newssting
BITING NEWS :
* అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అమరావతి: నేడు శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం*విజయవాడ: నేడు బీజేపీ-జనసేన నేతల సమావేశం.. రాజధాని మార్పుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న పార్టీలు*నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి.. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు*జగన్ చిన్నవాడైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల నిర్ణయం సరికాదు..తరలింపు మీద జగన్ మరోమారు ఆలోచించాలి : చంద్రబాబు*బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా.. అభినందించిన హోంమంత్రి అమిత్ షా... బీజేపీ నేతలు

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై రచ్చ

23-07-201923-07-2019 14:37:44 IST
Updated On 24-07-2019 11:27:31 ISTUpdated On 24-07-20192019-07-23T09:07:44.964Z23-07-2019 2019-07-23T09:07:43.353Z - 2019-07-24T05:57:31.459Z - 24-07-2019

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై రచ్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీలో పెన్షన్లపై చర్చ వాదోపవాదాలకు దారితీసింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ముగ్గురు టీడీపీ ఉపనేతలను సస్పెండ్‌ చేశారని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

హామీలు విస్మరిస్తున్నారని సభలో ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా?అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ.. తన స్థానం నుంచి కదల్లేదని..ఎవరితోనూ దుర్భాషలాడలేదని అన్నారు. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారని, దానిని విస్మరిస్తున్నారని చెబితే సస్పెండ్‌ చేస్తారా? అని అన్నారు. 

శాసనసభ నుంచి వాకౌట్‌ చేసే అవకాశం కూడా ఇవ్వలేదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదన్నారు.

టీడీపీ హయాంలో ఏనాడూ మార్షల్స్‌ సభలోకి రాలేదని, కేవలం 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే ప్రభుత్వం వణికిపోతోందని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నుంచి తమను గెంటేసినా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

ఏపీ అసెంబ్లీలో ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం ఇదే తొలిసారి. మరోవైపు ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మండిపడ్డారు. ఉపసభాపతి కోన రఘుపతితో భేటీ అయ్యారు. 

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై చర్చించారు. నిరసన తెలియజేయడం సభ్యుల హక్కు అని, దానిని కూడా కాలరాయడం అప్రజాస్వామికమతుందని డిప్యూటీ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన స్థానంలోనే ఉన్నారని, అతడిని సస్పెండ్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు.


Image

ఆరుసార్లు శాసనసభ్యుడైన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తొలిసారి సస్పెండ్‌ చేశారని, ఇది అన్యాయమని అన్నారు.  నిమ్మల రామానాయుడిని మార్షల్స్‌ బలవంతంగా మోసుకుపోవడం అప్రజాస్వామికమని వారందరిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు.

మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. తాము ప్రవేశపెడుతున్న వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాలతో ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతోనే సభలో చర్చలకు అడ్డుపడుతున్నారని ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. మాట ఇచ్చి మాట తప్పడం తమ ఇంటా వంటా లేదన్నారు. టీడీపీ నేతలు ఎంత అడ్డు తగిలినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆయా పథకాలను అమలుచేసి తీరుతామన్నారు.

టీఆర్ఎస్ ఖబర్దార్.. గులాబీతో మజ్లీస్ పొలిటికల్ డ్రామా!

టీఆర్ఎస్ ఖబర్దార్.. గులాబీతో మజ్లీస్ పొలిటికల్ డ్రామా!

   40 minutes ago


మున్సిపల్స్‌పై కేసీఆర్‌ ప్రయోగించిన రైతు బంధు ఆయుధం!

మున్సిపల్స్‌పై కేసీఆర్‌ ప్రయోగించిన రైతు బంధు ఆయుధం!

   3 hours ago


ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాలకు ఎర.. మునిసిపల్స్ సిత్రాలు

ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాలకు ఎర.. మునిసిపల్స్ సిత్రాలు

   3 hours ago


కిషన్ రెడ్డి సీఎం అవుతారా? కేంద్రమంత్రి కామెంట్లపై హాట్ డిస్కషన్

కిషన్ రెడ్డి సీఎం అవుతారా? కేంద్రమంత్రి కామెంట్లపై హాట్ డిస్కషన్

   3 hours ago


టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్.. 17మంది సస్పెన్షన్

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్.. 17మంది సస్పెన్షన్

   4 hours ago


ఏపీకి ఇక మూడు రాజధానులు.. బిల్లుకి అసెంబ్లీ ఆమోదం

ఏపీకి ఇక మూడు రాజధానులు.. బిల్లుకి అసెంబ్లీ ఆమోదం

   4 hours ago


బీజేపీ-జనసేన పొత్తు.. సవాలక్ష సందేహాలు!

బీజేపీ-జనసేన పొత్తు.. సవాలక్ష సందేహాలు!

   5 hours ago


డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   18 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   19 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle