మరేటి సేత్తాం.. వాకౌట్ చేత్తాం. బొత్స రూటే సపరేటు..!
22-07-201922-07-2019 14:58:05 IST
Updated On 23-07-2019 11:28:02 ISTUpdated On 23-07-20192019-07-22T09:28:05.451Z22-07-2019 2019-07-22T09:28:00.688Z - 2019-07-23T05:58:02.480Z - 23-07-2019

ఆయనో మాజీ మంత్రి. కానీ ఆయన రూటే సపరేటు. ఏదైనా ప్రశ్నడిగితే ఏటి సేత్తాం అంటారాయన. గతంలో ఓ కుంభకోణం విషయంలో ఆయన మాట్లాడిన మాటలవి. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. ఒక మంత్రిగా శాసనసభ, శాసనమండలిలో సభ్యులు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వాకౌట్ చేశారు, ఈయన వాకౌట్‌తో అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులు ఒకింత కంగుతిన్నారు. అధికార పార్టీకి చెందిన.. పైగా మంత్రి వాకౌట్ చేయడం ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ అధికార పార్టీకి చెందిన సభ్యులుగానీ.. మంత్రులుగానీ వాకౌట్ చేసిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. కరువు, అనావృష్టిపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించారు. కరువుపై అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలను తెప్పిస్తున్నామని.. త్వరలోనే ఈ లెక్కలు తేలతాయని మంత్రి చెప్పారు. అంతా బాగానే ఉంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు అయిందన్నారు. ఆత్మహత్యలు ఎవరు చేసుకున్నారు..? ఎటువంటి పరిస్థితుల్లో చేసుకున్నారు..? అనే దానిపై నివేదిక తయారు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పనిలో పనిగా గడచిన ఐదుసంవత్సరాల్లో గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి విమర్శలు గుప్పించారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలోనే సభ నుంచి మంత్రి వెళ్ళిపోయారు. మరోవైపు.. ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి వెళ్లిపోవడంపై టీడీపీ శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చర్చపై సరైన సమాధానం రాకపోవడం, మంత్రి బొత్స మండలి నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ శాసనమండలి సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే ఈ వాకౌట్ వ్యవహారంపై బొత్స రియాక్షన్ రావాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తన సోదరుడు హఠాన్మరణం చెందడంతో ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేకపోతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ బడ్జెట్ కూడా బొత్స ప్రవేశపెట్టారు. కీలకమయిన కరువు అంశంపై చర్చ జరుగుతుండగా.. మంత్రి వాకౌట్ చేయడంపై టీడీపీ సభ్యులు విమర్ళలు చేస్తున్నారు. అయితే అది వాకౌట్ కాదని, ఆయన వ్యక్తిగత పనుల కోసం వెళ్ళారని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సింది మాత్రం మంత్రి బొత్సనే.

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’
3 hours ago

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్
5 hours ago

దిశ ఎన్ కౌంటర్ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
6 hours ago

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు
6 hours ago

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి
7 hours ago

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!
8 hours ago

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?
8 hours ago

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
9 hours ago

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం
11 hours ago

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్హెచ్ఆర్సీపై రోజా ధ్వజం
11 hours ago
ఇంకా