newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

ప్రజావేదిక కూల్చివేత.. ఎవరెవరు ఏమన్నారంటే..?

26-06-201926-06-2019 15:19:35 IST
Updated On 26-06-2019 15:51:01 ISTUpdated On 26-06-20192019-06-26T09:49:35.494Z26-06-2019 2019-06-26T09:49:32.330Z - 2019-06-26T10:21:01.119Z - 26-06-2019

ప్రజావేదిక కూల్చివేత.. ఎవరెవరు ఏమన్నారంటే..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తలనొప్పులు తప్పడంలేదు. విదేశీ పర్యటనలో ఉండగా, నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం కాగా, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

కలెక్టర్ల సమావేశం సందర్భంగా ప్రజావేదిక అక్రమ నిర్మాణం అని, దానిని కూల్చేస్తామని ప్రకటించిన వెంటనే కార్యాచరణ చేపట్టారు. అందులో భాగంగా ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత శరవేగంగా సాగుతోంది. ప్రజావేదిక కూల్చివేత పనులు చేపట్టడంపై రాజకీయంగా మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. 

ఈ ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ప్రజావేదికను కూల్చాల్సిన అవసరమేముందని టీడీపీ నేతలు కళా వెంకట్రావు, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.

ఈచర్య ద్వారా సీఎం జగన్‌ ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని నిలదీశారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు బంజారాహిల్స్‌ రోడ్‌నెం.2లో అక్రమంగా నిర్మించిన ఇంట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబం నివసిస్తుంటే.. చంద్రబాబు వదిలేశారని, అదీ ఆయన విజ్ఞత అని గుర్తు చేశారు. ఆతరువాత ఆ ఇంటిని రెగ్యులరైజ్‌ చేయించుకున్నారని టీడీపీ నేతలు అన్నారు.

ప్రభుత్వం కక్ష పూరిత చర్యలతో వెళ్తోందని వారు ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేత ప్రభుత్వ విధానాలకు అద్దంపడుతోందని టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సి వస్తుందనే ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం చేపట్టారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆరోపించారు.

సీఎం జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలన్నారు సవన్. అనుమతిలేని అన్ని భవనాలను కూలిస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు.

ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయడం తుగ్లక్ చర్యగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తిప్పికొట్టారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌ను ఒకసారి చదివితే...ఎవరు తుగ్లకో తెలుస్తుందని యనమలకు సూచించారు. మొత్తం మీద ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోందని చెప్పాలి.  

No photo description available.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle