newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

20-01-202020-01-2020 15:00:12 IST
2020-01-20T09:30:12.727Z20-01-2020 2020-01-20T09:30:10.622Z - - 06-07-2020

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును, మీరు చదివింది నిజమే. తలకాయలో మెదడు ఉన్న ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. రాజకీయ పార్టీలు ఆడిన వికృత క్రీడకు సగటు ఆంధ్రుడు బలైపోయాడు. ఇందులో వాళ్ళు.. వీళ్ళు అనేకన్నా పాలించిన.. పాలిస్తున్న.. కేంద్ర, రాష్ట్ర అన్ని ప్రభుత్వాలకు వాటా ఉంది. ఎవరికి వారు వ్యక్తిగత స్వార్ధం.. సొంత రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుల, ప్రాంతాల పేరిట తునాతునకలు చేసి లబ్ది పొందుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ వరకు అందరూ కలిసే ఏపీ ప్రజల జీవితాలను సర్వనాశనం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తమ తెలంగాణ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి నిద్రపోతున్న ఉద్యమాన్ని తట్టి లేపారు.

ఇక చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీని అడ్డుపెట్టుకొని రివెంజ్ డ్రామాలు సాగించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న రోజున కూడా చంద్రబాబు రెండు ప్రాంతాలు రెండు కళ్ళతో సమానమని అంటూనే ఏపీకి జరిగే అన్యాయాన్ని ఆపలేకపోయారు. ఒకవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్-టీడీపీ ఒకరు మార్చుకొని మరొకరు పొత్తులకి దిగారు.

తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్-టీడీపీ ఒకరిపై మరొకరు అస్త్రంగా వాడుకోవాలని చూస్తే... చివరికి టీఆర్ఎస్ ఇద్దరినీ పావులుగా మార్చుకొని రాష్ట్రాన్ని సాధించుకుంది. ఫలితంగా బలైపోయింది ఆంధ్రుడే. ఉద్యమం తారాస్థాయికి చేరి ఇక రాష్ట్ర ప్రకటనే తరువాయి అన్న తర్వాత కూడా ఎక్కడ తెలంగాణలో తమ పార్టీకి నష్టం జరుగుతుందోనని ఏపీ నేతలలో చీమ కుట్టిన చలనం లేదు.

చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత కూడా ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చే డిమాండ్లు లేకపోగా సమైక్యాంధ్ర పేరుతో కొత్త పొలిటికల్ డ్రామాలకి తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ తలా తోకా లేకుండా రాష్ట్రాన్ని చీల్చి ఏపీకి అతీగతీ లేకుండా చేస్తే .. బీజేపీ మై హునా అంటూ మళ్ళీ రాజకీయమే చేసింది. అందుకు టీడీపీ తానా అంటే తందానా అంది. ఐదేళ్లు ఏం ఖర్మ పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏపీకి ఏం తక్కువ అని ఎదురు ప్రశ్నలతో మరోసారి బలయ్యింది ఆంధ్రుడే.

సరే ఉన్నంతలో తామే కష్టపడదామని నిర్ణయించుకున్న ఆంధ్ర ప్రజలు తమ బ్రతుకు తాము బ్రతుకుతూ తమ రాజధాని తామే కట్టుకోవాలని నిర్ణయించుకొని పోరాటం సాగిస్తుంటే మళ్ళీ ఎన్నికలు.. మళ్ళీ రాజకీయ పార్టీల సరికొత్త డ్రామాలు.. మరోసారి బలయ్యింది ఆ ఆంధ్రుడే. బీజేపీ ప్రత్యేకహోదా పేరుతో చేసిన మోసాన్ని తనకి అనుకూలంగా మార్చుకొనే ఉద్దేశ్యంతో టీడీపీ మరో కొత్త డ్రామాకి తెరలేపింది.

అనామకంగా ఏపీని మార్చేసిన కాంగ్రెస్ పార్టీతోనే టీడీపీ పొత్తుకి దిగి మరోసారి మాకు కావాల్సింది పక్కా రాజకీయాలేనని నిరూపించడంతో మరోసారి ఆంధ్రుడే బలయ్యాడు. కొత్త రాష్ట్రంలో తొలి ఎన్నికలలో టీడీపీ వాడుకున్న ప్రత్యేకహోదా అస్త్రాన్ని రెండోసారి ఎన్నికలకు వైసీపీ వాడుకుంటూ ఒక్క అవకాశం ఇస్తే మెడలు వంచి హోదా తెస్తానని వేసిన కొత్త ఎత్తుకి నిండా నమ్మిన ఆంధ్రుడు మరోసారి దగా పడ్డాడు.

ఎవరికి వారు వారి మోసాలకు.. ఆడే నాటకాలకు కులాలు.. మతాలు.. ప్రాంతాలను అడ్డం పెట్టుకొని ఆంధ్ర ప్రజలను నిండా ముంచేశారు. సనాతన కాలం నుండే అత్యత తెలివిగల ప్రాంతాలుగా పేరున్న ప్రజలను.. ఆ తెలివిగల ప్రజల నుండే వచ్చిన నేతలు కుళ్ళబొడిచి కుక్కినపేనుగా మార్చేసినా ఈనాడు తేరుకోలేని పరిస్థితికి నెట్టేశారు. కానీ ఒక్కటి నిజం.. ఆంధ్రుడు బలైపోయింది.. ఆంధ్రా రాజకీయ పార్టీల వికృత క్రీడకే!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle