newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

బీజేపీ-జనసేన పొత్తు.. సవాలక్ష సందేహాలు!

21-01-202021-01-2020 07:41:21 IST
Updated On 21-01-2020 07:41:19 ISTUpdated On 21-01-20202020-01-21T02:11:21.613Z21-01-2020 2020-01-21T02:09:37.369Z - 2020-01-21T02:11:19.436Z - 21-01-2020

బీజేపీ-జనసేన పొత్తు.. సవాలక్ష సందేహాలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అన్న రూట్లోనే తమ్ముడు పయనిస్తున్నాడా?

అప్పుడు ప్రజారాజ్యం.. ఇప్పుడు జనసేన

పార్టీలు,జెండాలు వేర్వేరు.. ఎజెండాలు ఒక్కటేనా?

పాలిటిక్స్ వీరికి పార్ట్ టైమ్ జాబేనా?

అప్పుడు అధికార పార్టీ కాంగ్రెసులో పీఆర్పీ విలీనం

ఇప్పుడు అధికార పార్టీ బీజేపీలో జనసేన విలీనం కానుందా?

అప్పుడు అన్న చిరంజీవి.. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న బీజేపీ-జనసేన పొత్తు

2014 ఎన్నికల సందర్భంగా సీన్ మరోమారు రిపీట్ అవుతోంది. కాకపోతే అప్పటికీ ఇప్పటికే టీడీపీయే తేడా. 2014లో టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి పోటీచేశాయి. కానీ జనసేన మాత్రం తమ అభ్యర్ధుల్ని నిలబెట్టలేదు. కానీ 2019లో ఎవరికివారే యమునా తీరే అన్నరీతిలో ఒంటరి పోరు చేశారు. కానీ అక్కడక్కడా టీడీపీ-జనసేన లోపాయకారీ ఒప్పందాలు చేసుకున్నాయని వైసీపీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

2024లో అధికారం మాదే... బీజేపీ-జనసేన పొత్తు పొడిచింది

తాజాగా మళ్లీ 2014 సీన్ కనిపిస్తోంది. టీడీపీని దూరంగా పెట్టిన బీజేపీని కలుపుకుని పోవడానికి జనసేన ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారుతోంది. అసలు జనసేన-బీజేపీ మధ్య స్నేహం మళ్ళీ చిగురించడానికి కారణం ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామానికి ముందే పవన్ ఈ సంగతి చెప్పకనే చెప్పారు. తాను బీజేపీకి దూరంగా లేనన్నారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తు పొడవడానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌ రావు కీలక పాత్ర పోషించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

జనసేనలోనే వున్న తన కుమారుడు నాదెండ్ల మనోహర్‌ ద్వారా చక్రంతిప్పారని, కుమారుడి భవిష్యత్తు కోసం నాదెండ్ల ఈ రిస్క్ చేశారని అంటున్నారు.  2019 జులైలో భారతీయ జనతా పార్టీలో చేరారు నాదెండ్ల భాస్కర్‌ రావు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాల వెల్లడి అనంతరం కమలం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. నాదెండ్ల పార్టీమార్పుపై అనేకమంది పెదవి విరిచారు. 

ఈ వయసులో మీకు రాజకీయాలు అవసరమా అంటూ నోరెళ్ళబెట్టారు అనేకమంది నేతలు. రాజకీయనేతల ప్రతి అడుగూ తమ కోసం, లేదంటే తమ కుటుంబం కోసం అంటారు. అదే నిజమయింది. నాదెండ్ల భాస్కర్ రావు కమలం చెంతకు చేరింది మనోహర్ కోసమే అంటున్నారంతా.  ఇటీవల పార్టీలో చేరిన నేతలైన సుజనా చౌదరి. గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్, వరదాపురం సూరి, ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటివారికి అసలు తెలీకుండా ఈపొత్తు పొడిచింది. 

తాను బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పుడే మనోహర్ ని కూడా రమ్మంటే.. తనకు పవన్ ని ఒంటరిగా వదిలి రావడం ఇష్టంలేదన్నారు. దీంతో ఇప్పుడు నాదెండ్ల చక్రం తిప్పారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకానొక దశలో బీజేపీలో విలీనం చేయాలని పవన్ ని వత్తిడి చేశారు. ఇప్పటికిప్పుడు విలీనం అంటే విశ్వసనీయత పోతుందని పవన్ అందుకు ఒప్పుకోలేదంటున్నారు.  జగన్‌పై పోరాటం చేయడానికి బలం సరిపోవడం లేదని భావిస్తున్న పవన్‌, ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారని తెలుస్తోంది. బీజేపీతో కలిసి నడవడానికి అంగీకారం తెలిపారని,పార్టీ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పవన్  ఈనిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

బీజేపీకి కూడా జనం కావాలి సీట్లు గెలవకపోయినా ఓటు బ్యాంకు ఉన్న పవన్ లాంటి వ్యక్తి కావాలని పొత్తుకు ఒప్పుకుందట. ఈమధ్యకాలంలో పవన్ లో హిందూత్వ భావాలు పెరిగాయి. హిందూ ధర్మం, మతమార్పిళ్లు, జగన్‌ క్రిస్టియానిటీపై అదేపనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టడంతో పవన్ తన దారిలోకి వస్తున్నారని బీజేపీ నేతలు కూడా భావించారు. కామ్రేడ్లతో చెట్టాపట్లాలేసుకుని తిరిగిన పవన్ తర్వాత కాషాయం వైపు మళ్ళడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

బీజేపీతో కొంతకాలం ప్రయాణించి.. తర్వాత అందులో విలీనం చేయడం ఖాయం అంటున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కూడా అలాగే అధికార కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రభుత్వాన్ని ఆదుకుని ఆపద్బంధువు అయ్యారు చిరంజీవి. కొంతకాలం తర్వాత పీఆర్పీని కాంగ్రెసు పార్టీలోకి విలీనం చేసి కేంద్రమంత్రి పదవి పొందారు. ఈ విలీనంపై అనేక విమర్శలు వచ్చాయి. వాటిని చిరంజీవి పట్టించుకోలేదు. 

ఇప్పుడు అన్నబాటలోనే తమ్ముడు జనసేనను బీజేపీలో విలీనం చేసి భారతీయజనసేన పార్టీగా మార్చడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, పాచిపోయిన లడ్డూలంటూ వెటకారాలు చేసిన పవన్ ఆపార్టీకి దగ్గర కావడంపై వైసీపీ నేతలు చురకలు వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబు సూచనల మేరకే జనసేనాని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని వైసీపీ నేతల ఆరోపిస్తున్నారు.

చంద్రబాబునాయుడు తరహాలోనే పవన్ నాయుడు అంటూ మంత్రి పేర్నినాని పదే పదే సెటైర్లు వేసిన సంగతి గుర్తుండే వుంటుంది. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ అనీ, ఆయన ఏం చెప్తే అది పవన్ చేస్తున్నారని.. బీజేపీతో పొత్తు ఎపిసోడ్‌కు చంద్రబాబే డైరెక్టర్ అని విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద రాబోయే రోజుల్లో మరో జెండా పీకేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయనేది వాస్తవం. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle