newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

ప‌త్రిక‌ల‌కు క‌రోనా క‌ష్టం.. త‌గ్గుతున్న కాపీలు, పేజీలు

29-03-202029-03-2020 16:57:16 IST
2020-03-29T11:27:16.870Z29-03-2020 2020-03-29T11:26:43.803Z - - 04-06-2020

ప‌త్రిక‌ల‌కు క‌రోనా క‌ష్టం.. త‌గ్గుతున్న కాపీలు, పేజీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొంద‌రికి రోజూ ఉద‌యాన్నే న్యూస్ పేప‌ర్ చ‌ద‌వక‌పోతే ఆ రోజంతా వారికి ఏదోలా ఉంటుంది. మ‌రికొంద‌రైతే పేప‌ర్ చ‌ద‌వ‌నిదే టీ, కాఫీ కూడా తాగ‌రు. అయితే, ఇప్పటి జ‌న‌రేష‌న్‌లో పేప‌ర్ చ‌దివే వాళ్ల సంఖ్య గ‌మ‌నీయంగా త‌గ్గుతోంది. టీవీ, వెబ్ మీడియాలో ప్ర‌భావంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌త్రిక‌లు చ‌దువుతున్న వారి సంఖ్య త‌క్కువ‌వుతోంది. మ‌న దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు కొంత ఫ‌ర్వాలేదు అనుకుంటున్నా, స‌ర్య్కులేష‌న్ మాత్రం త‌గ్గుతోంది. అస‌లే క‌ష్టాల్లో ఉన్న ప‌త్రికారంగంపైన మూలిగే న‌క్క‌పై తాడిపండు ప‌డ్డ‌ట్లుగా క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ ప‌డింది.

జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియా సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌రోనా ప్ర‌భావం మ‌న తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌త్రిక‌ల‌పై పెద్ద ఎత్తున ప‌డింది. కొన్ని ప‌త్రిక‌లు పూర్తిగా హాలీడే ప్ర‌క‌టించేశాయి. మ‌రికొన్ని కాపీల సంఖ్య‌ను, పేజీల సంఖ్య‌ను త‌గ్గించేశాయి. అయితే, పేప‌ర్లు బ‌య‌ట‌కు వెళుతున్నా అవి పాఠ‌కుల వ‌ద్ద‌కు పూర్తి స్థాయిలో చేర‌డం లేదు. క‌రోనా వైర‌స్ భ‌యంతో హాక‌ర్లు పేప‌ర్ల‌ను పాఠ‌కుల‌కు చేర్చ‌లేక‌పోతున్నారు. దీంతో ప‌త్రిక‌లు క‌ష్ట‌కాలంలో ఉన్నాయ‌ని చెప్పుకోవాలి.

క‌రోనా వైర‌స్ ప్ర‌భావానికి ముందే ప‌త్రిక‌లు న‌ష్టాల్లో ఉండేవి. న్యూస్ ప్రింట్ ధ‌ర విప‌రీతంగా పెర‌గ‌డం, యాడ్‌ల రూపంలో వ‌చ్చే రెవెన్యూ త‌గ్గిపోవ‌డం, రోజురోజుకూ పాఠ‌కుల సంఖ్య త‌క్కువ‌వుతుండ‌టం ప‌త్రిక‌ల‌కు స‌వాళ్లుగా ఉండేవి. అయినా లాభ‌మో, న‌ష్ట‌మో ప‌త్రిక‌లు న‌డుస్తున్నాయి. కానీ, ఇప్పుడు క‌రోనా వైర‌స్ ప‌త్రిక‌ల‌ను పెద్ద దెబ్బ‌నే కొట్టింది. చాలాకాలం పాటు ఈ వైర‌స్ ప్ర‌భావం ప‌త్రికారంగంపై ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

క‌రోనా వైర‌స్ అనేది పేప‌ర్ పైన కూడా కొన్ని గంట‌ల పాటు ఉంటుంద‌ని మొద‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో పాఠ‌కుల్లో క‌రోనాపై ఆందోళ‌న మొద‌ల‌య్యాక ప‌త్రిక‌ల‌ను దూరం పెట్ట‌డం ప్రారంభించారు. రోజూ న్యూస్ పేప‌ర్ చ‌దివే వారు కూడా కొంత‌కాలం దూరంగా ఉంటే మంచిద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. మ‌రో వైపు క‌రోనా వైర‌స్ భ‌యంతో హైద‌రాబాద్ స‌హా కొన్ని ప్రాంతాల్లో హాక‌ర్లు ప‌త్రిక‌ల‌ను పాఠ‌కుల‌కు అందించ‌డానికి ముందుకు రావ‌డం లేదు. పేప‌ర్ బాయ్స్ కూడా ప‌ని చేయ‌డం లేదు. దీంతో చాలా చోట్ల‌కే పేప‌ర్ల స‌ర‌ఫ‌రా ఆగిపోయింది.

దీంతో రెండు తెలుగు ప‌త్రిక‌లు మొద‌టిసారిగా సెల‌వు ప్ర‌క‌టించాయి. మిగ‌తా పెద్ద ప‌త్రిక‌లు కూడా ఇదే ఆలోచ‌న చేశాయి. తాము ప్రింట్ చేసినా పాఠ‌కుల‌కు స‌రిగ్గా చేర‌క‌పోవ‌డం, సిబ్బంది ఆరోగ్యం, వంటి విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప‌త్రిక‌ల‌ను కొంత‌కాలం ఆపేయాల‌నే ఆలోచించాయి. కానీ, ఫేక్ న్యూస్ విచ్చ‌ల‌విడిగా వైర‌ల్ అవుతున్న ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు విశ్వ‌స‌నీయ వార్త‌లు అందించాలంటే ప‌త్రిక‌లు ఉండాల‌నే ఆలోచ‌న‌తో సెల‌వు ప్రతిపాద‌న‌ను విర‌మించుకొని ప‌త్రిక‌లు బ‌య‌ట‌కు తీస్తున్నారు.

ప‌త్రిక‌ల వ‌ల్ల క‌రోనా వైర‌స్ వ్యాపించ‌ద‌ని ప‌త్రిక‌లే ప్ర‌చారం చేస్తున్నాయి. త‌మ ప‌త్రిక‌ను ప్రింట్ చేయ‌గానే శానిటైజ‌ర్‌తో శుభ్ర‌ప‌రుస్తున్నామ‌ని, కాబ‌ట్టి క‌రోనా వైర‌స్‌తో ఎటువంటి హానీ లేద‌ని ప‌త్రిక‌లు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి వీడియోలు కూడా బ‌య‌ట‌కు పంపించాయి. అయినా, ప‌త్రిక త‌మ గుమ్మానికి చేరే వ‌ర‌కు ఎంత‌మంది చేతులు మారుతుందో అనే భ‌యంతో ప‌త్రిక‌లు తీసుకునేందుకు పాఠ‌కులు వెన‌క‌డుగు వేస్తున్నారు. అంద‌రూ కాక‌పోయినా ప‌త్రిక‌ల స‌ర్య్కూలేష‌న్ త‌గ్గిపోతోంది.

దీంతో ప్ర‌తిక‌లు పేజీల సంఖ్య‌ను త‌గ్గించేశాయి. సాధార‌ణంగా మెయిన్ పేజీ, జిల్లా టాబ్లాయిడ్లు విడిగా వ‌స్తుంటాయి. వీటిని పేప‌ర్ బాయ్స్ క‌లుపుతారు. ఇప్పుడు పేప‌ర్ బాయ్స్ కూడా ఎక్కువ‌గా రావ‌డం లేదు. దీంతో అన్ని ప‌త్రిక‌లూ జిల్లా టాబ్లాయిడ్ల‌ను తీసేసి మెయిన్ పేప‌ర్‌లోనే జిల్లా వార్త‌లు ప్ర‌చురిస్తున్నాయి. మొత్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మాత్రం ప‌త్రిక‌ల‌పై క‌నిపిస్తోంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గితే కానీ మామూలు ప‌రిస్థితులు వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.

 

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   an hour ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   3 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   4 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   4 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   5 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   5 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   6 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   6 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   18 hours ago


 రాబోయే 24 గంటలు జాగ్రత్త అవసరం

రాబోయే 24 గంటలు జాగ్రత్త అవసరం

   18 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle