newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

20-02-202020-02-2020 14:27:24 IST
Updated On 20-02-2020 17:14:08 ISTUpdated On 20-02-20202020-02-20T08:57:24.068Z20-02-2020 2020-02-20T08:56:53.462Z - 2020-02-20T11:44:08.922Z - 20-02-2020

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.

పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న పనులను ఆయన గురువారం పర్యవేక్షించారు.  ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ లోపలికి వెళ్లి పనులను పరిశీలించి, ప్రాజెక్ట్‌ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

Image may contain: 3 people

ప్రకాశం జిల్లా వరప్రదాయని, జీవధార అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా జూన్‌కల్లా ఒకటో సొరంగం నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే తలంపుతో వెలిగొండ ప్రాజెక్ట్‌ను పరిశీలించామన్నారు.

ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి మార్చి నాటికి184 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని సీఎం జగన్ చెప్పారు. జులై నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులకుఆగస్టు నెలలో1600 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వాలు 2014 నుండి2019 వరకుకేవలం600 మీటర్లు మాత్రమే సొరంగం పనులు చేపట్టారన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన8నెలల్లోనే 1.4 కిలోమీటర్ల  సొరంగం పనులు చేపట్టడము జరిగిందన్నారు.

మే,జూన్, నెలల్లో కృష్ణా నదిలో నీరు తగ్గుతుందని ఆ సమయంలో పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల చేపట్టడము లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లు పై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రాజెక్టు పనులు వేగవంతంగా చేపట్టడానికి  రివర్స్ టెండర్లు విధానము చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

అనంతరం ప్రాజెక్ట్‌ వద్దే జిల్లా ఉన్నతాధికారులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు జగన్. ఆర్థిక ఇబ్బందులు వున్నా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఈ సమీక్షలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle