newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

మోహన్‌బాబుకు టీటీడీ చైర్మన్ పదవి..?

29-05-201929-05-2019 12:26:39 IST
Updated On 26-06-2019 14:44:43 ISTUpdated On 26-06-20192019-05-29T06:56:39.495Z29-05-2019 2019-05-29T06:56:35.287Z - 2019-06-26T09:14:43.595Z - 26-06-2019

మోహన్‌బాబుకు టీటీడీ చైర్మన్ పదవి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ వివిధ పాలకమండళ్ళలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. నైతిక బాధ్యతగా వివిధ పాలకమండళ్ళు రాజీనామా చేయడం సంప్రదాయమని వైసీపీ నేతలు టీడీపీకి చురకలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీలో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కొత్త మంత్రులు ఎవరు.. కీలకమైన నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. 

అందులో  భాగంగా కీలకమయిన టీటీడీ చైర్మన్ పదవిపైనే అందరి ఫోకస్ ఉంది. ఈ పదవి కోసం వినిపిస్తున్న మొదటి పేరు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి. తన రాజంపేట ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినందుకు గాను ఆయనకు ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఈ పదవి కోసం ప్రచారం జరుగుతున్న ఆసక్తికరమైన పేరు మంచు మోహన్‌బాబు. మాజీ ఎంపీ అయిన మోహన్ బాబు మొన్నటి ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. అంతే కాకుండా ఆయన తిరుపతికి చెందినవాడే. వైఎస్ జగన్ కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. దీనికి తోడు ఫిలింనగర్ దైవసన్నిధానానికి చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. 

ఈ దేవాలయం విశాఖ శారదాపీఠం ఆధ్వర్యంలోనే నడుస్తుండటంతో మోహన్ బాబుకు ఈ అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. జగన్ కూడా మోహన్ బాబుకి ఈ పదవి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని, ఏవైనా రాజకీయ సమీకరణలు మారితే తప్ప మోహన్ బాబుకి ఈ పదవి ఖాయం అనేది వైసీపీ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. అంతేకాదు ఈసారి  టీటీడీ పాలకమండలిలో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నేతలకు చోటు దక్కుతుందని అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle