newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బెంగాల్ పాలిటిక్స్‌నే మార్చేసిన ఒక్క నినాదం

14-05-201914-05-2019 07:40:12 IST
Updated On 28-06-2019 12:40:57 ISTUpdated On 28-06-20192019-05-14T02:10:12.090Z14-05-2019 2019-05-14T02:06:28.731Z - 2019-06-28T07:10:57.479Z - 28-06-2019

బెంగాల్ పాలిటిక్స్‌నే మార్చేసిన ఒక్క నినాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆ ఒక్క నినాదం ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని త‌రాలుగా మార్చేస్తోంది. 1977 దాకా బెంగాల్ అధికారాన్ని త‌మ చేతిలో ఉంచుకున్న కాంగ్రెస్, బెంగాల్ కాంగ్రెస్ పార్టీల‌ను ఆ నినాదం అడ్డంగా ముంచేసింది. 1960లో అమెరికా, వియ‌త్నాం యుద్ద స‌మయంలో వియ‌త్నాం ప్రజ‌ల‌కు సంఘీభావంగా కామ్రేడ్లు బెంగాల్లోని ప‌లు ప‌ట్టణాల్లో ర్యాలీలు తీశారు. 

అప్పుడు వారు చేసిన నినాదం తుమారా నామ్, హ‌మారా నామ్ వియ‌త్నాం, వియ‌త్నాం. అంటే నీ పేరు, నా పేరు వియ‌త్నాం, వియ‌త్నాం. ఇది ఆ రోజుల్లో జ‌నానికి బాగా ఎక్కింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పాల‌న‌తో విసిగిన జ‌నం, నెమ్మదిగా క‌మ్యూనిస్టుల వైపు మొగ్గు చూపారు. ఆ త‌ర్వాత ప‌లుమార్లు రాష్ట్రప‌తి పాల‌న దిశ‌గా బెంగాల్ రాజ‌కీయం న‌డిచినా, 1977లో సీపీఎం నాయ‌క‌త్వంలో కామ్రేడ్ల పాల‌న మొదైలంది. 2011 దాకా అది కొన‌సాగింది. 

ఈ సుదీర్ఘ పాల‌న‌కు నాంది ప‌లికింది వియ‌త్నాం నినాద‌మే. ఇక కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ పార్టీల‌కు వ్యతిరేకంగా 1998 జ‌న‌వ‌రి 1వ తేదీన మ‌మ‌త బెన‌ర్జీ స్థాపించిన ఆలిండియా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ, 2006లో అప్పటి సీఎం బుద్ధదేవ్ భ‌ట్టాచార్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. సింగూర్ అంశాన్ని తీసుకున్న ఆమె తీవ్రస్థాయిలో ఉద్యమం చేశారు. 

అప్పట్లో ఆమె ఓ స్లోగ‌న్ ప్రచారం చేస్తూ జ‌నంలోకి వెళ్లారు. ఆ నినాదం ఏంటంటే, తుమారా నామ్, హ‌మారా నామ్ నందిగ్రామ్, నందిగ్రామ్. ఈ నినాదం ఆ పార్టీకి ఎక్కడ‌లేని బ‌లం ఇచ్చింది. ఇలా జ‌నంలో ఎదిగిన టీఎంసీ, 2011లో అధికారంలోకి వ‌చ్చి, ఇప్పటి దాకా కొన‌సాగుతోంది. వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రావ‌డంతో సీపీఎం నేత‌లు మొద‌ట్లో టీఎంసీలోకి మారారు. కానీ తాజా ప‌రిస్థితుల‌తో వారు ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు. 

దీనికి కార‌ణం ఒక్కటే, మోడీ ప్రధాని అయిన త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ మీద ప‌ట్టుకోసం అమిత్ షా వ్యూహం ర‌చించారు. ఇక 2017లో బీజేపీ, సంఘ్ ప‌రివార్ ఓ నినాదాన్ని జ‌నంలోకి తీసుకెళ్లారు. అదేమంటే, తుమారా నామ్, హ‌మారా నామ్ జై శ్రీరాం, జై శ్రీరాం. ఇది స‌గ‌టు బెంగాలీల‌కు బాగా ఎక్కింది. ఎందుకంటే ముస్లింల ఓట్లు కోసం 2016లో మ‌మ‌త బెన‌ర్జీ తీసుకున్న నిర్ణయాలు, బ‌డ్జెట్ కేటాయింపులు బెంగాలీల‌కు ఆగ్రహం తెప్పించింది. 

2009 పార్లమెంట్ ఎన్నిక‌ల్లో బంగ్లాదేశ్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన ముస్లింల‌ను వెళ్లగొడ‌తానంటూ ప్రచారం చేసిన మ‌మ‌త‌, తాను సీఎం అయిన త‌ర్వాత వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని బెంగాలీలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే స‌మ‌యంలో సంఘ్ ప‌రివార్ తుమారా నామ్, హ‌మారా నామ్ జై శ్రీ రాం, జై శ్రీ రాం నినాదానికి చాలా మంది అభిమానులు అయ్యారు. ప్రజ‌ల నాడిని క‌నిపెట్టిన చాలా మంది సీపీఎం నేత‌లు ఇప్పుడు 2018 నుంచీ బీజేపీలోకి క్యూ క‌డుతున్నారు. 

ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా తెల్సుకున్న సీపీఎం నేత బుద్ధదేవ్ భ‌ట్టాచార్య, వారించే ప్రయ‌త్నం చేశారు. కానీ అప్పటికే ప‌రిస్థితి చేయిదాటి పోయింది. ఇక మోడీ మీద కోపంతో ఉన్న మ‌మ‌త బెన‌ర్జీ ఈ మార్పుల‌ను గ‌మ‌నించ‌లేదు. పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటే చాల‌న్న ధీమా ఆమెను ఈ ప‌రిణామాల‌ను తేలిగ్గా తీసుకునేలా చేసింది. 

దీంతో మొన్నటి స్థానిక సంస్ధల ఎన్నిక‌ల్లో బీజేపీ గ‌ణ‌నీయ‌మైన స్థానాలు గెల్చుకుంది. కామ్రేడ్లు మూడో స్థానానికి ప‌డిపోయారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో టీఎంసీ వ‌ర్సెస్ బీజేపీగా రాజ‌కీయం న‌డుస్తోంది. మొత్తానికి సంఘ్ ప‌రివార్ నినాదం ఇప్పుడు బెంగాల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల అవుతోంది. ఈ ఎన్నిక‌ల్లో అది బీజేపీకి ఏ మేర‌కు ల‌బ్ది చేకూరుస్తుంది అనేది ఫ‌లితాల త‌ర్వాత తేల‌నుంది.

 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   an hour ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   3 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   9 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   9 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   7 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   10 hours ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   6 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   11 hours ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle