newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

వైసీపీ ప్ర‌భుత్వం ఆ విష‌యంలో వీక్‌..!

29-07-201929-07-2019 08:13:18 IST
2019-07-29T02:43:18.606Z29-07-2019 2019-07-29T02:42:53.538Z - - 06-07-2020

వైసీపీ ప్ర‌భుత్వం ఆ విష‌యంలో వీక్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో త‌న‌దైన మార్క్ చూపించే దిశ‌గా ముందుకుపోతున్నారు. ముఖ్యంగా ఆయ‌న ఎన్నిక‌ల హామీలుగా ఇచ్చిన న‌వ‌ర‌త్నాల అమ‌లు కోసం కృషి చేస్తున్నారు. ఈ దిశ‌గా అధికారం చేప‌ట్టిన నాటి నుంచే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇప్ప‌డు రాష్ట్రం ఉన్న ఆర్థిక ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ తీసుకుంటున్న వ‌రుస‌గా తీసుకుంటున్న ఈ నిర్ణ‌యాలు ఆర్థికంగా రాష్ట్రానికి మ‌రింత భారంగా మార‌తాయ‌నే సూచ‌న‌లు వ‌స్తున్నా జ‌గ‌న్ మాత్రం ముందుకే వెళుతున్నారు.

మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే ప‌లు కీల‌క చ‌ట్టాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో తీసుకువ‌చ్చింది. ఎన్నిక‌ల ముందు హామీ ఇచ్చిన‌ట్లుగానే ఈ చ‌ట్టాలు చేశారు. వీటి వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని వైసీపీ చెబుతోంది. అయితే, ఇంత‌టి కీల‌క నిర్ణ‌యాలు చేసి, చ‌ట్టాలు చేస్తున్నా వైసీపీ ప్ర‌భుత్వానికి, జ‌గ‌న్‌కు రావాల్సినంత క్రెడిట్ మాత్రం ద‌క్క‌డం లేదు. ముఖ్యంగా ప‌బ్లిసిటీలో ప్ర‌భుత్వం చాలా వీక్‌గా క‌నిపిస్తోంది.

రాష్ట్రంలో ఒకేసారి రెండున్న‌ర ల‌క్ష‌ల గ్రామ వాలంటీరు ఉద్యోగాల‌కు, 1.28 ల‌క్ష‌ల గ్రామ స‌చివాల‌య ఉద్యోగాల భర్తీకి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇది ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ ఇచ్చిన అతిపెద్ద హమీ. ఒకేసారి నాలుగు ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌డం చాలా పెద్ద విష‌యం. వెయ్యో, ప‌దిహేను వంద‌లో నిరుద్యోగ భృతి ఇవ్వ‌డం కంటే ఈ ఉద్యోగాలు బెట‌ర్‌. ఈ ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ కూడా పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని జ‌గ‌న్ ఆదేశించారు. కానీ, ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు క‌ల్పిస్తున్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పెద్ద‌గా క్రెడిట్ ద‌క్క‌లేదు. పైగా ఈ ఉద్యోగాలు వైసీపీ కార్య‌క‌ర్త‌ల కోస‌మే అని, టీడీపీ హ‌యాంలో జ‌న్మ‌భూమి క‌మిటీల్లానే ఇప్పుడు వైసీపీ వారి కార్య‌క‌ర్త‌ల‌కు ఈ ఉద్యోగాలు ఇస్తోంద‌ని నెగ‌టీవ్ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారాన్ని ప్ర‌భుత్వం తిప్పి కొట్ట‌లేక‌పోయింది. దీంతో ద‌ర‌ఖాస్తు చేసిన అభ్య‌ర్థుల్లో చాలామంది ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రుకావ‌డం లేదు.

ఇక, ఈ అసెంబ్లీలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనేక కీల‌క చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చింది. నామినేటెడ్ ప‌ద‌వులు, నామినేటెడ్ ప‌నుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డం, స్థానికుల‌కు ప‌రిశ్ర‌మ‌ల్లో 75 శాతం ఉద్యోగాలు క‌ల్పించ‌డం, బెల్టు షాపుల‌ను పూర్తిగా నియంత్రించి, ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌నిషేధం అమ‌లు చేసేలా ఎక్సైజ్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ చేయ‌డం, 100 కోట్లు దాటిన ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు జ్యుడీషియ‌ల్ క‌మిటీకి పంపించ‌డం ద్వారా అవినీతిని అడ్డుకోవ‌డం వంటి బిల్లుల‌ను మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే ప్ర‌భుత్వం పాస్ చేయించింది.

ఇవ‌న్నీజ‌గ‌న్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలే. అయితే, ఇంత‌టి కీల‌క నిర్ణ‌యాలు అమ‌లులోకి తీసుకువ‌స్తున్నా ప్ర‌భుత్వానికి క్రెడిట్ ద‌క్క‌డం లేదు. ముఖ్యంగా ఈ బిల్లుల‌పై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గ‌డం లేదు. టీడీపీ ఏదో ఓ కార‌ణంతో ఈ బిల్లులు వ‌చ్చే స‌మ‌యంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోతోంది.ప్ర‌తిప‌క్షం కూడా ఉండి అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిగితే ఈ బిల్లుల‌పై ప్ర‌జల్లో చ‌ర్చ జ‌రిగేది. ఇక‌. ప్ర‌భుత్వానికి అనుకూలంగా పెద్ద‌గా మీడియా లేక‌పోవ‌డం కూడా ప్ర‌భుత్వానికి మైన‌స్‌గా మారింది. అయితే, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌ధాన మీడియా బ‌లం లేకున్నా సోష‌ల్ మీడియాలో వైసీపీ స‌క్సెస్ అయ్యింది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూడా లేదు. దీంతో ప‌నులు చేస్తున్నా ప్ర‌భుత్వం మాత్రం క్రెడిట్ పొంద‌లేక‌పోతోంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ శిబిరం నుంచి నెగ‌టీవ్ ప్ర‌చారం మాత్రం ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున సాగుతోంది.


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle