newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఎంపీ మోపిదేవి

02-07-202002-07-2020 21:34:14 IST
Updated On 03-07-2020 10:44:10 ISTUpdated On 03-07-20202020-07-02T16:04:14.165Z02-07-2020 2020-07-02T16:03:58.345Z - 2020-07-03T05:14:10.729Z - 03-07-2020

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఎంపీ మోపిదేవి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. కరోనా  విపత్తు నుంచి లోకాన్ని  కాపాడాలని ఆ పరమశివుడిని ప్రార్థించానన్నారు మోపిదేవి. రాజ్యసభకు ఎంపికైన అనంతరం మోపిదేవి శ్రీ కాళహస్తి ఆలయానికి విచ్చేశారు. ఆయనకు ఆలయం వద్ద  ఈవో చంద్రశేఖర్రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

మోపిదేవి వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు జరిపారు. దర్శనం అనంతరం ఆయనను వేదపండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విపత్తు నుంచి జగత్తును కాపాడాలని శ్రీకాళహస్తీశ్వరుని ప్రార్థించానన్నారు. ఏపీలో ప్రజల అపూర్వ మద్దతుతో అధికారం చేపట్టిన  జగన్ మోహన్ రెడ్డి పాలన ఈ ఏడాది కాలంలోనే అత్యున్నత ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారని అన్నారు.

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున రాష్ట్రమంత్రిగా వున్న మోపిదేవి వెంకటరమణ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా వున్న ఆయన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం ఎన్నికయిన నాటినుంచి అమలులోకి రావడంతో ఆయన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle