపిడెమిక్ డిసీసెస్ యాక్ట్ - 1897ను అమ‌లు చేసే అధికారం ఉంటుంది. ఈ చ‌ట్టం ప్ర‌కారం వ్యాధిని నిరోధించ‌డానికి ఆంక్ష‌లు విధించ‌వ‌చ్చు. ఈ ఆంక్ష‌లు పాటించని వారిని శిక్షించ‌డానికి కూడా ఈ చ‌ట్టం ద్వారా అవ‌కాశం ఉంది.

2009లో పూణేలో స్వైన్ ఫ్లూ వ్యాపించిన‌ప్పుడు, 2015లో చండీఘ‌డ్‌లో మ‌లేరియా విజృంభించినప్పుడు ఈ చ‌ట్టాన్ని అక్క‌డి వ‌ర‌కు అమ‌లు చేశారు. 2018లోనూ గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర జిల్లాలో వ‌ఘోడియా తాలుకాలో క‌లెరా అనుమానిత కేసులు న‌మోదైన‌ప్పుడు కూడా అక్క‌డి జిల్లా క‌లెక్ట‌ర్ ఈ చ‌ట్టం కింద ప‌లు ఆంక్ష‌లు విధించారు.

ఇప్పుడు తెలంగాణ స‌హా మ‌రికొన్ని రాష్ట్రాలు కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవ‌డానికి క‌ఠిన ఆంక్ష‌లు విధించేందుకు ఈ చ‌ట్టాన్ని ప్ర‌యోగించాయి. ఈ చ‌ట్టం స్థానంలో గ‌తంలో మ‌న ప్ర‌భుత్వాలు కొన్ని మార్పుల‌తో కొత్త చ‌ట్టాలు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. దీంతో 123 ఏళ్ల కింది చ‌ట్టం ఇప్పుడు ఉప‌యోగించాల్సి వ‌చ్చింది.

వైసీపీకి స్వ‌ప‌క్షంలో విప‌క్ష నేత‌గా మారిన‌ ఎంపీ

వైసీపీకి స్వ‌ప‌క్షంలో విప‌క్ష నేత‌గా మారిన‌ ఎంపీ

   5 minutes ago


త్రిశంకు స్వర్గంలో ఎన్నికల కమిషనర్.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం

త్రిశంకు స్వర్గంలో ఎన్నికల కమిషనర్.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం

   2 hours ago


 గిరిజనుల చెంతకు చేరని సంక్షేమ ఫలాలు

గిరిజనుల చెంతకు చేరని సంక్షేమ ఫలాలు

   5 hours ago


ఏపీ వెళ్ళాలంటే ‘స్పందన’లో నమోదుచేయాల్సిందే!

ఏపీ వెళ్ళాలంటే ‘స్పందన’లో నమోదుచేయాల్సిందే!

   6 hours ago


జగన్ పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో వైరల్

జగన్ పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో వైరల్

   6 hours ago


నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు

నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు

   8 hours ago


తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

   9 hours ago


కరోనా విరామం.. మళ్లీ టీపీసీసీ చీఫ్ రాజకీయం!

కరోనా విరామం.. మళ్లీ టీపీసీసీ చీఫ్ రాజకీయం!

   11 hours ago


డజన్ల కొద్ది సలహాదారులు.. కక్ష్యసాధింపు కోసమేనా?

డజన్ల కొద్ది సలహాదారులు.. కక్ష్యసాధింపు కోసమేనా?

   11 hours ago


తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle