newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

విజన్ లేని పవన్ డాక్యుమెంట్...?

19-08-201819-08-2018 05:30:00 IST
Updated On 25-10-2018 11:48:45 ISTUpdated On 25-10-20182018-08-19T00:00:00.000Z19-08-2018 2018-08-19T00:00:00.000Z - 2018-10-25T06:18:45.163Z - 25-10-2018

విజన్ లేని పవన్ డాక్యుమెంట్...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మార్పు కోసం పార్టీ పెట్టానని... ఇప్పటివరకు ఉన్న రాజకీయాలను సమూలంగా మార్చేస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌పై జనసేన నేతల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. ఎన్నో చెప్పిన పవన్ చివరాఖరికి పాత చింతకాయ పచ్చడి జనం మీదకి వదిలారని అభిమానులు మండిపడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఇతర సంప్రదాయ పార్టీల మాదిరిగా తన మేనిఫెస్టో‌ను విడుదల చేయడం ఏంటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ డాక్యుమెంట్ చూసినవారంతా కేవలం ఓటు బ్యాంకు కోసమే ఇలాంటి హామీలు ఇస్తున్నారని అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ విజన్‌ డాక్యుమెంట్‌పై మీడియాలో జరుగుతున్న చర్చలు, సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న అభిప్రాయాలను పవన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. అన్నిటినీ క్రోడీకరించి అందరికీ ఆమోదయోగ్యమయిన డాక్యుమెంట్‌ను పవన్ విడుదల చేస్తారంటున్నారు.

 

12 పాయింట్లలో ఒక్కటంటే ఒక్కటైనా కొత్తది ఉందా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు ఇస్తామని చెబుతున్న నగదు బదిలీ ఆర్థిక సాయం కొత్తది కాదు. అలాగే ఉచిత సిలెండర్‌ వంటివి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. పవన్ చెబుుతున్నట్టు భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కేవలం ప్రచారానికి బాగుంటుంది కానీ వాస్తవికతకు అద్దం పట్టదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ పార్టీ ఎందుకు ప్రజల్లోకి వెళుతుందో అని చెప్పే సరైన విధానాలు, ఎజెండా లేకుండా ప్రకటించారని విమర్శిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పినా అది అంత సులువు కాదంటున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా పవన్ తన విధానాలు తెలియచేస్తే బాగుంటుందని మరికొందరు సూచిస్తున్నారు. రాష్ట్రపరిధిలో లేని అనేక హామీలు పవన్ తెరమీదకు తెచ్చారని విమర్శిస్తున్నారు. మేనిఫెస్టోలో కీలకమయిన రాజధాని గురించి కూడా లేదని కొందరు అంటున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle