newssting
BITING NEWS :
* కరోనా నెగిటివ్ రిపోర్టుతో వ‌చ్చిన‌వారికి మాత్ర‌మే గోవాలోకి అనుమ‌తి *భ‌ద్రాద్రి: నేటి నుంచి మూడు రోజుల పాటు దేశ‌వ్యాప్త బొగ్గుగ‌నుల స‌మ్మె*ఏపీ: క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ఆన్‌లైన్‌లోనే హైకోర్టులో కేసుల విచార‌ణ‌.. నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా కేసుల విచార‌ణ*తూర్పుగోదావరి జిల్లా : కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో నేటి నుండి జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గింపు *ఛత్తీస్ గడ్: రాజానందగావ్ జిల్లాలో భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు. చూరియా సర్కిల్ పరిధి కటెంగా అటవీప్రాంతంలో జిల్లా పోలీసులు, డిఆర్జీ, ఐటిబిపి సిబ్బంది, మావోయిస్టుల ఏరివేతకు కూబింగ్... కాల్పులు. ప్లాటూన్ 1 డివిసి కమాండర్ డేవిడ్ అలియాస్ ఉమేష్ అనే మావోయిస్టు మృతి *ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రియాంక గాంధీకి కేంద్రం నోటీసు. ఆగష్టు 1 లోపు ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఆదేశం*తెలంగాణలో ఈరోజు 1018 కరోనా కేసులు. కరోనాతో ఇవాళ ఏడుగురు మృతి. ఇవాళ ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణలో మొత్తం 17,357 కరోనా కేసులు నమోదు *గుంటూరు జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్. అచ్చెన్నాయుడు కోలుకున్నారని వైద్యుల రిపోర్ట్. అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్ జైలుకు తరలింపు*తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం. పలువురు అధికారులకు సోకిన కరోనా. మిగతా ఉద్యోగులకు టెస్టులు చేయించిన అధికారులు. 18 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ *పిల్లి సుభాష్, మోపిదేవి ఎమ్మెల్సీ పదవుల రాజీనామాలు ఆమోదం. నోటిఫికేషన్ జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీ*సింగరేణి సీఎండీపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేసు నమోదు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో రూ. 200 కోట్ల డీజిల్ కుంభకోణంపై విచారణ

మంత్రులు సీఎం జగన్ మాట వినడంలేదా?

03-07-201903-07-2019 13:21:32 IST
Updated On 03-07-2019 13:24:33 ISTUpdated On 03-07-20192019-07-03T07:51:32.479Z03-07-2019 2019-07-03T07:51:24.179Z - 2019-07-03T07:54:33.402Z - 03-07-2019

మంత్రులు సీఎం జగన్ మాట వినడంలేదా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొంతమంది మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. తాను చెప్పిన పనులు, సూచనలు పాటించడం లేదని ఆయన మండిపడుతున్నారని అమరావతి మీడియా వర్గాల కథనం.

పాలనలో అంతగా అనుభవం లేని సీఎం జగన్ సీనియర్ అధికారుల సూచనలతో ముందుకెళుతున్నారు. నెలరోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నా.. మంత్రులు మాత్రం తన మాటల్ని లెక్కచేయడం లేదని ఆయన కినుకగా ఉన్నారు. వారికి ఒకట్రెండుసార్లు చెప్పినా తన రూట్లోకి రావడం లేదనే అభిప్రాయం ఆయనలో వ్యక్తం అవుతోందని అంటున్నారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పట్టించుకోవడం లేదనడానికి ఒకట్రెండు ఉదాహరణలు కూడా తెరమీదకి తెస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత ప్రభుత్వంలో మంత్రులవద్ద పనిచేసిన వారిని పేషీల్లోకి తీసుకోవద్దంటూ సీఎం ఆదేశాలు జారీచేశారు. అయితే వాటిని మంత్రులు అంతగా పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదంటున్నారు.

అందులో భాగంగా పీఏ,పీఎస్,ఓఎస్డీ ల నియామకంలో సీఎం ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. టీడీపీ హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని పేషీల్లో పెట్టుకున్నారు పలువురు మంత్రులు. గతంలో ఆరోపణలు ఉన్న వారిని తమ వెనుక తిప్పుకుంటున్న మంత్రుల తీరుపై జగన్ ఆగ్రహంతో ఉన్నారు. 

విద్యాశాఖ మంత్రి పీఎస్ పైనా గతంలో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయన మళ్ళీ ఇప్పుడు కొనసాగుతున్నారు. పేషీల్లో సిబ్బంది నియామకంపై నిఘా నివేదికలు తెప్పించుకుంటున్న సీఎం జగన్ రానున్న రోజుల్లో మంత్రులకు క్లాస్ పీకడం ఖాయంగా కనిపిస్తోంది. తన మాటను లెక్కచేయని వారిపై కఠినచర్యలకు కూడా వెనుకాడనని సన్నిహితుల వల్ల జగన్ పేర్కొన్నారని తెలుస్తోంది.

ఇప్పుడు తీసుకున్న మంత్రులు సగం కాలం మాత్రమే మంత్రివర్గంలో ఉంటారు. మరో రెండున్నరేళ్ళ తర్వాత జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి ప్రస్తుత మంత్రులను తీసేసి, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తాముండేది కొంతకాలమే కదా, ఏం చేసినా నడుస్తుందనే ధోరణిలో ఉన్నారని తెలుస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle