newssting
BITING NEWS :
* నేటి నుంచి మే 31 వరకు మార్క్‌ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు .. అన్ని జిల్లాల్లో పసుపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు *మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6, 875 చెల్లించాలని ఏపీ సర్కార్ ఆదేశం *నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ * వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం జగన్‌ ..పాల్గొననున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇంజినీరింగ్‌ అధికారులు *ఇవాళ్టితో 65వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళన.. ఫాలో అప్‌*జనసేన అధినేత పవన్ ఇవాళ ఢిల్లీ పర్యటన.. సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్న పవన్ *ఇవాళ వేములవాడలో మంత్రి కేటీఆర్‌ పర్యటన *భారతీయుడు -2 సినిమా షూటింగ్‌లో అపశృతి .. క్రేన్ కూలి ముగ్గురి మృతి * మహారాష్ట్రలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..లారీ-కారు ఢీ. ఆరుగురి మృతి

ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ రచ్చ.. బాబు ప్లానేంటి?

24-07-201924-07-2019 09:10:07 IST
Updated On 24-07-2019 10:49:00 ISTUpdated On 24-07-20192019-07-24T03:40:07.293Z24-07-2019 2019-07-24T03:39:04.337Z - 2019-07-24T05:19:00.828Z - 24-07-2019

ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ రచ్చ.. బాబు ప్లానేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ శాసనసభ సమావేశాలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. మంగళవారం శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచే సభ వ్యవహారాలకు అడ్డుపడ్డారు టీడీపీ సభ్యులు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు అడ్డుపడుతున్నారంటూ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.

సభను అడ్డుకుంటున్నారంటూ టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా సభలోనే ఉండిపోయిన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం రాజకీయదుమారం రేపుతోంది. 

ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై ఫైరయ్యారు.  పాదయాత్రలో జగన్ చేసినవన్నీ తప్పుడు వాగ్థానాలని మండిపడ్డారు.

తాము హామీలపై ప్రశ్నించినందుకు ముగ్గురు డిప్యూటీ లీడర్లను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశిస్తారని.. స్పీకర్ తూచా తప్పకుండా పాటిస్తారని ఆరోపించారు. తమకు మైక్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని.. ఇది పులివెందుల పంచాయితీ అంటూ మండిపడ్డారు.

ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు చంద్రబాబు. అసెంబ్లీ జరుగుతుండగానే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. కనీసం ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బీసీల మీద ప్రేమ ఉంటే.. అన్నింటిలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. దేవాదాయశాఖలో రిజర్వేషన్లు ఎందుకు పెట్టరని ప్రశ్నించారు.

కేవలం ముగ్గురిని టార్గెట్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. 

తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుల సస్పెన్షన్ పై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ కక్ష సాధింపులా ఉందంటూ ఆరోపించారు.జగన్ ప్రవేశపెట్టిన చట్టం అమలు కాకపోతే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయవచ్చునని అయితే ఇంకా ఏమీ కాకుండానే విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నించారు.

Image result for chandrababu Fire on mlas suspension

గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ నేతలు తిట్లతో విమర్శలకు దిగితే...నాడు అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంథాన నడుస్తోందన్నారు. ఇరు పార్టీలు తిట్టుకోవడం ఆపేసి ఇకపై ప్రజాసమస్యలపై చర్చించాలని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హితవు పలికారు. మొత్తం మీద చంద్రబాబుకి సభలో అండగా ఉండే ముగ్గురు నేతలను సస్పెండ్ చేయడం వెనుక వైసీపీ వ్యూహం కనిపిస్తోంది. 

సంచలనం రేపిన పీవీపీ .. మహిళా సీఎం కావాలని ట్వీట్

సంచలనం రేపిన పీవీపీ .. మహిళా సీఎం కావాలని ట్వీట్

   11 hours ago


‘‘చైతన్యయాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర’’ బాబుపై రోజా కామెంట్స్

‘‘చైతన్యయాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర’’ బాబుపై రోజా కామెంట్స్

   13 hours ago


చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్

చంద్రబాబు కుటుంబ ఆస్తులు ప్రకటించిన లోకేష్

   13 hours ago


వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన జగన్

   15 hours ago


ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

ఎమ్మార్వో కారు ఆపిన ఘటన.. 426మందిపై కేసులు

   16 hours ago


ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

   16 hours ago


సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

సాక్షివి రాతలు కాదు రోతలు.. ప్రెస్‌కౌన్సిల్‌కు టీడీపీ!

   17 hours ago


టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

టీఆర్ఎస్ 'పట్టణ ప్రగతికి' రేవంత్ 'బస్తీ బాట' కౌంటర్!

   18 hours ago


ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

ఆధార్ నోటీసులపై అసదుద్దీన్ ఫైర్.. కీలక ట్వీట్

   19 hours ago


కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

కేసీయార్ స్ట్రాటజీ మారిందా... ఇక జాతీయంపై ఫోకస్?

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle