newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

శృతి మించిన సోష‌ల్ వార్‌.. హ‌ద్దులు దాటిన అభిమానం..!

03-09-201903-09-2019 15:38:53 IST
2019-09-03T10:08:53.020Z03-09-2019 2019-09-03T10:08:51.274Z - - 10-12-2019

శృతి మించిన సోష‌ల్ వార్‌.. హ‌ద్దులు దాటిన అభిమానం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేత‌ల‌ను మించి పార్టీల అభిమానులు దిగ‌జారుతున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా హ‌ద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప‌ర‌స్పర గౌర‌వం అనేది మ‌ర్చిపోయి ఒక పార్టీపై మ‌రొక పార్టీ అభిమానులు, శ్రేణులు సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే, ఈ విమ‌ర్శలు అర్థర‌హితంగా, ఒక విష‌యంపై ఉంటే ఫ‌ర్వాలేదు కానీ.. అర్థం ప‌ర్థం లేని విమ‌ర్శలు చేసుకుంటున్నారు.

నిన్న ఈ విమ‌ర్శ‌లు శృతిమించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వార్ న‌డిచింది. ఇటీవ‌ల ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌ను కించ‌ప‌రుస్తూ ట్విట్టర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ట్వీట్లు చేశారు.

హ్యాపి బ‌ర్త్‌డే ధ‌న‌మేత జ‌గ‌న్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దీనిని మ‌న‌సులో పెట్టుకున్న వైసీపీ శ్రేణులు, జ‌గన్ అభిమానులు నిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌దులు తీర్చుకునేందుకు త‌ప్పుడు ట్వీట్లు చేశారు.

ఓ వైపు పెద్ద ఎత్తున ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు త‌మ అభిమాన న‌టుడు, నాయ‌కుడి పుట్టిన రోజు సంద‌ర్భంగా హ్యాపీ బ‌ర్త్‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా.. వైసీపీ శ్రేణులు మ‌రో హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు మొద‌లుపెట్టారు.

దీంతో హ్యాపీ బ‌ర్త్‌డే పావ‌లా క‌ళ్యాణ్ అనే వైసీపీ అభిమానులు సృష్టించిన హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. ప‌లువురు సెల‌బ్రిటీలు, సినీ ప్ర‌ముఖులు కూడా చూసుకోకుండా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను జ‌త‌చేసి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు.

జ‌న‌సేన శ్రేణులు కూడా ఏమీ త‌క్కువ తిన‌లేదు. నిన్న‌నే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 10వ వ‌ర్ధంతి కూడా ఉండ‌టంతో ఆయ‌న‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు.

ఆయ‌న మ‌ర‌ణంపై తీవ్ర ప‌ద‌జాలంతో, మ‌ర‌ణించిన వ్య‌క్తిని తీవ్రంగా అవ‌మానిస్తూ ట్వీట్లు చేశారు. జ‌గన్‌ను సైతం బీజేపీ బానిస అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు పార్టీల శ్రేణుల మ‌ధ్య దిగ‌జారి విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ వివాదంలోకి సినీ న‌టుడు ఫిష్ వెంక‌ట్‌ను కూడా లాగారు.

ఆయ‌న పేరుతో త‌ప్పుడు ట్విట్ట‌ర్ అకౌంట్ ఓపెన్ చేసి వైఎస్‌ను, వైఎస్ జ‌గ‌న్‌ను తీవ్ర ప‌ద‌జాలంతో దూషిస్తూ ట్వీట్లు చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆయ‌న‌ను టార్గెట్ చేసి దూషిస్తూ ట్వీట్లు చేశారు.

దీంతో విష‌యం తెలుసుకున్న ఫిష్ వెంక‌ట్ ల‌భోదిభోమంటూ వెళ్లి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తాను అస‌లు సోష‌ల్ మీడియానే వాడ‌న‌ని, పైగా తాను వైఎస్ కుటుంబానికి వీరాభిమానిన‌ని, త‌న పేరుతో త‌ప్పుడు ట్వీట్లు చేస్తున్న వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయ‌న కోరారు.

సెప్టెంబ‌ర్ 2న ఒకేరోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు, వైఎస్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా మొద‌లైన ఈ ట్వీట్ల యుద్ధంలో రెండు పార్టీల శ్రేణులు, అభిమానులు ప‌ర‌స్ప‌రం గౌర‌వించుకునే సంప్ర‌దాయాన్ని పూర్తిగా వ‌దిలేశారు.

ఈ వివాదంలో టీడీపీ, బీజేపీ జోక్యం చేసుకోకున్నా ఆ పార్టీల కార్య‌క‌ర్త‌లు కూడా కొంద‌రు ప‌లుమార్లు ఇటువంటి వ్యాఖ్య‌లే చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో అనుచితంగా కామెంట్లు చేస్తున్న సుమారు 10 మందిపై ఇప్ప‌టికే ఏపీ పోలీసులు కేసులు పెట్టినా ఎటువంటి ఫ‌లితం లేదు. వేల మంది ఇటువంటి ట్వీట్లు చేస్తుండ‌టంతో పోలీసులు కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. అయితే, పార్టీ పెద్ద‌లే క‌ల‌గ‌జేసుకొని త‌మ శ్రేణులకు, అభిమానుల‌కు న‌చ్చ‌జెప్పి గీత దాట‌కుండా చూసుకుంటే గానీ ఇవి ఆగేలా లేవు.

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’

   2 hours ago


సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్

   5 hours ago


దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్:  హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

దిశ ఎన్ కౌంటర్‌ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య

   5 hours ago


దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు

   6 hours ago


ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి

   6 hours ago


 తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!

   7 hours ago


అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

   8 hours ago


మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక

   8 hours ago


రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం

   10 hours ago


నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్‌హెచ్ఆర్‌సీపై రోజా ధ్వజం

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle