newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

సంచలనం రేపిన పీవీపీ .. మహిళా సీఎం కావాలని ట్వీట్

20-02-202020-02-2020 18:08:38 IST
Updated On 20-02-2020 19:21:31 ISTUpdated On 20-02-20202020-02-20T12:38:38.052Z20-02-2020 2020-02-20T12:38:19.495Z - 2020-02-20T13:51:31.601Z - 20-02-2020

సంచలనం రేపిన పీవీపీ .. మహిళా సీఎం కావాలని ట్వీట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాజకీయాల్లో ఈమధ్యకాలంలో యాక్టివ్ గా మారారు కొంతమంది నేతలు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డితో పాటు పారిశ్రామిక వేత్త పీవీపీ కూడా ట్వీట్ల తో సందడి చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ తెలుగు రాజకీయాలను కుదిపేసింది. తెలుగు మహిళా సీఎంను చూడాలనుకుంటున్నాఅంటూ పీవీపీ సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. కాసేపటి తర్వాత ట్వీట్ ను డిలీట్ చేశారు పీవీపీ. 

సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఒక్క క్షణంలోనే లక్షలాదిమంది వాటిని చూస్తారు. కొందరు స్క్రీన్ షాట్లు తీసి దాచిపెడతారు. అలాంటి ఒక సంచలన ట్వీట్ చేసి, వెంటనే డిలీట్ చేస్తే ఊరుకుంటారా. ఈ స్క్రీన్ షాట్లను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేసి వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ సంచలనం రేపారు. ఆయన చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ వైసీపీలో కూడా కాక రేపుతోంది. అసలు ఆయన చేసిన ట్వీట్ ఏమిటంటే...

'బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ... మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్టర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి... కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం' అంటూ ట్వీట్ చేశారు.

పీవీపీ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే, కాసేపటి తర్వాత ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారు. పీవీపీ కోరుకుంటున్న మహిళా సీఎం ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. వైయస్ భారతి? వైయస్ షర్మిళ? వైయస్ విజయమ్మ? వీరిలో ఎవరనే చర్చ జరుగుతోంది. అసలు ఈ ట్వీట్ ఎందుకు చేశారనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle