newssting
BITING NEWS :
*దేశంలో నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయి..రాష్ట్రాలు, జిల్లాల మధ్య ప్రయాణాలు నిలిపివేయాలి..వలస కూలీల ప్రయాణాలు ఆపేయాలంటూ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.. వలస కూలీలకు రాష్ట్రాలు ఆహారం, వసతి కల్పించాలి: కేంద్రం *ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేయకూడదు..తాత్కాలిక వైద్య సిబ్బందికి సైతం రూ. 50 కోట్ల హెల్త్ ఇన్స్యూరెన్స్ : కేంద్రం *భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు 979..మహారాష్ట్రలో 196 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు. 25కి చేరిన మృతులు *కరోనా బాధితుల కోసం కింగ్ కోటి ఆసుపత్రి సిద్దం..350 పడకలతో ఆసుపత్రిని సిద్దం చేశామన్న కేటీఆర్..త్మరలో మరో నాలుగు ఆసుపత్రులు సిద్దం*తెలంగాణ పోలీసుల కొత్త ప్రయత్నం. రోడ్ల మీదకు వస్తున్న వాహనదారుల కట్టడికి నిర్ణయం. కాలనీ నుంచి బయటకు వచ్చే వాహనాల వాహనాలను రిజిస్టర్ చేస్తున్న పోలీసులు *ప్రధాని మోడి మన్ కీ బాత్ సందేశం. లాక్ డౌన్ నిర్ణయం ప్రజల ఆరోగ్యం కోసమే. లక్ష్మణ రేఖను ప్రజలు మరికొన్ని రోజులు పాటించాలి. కరోనాపై గెలవాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు. లాక్ డౌన్ తో పేద ప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నా - ప్రధాని మోడి *ఏపీ, తెలంగాణలో సామాజిక దూరం పాటించని జనం. అరకు లోయలో రేషన్ డిపోల ముందు ప్రజల క్యూ. మటన్, చికెన్ కూరగాయల షాపులు కిటకిట. చికెన్ షాపుల ముందు బారులు తీరిన వినియోగదారులు* పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు. తణుకు ఐసోలేషన్ వార్డుకు తరలింపు *ఇరాన్ నుంచి రాజస్థాన్ చేరుకున్న మరో 275 మంది భారతీయులు. 275 మందిని ఆర్మీ ఆరోగ్య కేంద్రానికి తరలించిన అధికారులు.*ఇటలీలో ఒక్క రోజులోనే 5974 కేసులు.. 889 మరణాలు. ఇటలీలో మొత్తం బాదితుల సంఖ్య 92, 472. స్పెయిన్ లో 73 వేలు దాటిన కరోనా కేసులు. ఆరు వేల మరణాలు.

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

20-02-202020-02-2020 11:52:58 IST
2020-02-20T06:22:58.961Z20-02-2020 2020-02-20T06:22:56.238Z - - 30-03-2020

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మీడియాను కట్టడి చేసేందుకు గత ఏడాది జీవో 2430ను తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం ఏ మీడియా సంస్థకు చెందిన పత్రిక లేదా చానెల్ వాస్తవాలను మాత్రమే ప్రచురించాలి. ఊహాతీతలు, ప్రచారాలు.. ఊహాగానాలను అనుమతి లేకుండా ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు ప్రభుత్వంలోని ఆయా శాఖలకు చెందిన అధికారాలకు అధికారాలు ఉంటాయి.

ఆ జీవోపై ప్రజాసంఘాలు, మీడియా సంస్థలు, మేధావులు ఎందరో గగ్గోలు పెట్టినా సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గలేదు. అయితే, అసలు ఇప్పుడు ఆ జీవో ప్రకారం వైసీపీ సొంత మీడియా సంస్థ సాక్షి నడుచుకుంటుందా అన్నది టీడీపీ నేతల ప్రశ్న. ఆ జీవో తెచ్చిన తర్వాత కూడా మాపై విమర్శలు, అసత్యాలు ప్రచారం చేయడమే సాక్షి నిత్య కృత్యంగా మారిందన్నది టీడీపీ నేతలు, కార్యకర్తల ఆక్రందన.

ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ లోకేష్ చిరుతిండి అంటూ చేసిన కథనంపై పరువు నష్టం దావా వరకు వెళ్లగా ఇప్పుడు ఏకంగా టీడీపీ సాక్షిపై ప్రెస్ కౌన్సిల్ వరకు వెళ్ళింది. సాక్షివి రాతలు కాదు రోతలు అని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రెస్‌కౌన్సిల్‌కు, ఎడిటర్స్ గిల్డ్‌కు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏ మాత్రం నిజమన్నది లేకుండా కేవలం బురద జల్లడమే సాక్షి పనిగా మారిందని యనమల ఆ లేఖలో పేర్కొన్నారు.

ముఖ్యంగా ఫిబ్రవరి 14వ తేదిన సాక్షిలో ప్రచురించిన “మచ్చుకు రెండు వేల కోట్లు, చంద్రబాబు కొండంత అవినీతిపై గోరంత వెలుగు” అనే పేరుతో బ్యానర్ స్టోరీల అంశాలతో పాటు 15వ తేదిన సాక్షి టీవీలోనూ ప్రసారమైన కథనాలను ఆ లేఖలో పేర్కొన్నారు. సాక్షి వేసిన ఈ కథనాలకు ప్రామాణికమైన సీబీడీటీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా చంద్రబాబుతో పాటు అసలు ఎవరి పేర్లు లేవు అయినా సాక్షి ఇష్టారీతిన ప్రసారం చేసింది.

సీబీడీటీ ప్రెస్‌నోట్‌లో కేవలం మూడు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు, ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పీఎస్ అని పేర్కొన్నారు. ఇక ఆ ప్రముఖ వ్యక్తి చంద్రబాబు అనుకున్నా.. మాజీ పిఎస్ శ్రీనివాస్ అనుకున్నా.. అయన ఇంటిపై నిర్వహించిన దాడుల్లో కేవలం రెండు లక్షల 63వేల రూపాయల నగదు, 12తులాల బంగారం మాత్రమే చేసుకున్నట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. మరి ఏ ఆధారం ప్రకారం  ఇష్టం వచ్చినట్లుగా అవినీతి అనకొండను చేశారని యనమల లేఖలో పేర్కొన్నారు.

కేవలం అసత్యాలను ప్రచారం చేసుకొనేందుకు ఓ రాజకీయ పార్టీ స్థాపించిన పత్రిక, చానెల్ ప్రతిపక్షాలపై బురద జల్లడమే పరమావధిగా ప్రసారం చేస్తున్న వీడియోలు, ప్రచురించిన కథనాలను పరిగణలోకి తీసుకొని సదరు పత్రిక ఎడిటర్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రెస్‌కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్ ను యనమల కోరారు. మరి ఆధారాలు లేని సాక్షి కథనాలు, ప్రసారాలపై ప్రెస్‌కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

 

 

నిత్యావసరాల సమయం సడలింపు

నిత్యావసరాల సమయం సడలింపు

   12 hours ago


ప‌త్రిక‌ల‌కు క‌రోనా క‌ష్టం.. త‌గ్గుతున్న కాపీలు, పేజీలు

ప‌త్రిక‌ల‌కు క‌రోనా క‌ష్టం.. త‌గ్గుతున్న కాపీలు, పేజీలు

   13 hours ago


పోలీసు ఉంటేనే సామాజిక దూరం..లేకుంటే గుంపులు గుంపులే

పోలీసు ఉంటేనే సామాజిక దూరం..లేకుంటే గుంపులు గుంపులే

   14 hours ago


లాక్ డౌన్ అంటే ఇదేనా?

లాక్ డౌన్ అంటే ఇదేనా?

   16 hours ago


 గరికపాడు చెక్ పోప్ట్ వద్ద ఉద్రిక్తత.. నిలిచిపోయిన టూరిస్ట్ బస్

గరికపాడు చెక్ పోప్ట్ వద్ద ఉద్రిక్తత.. నిలిచిపోయిన టూరిస్ట్ బస్

   18 hours ago


కరోనా కట్టడిలో కొంపముంచిన మత ప్రచారాలు!

కరోనా కట్టడిలో కొంపముంచిన మత ప్రచారాలు!

   18 hours ago


వృద్ధదంపతుల్ని స్వగ్రామం చేర్చిన పోలీసులు

వృద్ధదంపతుల్ని స్వగ్రామం చేర్చిన పోలీసులు

   20 hours ago


ఈ విపత్కర పరిస్థితిల్లో అన్నా క్యాంటీన్లు ఉండి ఉంటే?

ఈ విపత్కర పరిస్థితిల్లో అన్నా క్యాంటీన్లు ఉండి ఉంటే?

   21 hours ago


కరోనాకు వ్యాక్సిన్.. హైదరాబాద్ వర్శిటీ సైంటిస్ట్ ముందడుగు

కరోనాకు వ్యాక్సిన్.. హైదరాబాద్ వర్శిటీ సైంటిస్ట్ ముందడుగు

   21 hours ago


నేడు ఉచిత బియ్యం..ఏప్రిల్‌ 1న అందరికీ పెన్షన్లు.. 4న రూ.1000 ఆర్థిక సాయం

నేడు ఉచిత బియ్యం..ఏప్రిల్‌ 1న అందరికీ పెన్షన్లు.. 4న రూ.1000 ఆర్థిక సాయం

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle