newssting
BITING NEWS :
* అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అమరావతి: నేడు శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం*విజయవాడ: నేడు బీజేపీ-జనసేన నేతల సమావేశం.. రాజధాని మార్పుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న పార్టీలు*నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి.. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు*జగన్ చిన్నవాడైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల నిర్ణయం సరికాదు..తరలింపు మీద జగన్ మరోమారు ఆలోచించాలి : చంద్రబాబు*బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా.. అభినందించిన హోంమంత్రి అమిత్ షా... బీజేపీ నేతలు

పోలవరం అథారిటీ సలహాను జగన్ పాటిస్తారా?

17-08-201917-08-2019 09:17:56 IST
Updated On 20-08-2019 12:03:08 ISTUpdated On 20-08-20192019-08-17T03:47:56.827Z17-08-2019 2019-08-17T03:47:49.588Z - 2019-08-20T06:33:08.199Z - 20-08-2019

పోలవరం అథారిటీ సలహాను జగన్ పాటిస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలవరం టెండర్ల విషయంలో జగన్ సర్కార్ దూకుడుపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అయినా జగన్ సర్కార్ వేగం పెంచుతూనే వుంది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆయన చెప్పిన అంశాలను లెక్క చెయ్యకుండా ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ముందడుగు వేయాలని భావిస్తున్నారు జగన్. అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సి ఈ వో గా ఉన్న ఆర్కే జైన్ మరోమారు ప్రభుత్వాన్ని ఆలోచన విరమించుకోవాలని సూచిస్తూ లేఖ రాయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్‌ ప్రకటనకు సిద్ధమవుతూ.. శుక్రవారం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో.. ప్రాజెక్టు అథారిటీ ఈ సూచనలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.  పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్‌.కె.జైన్‌  శుక్రవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి లేఖ రాయడంతో ఈ అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. 

పోలవరం రీటెండరింగ్‌ అంశంపై ఈ నెల 13న హైదరాబాద్‌లో అత్యవసరంగా నిర్వహించిన పీపీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్నే ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ప్రాజెక్టు విస్తృత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రిక్లోజర్‌, రీ టెండరింగ్‌ ఆలోచనల్ని విరమించుకోవాలని మీకు వినయపూర్వకంగా సలహా ఇస్తున్నాను. కనీసం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక వైఖరి తీసుకునే వరకైనా... మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి’’ అని సూచించారు. 

అంతేకాకుండా, పోలవరం ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరంగానీ, అలా చేయాలన్న ఆలోచనకు బలమైన ప్రాతిపదికగానీ లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయితే, దాని భారం రాష్ట్రప్రజలపై పడుతుందని జైన్ అంటున్నారు.

ప్రాజెక్టు కోసం మళ్లీ టెండర్లు పిలిచి వేరే సంస్థకు పనులు అప్పగిస్తే ఖర్చు పెరగడం, ప్రాజెక్టులో జాప్యం జరగడంతో పాటు ఇతర సమస్యలూ తలెత్తుతాయని తెలిపింది. ఖర్చు పెరిగితే ఆ భారాన్ని కేంద్రం భరించబోదనీ స్పష్టం చేసింది. ఇప్పుడు పనులు చేస్తున్న సంస్థను కాదని, మరో సంస్థకు పనులు అప్పగిస్తే సాంకేతిక నైపుణ్యం, డిజైన్ల పరంగా సమన్వయం ఎలా సాధ్యపడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, ఇంజినీర్లను ప్రశ్నించింది. 

అయితే, రీ-టెండరింగ్‌ ద్వారా పోలవరం నిర్మాణంలో వ్యయం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, పనుల్లో జాప్యం జరుగుతుందని మాత్రమే పోలవరం అథారిటీ పేర్కొందని జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వ పనితీరుపైనే పోలవరం అథారిటీ అనుమానాలు వ్యక్తం చేసినట్టు అనిపిస్తోందన్నారు.

రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను శనివారం ప్రారంభించి సెప్టెంబర్‌ 15కల్లా పూర్తి చేస్తామన్నారు. నవంబరు 1 నుంచి పనులు ప్రారంభమవుతాయని, 2021 జూన్‌ నాటికి పోలవరం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. తాజాగా పీపీఏ సిఈ ఓ జైన్ లేఖ రాయటం ప్రభుత్వ వర్గాలను ఆలోచనలో పడేసింది.

మున్సిపల్స్‌పై కేసీఆర్‌ ప్రయోగించిన రైతు బంధు ఆయుధం!

మున్సిపల్స్‌పై కేసీఆర్‌ ప్రయోగించిన రైతు బంధు ఆయుధం!

   27 minutes ago


ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాలకు ఎర.. మునిసిపల్స్ సిత్రాలు

ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాలకు ఎర.. మునిసిపల్స్ సిత్రాలు

   40 minutes ago


కిషన్ రెడ్డి సీఎం అవుతారా? కేంద్రమంత్రి కామెంట్లపై హాట్ డిస్కషన్

కిషన్ రెడ్డి సీఎం అవుతారా? కేంద్రమంత్రి కామెంట్లపై హాట్ డిస్కషన్

   an hour ago


టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్.. 17మంది సస్పెన్షన్

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫైర్.. 17మంది సస్పెన్షన్

   an hour ago


ఏపీకి ఇక మూడు రాజధానులు.. బిల్లుకి అసెంబ్లీ ఆమోదం

ఏపీకి ఇక మూడు రాజధానులు.. బిల్లుకి అసెంబ్లీ ఆమోదం

   2 hours ago


బీజేపీ-జనసేన పొత్తు.. సవాలక్ష సందేహాలు!

బీజేపీ-జనసేన పొత్తు.. సవాలక్ష సందేహాలు!

   3 hours ago


డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   16 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   17 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   18 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   19 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle