వైట్ పేపర్లతో పార్టీల ఫైట్
11-07-201911-07-2019 07:23:12 IST
Updated On 11-07-2019 11:38:54 ISTUpdated On 11-07-20192019-07-11T01:53:12.021Z11-07-2019 2019-07-11T01:52:57.752Z - 2019-07-11T06:08:54.066Z - 11-07-2019

గత ఐదేళ్లు చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించేది. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి ఆ భారం ప్రజలపై మోపుతోందని, వృద్ధి రేటు ఎక్కువ చూపిస్తోందనే వైసీపీ పదేపదే ఆరోపించేది. ఇప్పుడు సీన్ మారి అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షంలోకి చేరగా వైసీపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మరికొద్దిగంటల్లో జగన్ ప్రభుత్వం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. అయితే, గత ఐదేళ్లుగా చేస్తున్న విమర్శలను వైసీపీ ఇప్పుడు కూడా కొనసాగించింది. గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చిందని ఆరోపిస్తున్న వైసీపీ ఇందుకు సంబంధించిన ఆధారాలు ప్రజల ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ముందుగా చెప్పినట్లే చంద్రబాబు పాలనలోని తప్పులను మరోసారి ఎత్తి చూపించే ప్రయత్నం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్థుత రాష్ట్ర పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఇప్పుడు ఈ శ్వేతపత్రాలపై వైసీపీ - టీడీపీ మధ్య వార్ మొదలైంది. 2004 నుంచి 2009 వరకు మాత్రమే ఏపీ అన్ని రకాలుగా వృద్ధి చెందిందని, చంద్రబాబు పాలించిన 2014 - 2019 మాత్రం రాష్ట్రానికి కష్టకాలమనేది ప్రభుత్వ వాదన. చంద్రబాబు ప్రతీయేడు రాష్ట్రం వృద్ధి రేటు గురించి చెప్పిన లెక్కలన్నీ డొల్లవని బుగ్గన ఆరోపించారు. గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేశారని, జీడీపీలో 3 శాతం దాటి అప్పులు చేయవద్దని, కానీ, చంద్రబాబు ప్రభుత్వం అంతకుమించి అప్పులు చేసిందని చెప్పారు. అన్ని శాఖలకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, కొందరికి జీతాలు కూడా చెల్లించలేదని బుగ్గన ఆరోపించారు. అయితే, వైసీపీ శ్వేతపత్రాలు విడుదల చేయడం వెనుక పక్కా ప్లాన్ కనిపిస్తోంది. తాము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో ప్రజలకు చెబితే భవిష్యత్‌లో ఉపయోగమని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, టీడీపీ మాత్రం శ్వేతపత్రాల వ్యవహారంపై మండిపడుతోంది. శ్వేతపత్రాలు విడుదల చేయనియ్యండి.. చూద్దాం అని చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. శ్వేతపత్రం విడుదల చేయగానే మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియా ముందుకు వచ్చారు. బుగ్గన చెప్పిన లెక్కలను తప్పుపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత రెండంకెల వృద్ధి రేటు సాధించిన ఘనత తమదేనని చెప్పారు. వరుసగా ఐదేళ్లు రెండంకెల వృద్ధి రేటు సాధించామన్నారు. హామీలను అమలు చేయలేకనే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు లెక్కలు చెబుతోందని, అప్పులు అనే సాకును వెతుక్కుంటుందనేది ఆయన వాదన. మొత్తంగా బడ్జెక్‌కు ముందే శ్వేతపత్రాలతో వైసీపీ, టీడీపీ మధ్య వార్ మొదలైంది. ఒక అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలపై మరింత హాట్ హాట్‌గా చర్చలు జరగడం ఖాయం.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
4 hours ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
5 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
6 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
11 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
12 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
13 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
14 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
15 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
16 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
16 hours ago
ఇంకా