newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

స్వీయ నిర్భంధంతోనే కరోనా వైరస్ కట్టడి

28-03-202028-03-2020 16:57:35 IST
2020-03-28T11:27:35.397Z28-03-2020 2020-03-28T11:27:15.833Z - - 01-06-2020

స్వీయ నిర్భంధంతోనే కరోనా వైరస్ కట్టడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయవాడ, గుంటూరు నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంటోంది. ప్రకాశం బ్యారేజి పై పూర్తి గా రాకపోకలు నిలిపివేసింది పోలీసు యంత్రాంగం. లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లా వారిగా దిగ్బంధనం కొనసాగుతోంది. వైరస్ బారిన పడకుండా ఏ జిల్లా వారు ఆ జిల్లా ఉండే లాగా గస్తీ కాస్తున్నారు  ప్రభుత్వ అధికారులు. ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు 15 మంది కుటుంబ సభ్యులను ఐసులేషన్ కి తరలించారు అధికారులు.

ఇప్పటికే ఎమ్మెల్యే ముస్తఫా బావ ,అక్కకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారికి క్వారంటైన్ ద్వారా చికిత్స అందచేస్తున్నారు వైద్య సిబ్బంది. ఎమ్మెల్యే ముస్తఫా,ఆయన కుటుంబ సభ్యులను  కాటూరి మెడికల్ కాలేజీ ఐసులేశన్ వార్డ్ కి తరలించిన వైద్య అధికారులు అక్కడ చికిత్సను అందచేస్తున్నారు. వీరి ద్వారా ఇంకెంతమందికి కరోనా సోకిందనేది పరీక్షల అనంతరం తేలనుంది. 

ఇటు స్వీయ నిర్బంధం ద్వారానే కరోనా వైరస్ కట్టడి సాధ్యమవుతుందని విజయవాడ సెంట్రల్  నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ నగర ప్రజలంతా అత్యవసరమైతే తప్ప  బయటకు రావద్దని ఆయనపిలుపునిచ్చారు. కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వంఎన్ని చర్యలు చేపట్టినా నగర ప్రజల సహకారం లేనిదే నియంత్రించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు.

ఉదయం ఆరు గంటలనుంచి మధ్యాహ్నం  ఒంటి గంటవరకూ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ప్రజలకు ఉందని అయితే అవసరం లేకుండా బయటకు రావడం వల్ల నష్టం జరుగుతుందని ఆయన తెలియజేశారు. సామాజిక దూరం పాటించేందుకు ఇంటికే సరుకులు పంపించేలా నగరపాలక సంస్ధ అధికారులు కార్యచరణ సిద్దం చేశారని మల్లాది విష్ణు  తెలిపారు.

అన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపులు 24 గంటలు తెరిచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని కొన్ని చోట్ల కేవలం గుర్తింపు పొందిన వారికే అనుమతిస్తున్నట్టు ఫిర్యాదులు రాగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడ నగరంలోని అన్ని మెడికల్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నగర పాలకసంస్ధ అధికారులను ఆదేశించామన్నారు. రైతు బజార్ల నుంచి మొబైల్ వాహనాలద్వారా కూరగాయలు ప్రజల ఇళ్ళ వద్దకే పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సంబంధిత శాఖాధికారులను కోరామని ఆయన తెలియజేశారు. అన్నిచోట్ల ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నారు. 

కరోనా కట్టడికి విజయవాడలోని అన్ని శాఖలు కలిసి పని చేస్తున్నాయని వారి సేవలు అభినందనీయమని మల్లాది విష్ణు  అన్నారు. వారి సేవలను ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. వారు తమ భార్యబిడ్డలను వదిలి ప్రజల కోసం రేయింబవళ్ళు శ్రమిస్తున్నారని ఆయన ప్రశంసించారు.  కొన్ని చోట్ల పోలీసులు ప్రవర్తిస్తున్నతీరును పరిశీలిస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం అర్ధమవుతోందని ఆయన తెలిపారు. పోలీసులు కూడా బయటి కొస్తున్న వారిని ఒకేసారి కొట్టేయకుండా వారు ఎందుకొచ్చారు, ఎక్కడికెళ్తున్నారనే అంశాలు తెలుసుకుంటే ఇంకా మంచిఫలితాలు వస్తాయన్నారు మల్లాది విష్ణు. 

ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే... జగన్ పై కన్నా విమర్శలు

ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే... జగన్ పై కన్నా విమర్శలు

   15 minutes ago


వైసీపీకి స్వ‌ప‌క్షంలో విప‌క్ష నేత‌గా మారిన‌ ఎంపీ

వైసీపీకి స్వ‌ప‌క్షంలో విప‌క్ష నేత‌గా మారిన‌ ఎంపీ

   an hour ago


త్రిశంకు స్వర్గంలో ఎన్నికల కమిషనర్.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం

త్రిశంకు స్వర్గంలో ఎన్నికల కమిషనర్.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం

   3 hours ago


 గిరిజనుల చెంతకు చేరని సంక్షేమ ఫలాలు

గిరిజనుల చెంతకు చేరని సంక్షేమ ఫలాలు

   6 hours ago


ఏపీ వెళ్ళాలంటే ‘స్పందన’లో నమోదుచేయాల్సిందే!

ఏపీ వెళ్ళాలంటే ‘స్పందన’లో నమోదుచేయాల్సిందే!

   7 hours ago


జగన్ పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో వైరల్

జగన్ పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో వైరల్

   8 hours ago


నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు

నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు

   9 hours ago


తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

   10 hours ago


కరోనా విరామం.. మళ్లీ టీపీసీసీ చీఫ్ రాజకీయం!

కరోనా విరామం.. మళ్లీ టీపీసీసీ చీఫ్ రాజకీయం!

   12 hours ago


డజన్ల కొద్ది సలహాదారులు.. కక్ష్యసాధింపు కోసమేనా?

డజన్ల కొద్ది సలహాదారులు.. కక్ష్యసాధింపు కోసమేనా?

   12 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle