newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

వ‌నిత‌లు అవుతారా విజేత‌లు..?-1

07-05-201907-05-2019 08:20:13 IST
Updated On 07-05-2019 08:25:12 ISTUpdated On 07-05-20192019-05-07T02:50:13.157Z07-05-2019 2019-05-07T02:42:00.615Z - 2019-05-07T02:55:12.484Z - 07-05-2019

వ‌నిత‌లు అవుతారా విజేత‌లు..?-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పురుష ఓట‌ర్ల కంటే మ‌హిళా ఓట‌ర్లే అధికం. అయితే, ఎన్నిక‌ల్లో పోటీ విష‌యంలో మాత్రం మ‌హిళా అభ్య‌ర్థుల సంఖ్య త‌క్కువ‌గా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం 20 మంది మాత్ర‌మే మ‌హిళ‌లు విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

ఈ ఎన్నిక‌ల్లో 59 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌ధాన పార్టీల నుంచి మ‌హిళా అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. ఎక్కువ‌గా రిజ‌ర్వుడ్ స్థానాల్లో పార్టీలు మ‌హిళా అభ్య‌ర్థులను పోటీలో ఉంచాయి. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ మ‌హిళ‌ల‌కు ఎక్కువ టిక్కెట్లు కేటాయించింది. ఆ పార్టీ 20 మంది మ‌హిళా అభ్య‌ర్థుల‌ను పోటీలోకి దించ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 11 మంది మ‌హిళ‌ల‌కే టిక్కెట్లు ఇచ్చింది.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రధాన పోటీదారులు ఇద్ద‌రూ మ‌హిళే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున కృష్ణా జిల్లా నందిగామ‌లో తంగిరాల సౌమ్య‌, పామ‌ర్రులో ఉప్పులేటి క‌ల్ప‌న మ‌ళ్లీ పోటీ చేశారు. వీరిద్ద‌రూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. ఇక్క‌డ వీరు గ‌ట్టి పోటీ ఇచ్చారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నుంచి ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కూత‌రు ష‌బానా ఖాతూన్‌కు ఈసారి టీడీపీ టిక్కెట్ ద‌క్కింది. ఆమె కూడా వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లా పాత‌ప‌ట్నం నుంచి వైసీపీ త‌ర‌పున రెడ్డి శాంతి పోటీ చేశారు. ఆమె కూడా గెలిచే అవ‌కాశం క‌నిపిస్తోంది. విశాఖ‌ప‌ట్నం ఈస్ట్ నుంచి వైసీపీ ఈసారి విజ‌య‌నిర్మ‌ల అనే నాయ‌కురాలికి టిక్కెట్ ఇచ్చింది. ఆమె టీడీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యే పుష్ప‌శ్రీవాణి పోటీ చేశారు. ఆమె విజ‌యం ఖాయ‌మే అంచ‌నాలు ఉన్నాయి. 

అనంత‌పురం జిల్లాలోని ఎస్సీ రిజ‌ర్వుడ్ స్థాన‌మైన శింగ‌న‌మ‌ల‌లో టీడీపీ నుంచి శ్రావ‌ణి పోటీ చేయ‌గా వైసీపీ నుంచి జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి పోటీ చేశారు. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్ట‌డం ఖాయ‌మే.

చిత్తూరు జిల్లా పుంగ‌నూరులో వైసీపీ ముఖ్య‌నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై టీడీపీ ఈసారి మ‌హిళా అభ్య‌ర్థి అనూష‌రెడ్డికి టిక్కెట్ కేటాయించి ప్ర‌యోగం చేసింది. అదే జిల్లాలో తిరుప‌తి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ మ‌ళ్లీ పోటీ చేశారు. పూత‌ల‌ప‌ట్టు ఎస్సీ రిజ‌ర్వు స్థానాన్ని ఈసారి టీడీపీ ల‌లిత కుమారికి కేటాయించింది. వీరిద్ద‌రూ వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చారు. (ఇంకా ఉంది)

 

వ‌నిత‌లు అవుతారా విజేత‌లు..?-2 కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

https://www.newssting.in/p/5cd0f24081a0cc05a44b474a


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle