newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

పోలవరంలో కొనసాగుతున్న పనులు.. ఆందోళనలో కార్మికులు

28-03-202028-03-2020 12:51:57 IST
Updated On 28-03-2020 13:42:36 ISTUpdated On 28-03-20202020-03-28T07:21:57.738Z28-03-2020 2020-03-28T07:21:31.626Z - 2020-03-28T08:12:36.769Z - 28-03-2020

పోలవరంలో కొనసాగుతున్న పనులు.. ఆందోళనలో కార్మికులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంటే పోలవరంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది కార్మికులతో యథేచ్ఛగా ప్రాజెక్ట్ పనులు చేయిస్తోంది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. కార్మికులకు  కరోనా వ్యాప్తి చెందకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండాలని సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతుంటే వేలాది మంది కార్మికులకు ఒకేచోట భోజనాలు ఏర్పాటు చేసింది. 

ఎక్కువ మంది ఒకే లారీ లో ఎక్కించి తరలిస్తున్న పట్టించుకోవడం లేదు అధికారులు. మాస్కులు, శానిటేషన్ లు వంటివి అందించలేదని వాపోతున్నారు కార్మికులు. చేసిన పనికి జీతాలు ఇచ్చి స్వగ్రామాలకు పంపాలని వేడుకుంటున్నారు కార్మికులు. కరోనా భయంతో పోలవరంలో బతకాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు కార్మికులు. ఈ విషయలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. 

విజయవాడలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అంతరాష్ట్ర వలస కూలీలను అధికారులు అడ్డుకున్నారు. విజయవాడ నగర శివారులో వారిని అడ్డుకున్నారు విధుల్లో ఉన్న పోలీసులు. పోలీసులకు పొంతన లేని సమాధానం చెప్పడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, రాజమండ్రి ప్రాంతాల నుండి విజయవాడకు వచ్చారు ఈ కూలీలు. ఈ సంగతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.వారిని పంపించాలా..వద్దా? అనే విషయమై పోలీసులు తర్జన, భర్జన పడుతున్నారు.  ఎక్కువమంది గుమిగూడకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

ఇదిలా ఉంటే వివిధ పరిశ్రమల్లో ఉత్పాదక పనులు కొనసాగుతూనే వున్నాయి. దీంతో కార్మికశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా, గుంటూరు,ప్రకాశం జిల్లాలో కార్మికులను బెదిరిస్తున్నాయి యాజమాన్యాలు. విజయవాడలో ఆటోనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలో కార్మికులు వందలాదిమంది డ్యూటీల్లో వున్నారు. జోరుగా సాగుతున్నాయి ఇటుక రాయి బట్టీలు. ఒంగోలు మండలంలోని కరవది, వలేటివారి పాలెం, త్రోవగుంట,తెల్ల డొంక ప్రాంతాలు, గుంటూరు నల్లచేరువు లాంచీల రోడ్డులోని గుంపులు గుంపులుగా కార్మికులు కనిపిస్తున్నారు. కాటన్ , వుడ్, మిర్చి, వ్యాపారస్తులు 100ల మంది కార్మికులతో పని చేయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదని, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇటు కరోనా వైరస్ ప్రభావంతో  రాష్ట్రంలో ఆక్వా రంగం విలవిలలాడుతోంది. ఉభయగోదావరి, కృష్ణా,నెల్లూరు జిల్లాలో రొయ్య రైతుల కన్నీళ్లు పెడుతున్నారు. ఆక్వా ఫీడ్,మందుల సరఫరా లేక వైరస్ బారిన పడుతున్నాయి రొయ్యల చెరువులు. ఎగుమతి లేదంటూ రైతులను మోసం చేస్తున్నాయి పలు కంపెనీలు. కిలో 400 కు అమ్మాల్సిన రొయ్యలు 100 నుంచి 150 కి అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. రైతుల నుంచి అతి తక్కువ ధరకు రొయ్యలు కొనుగోలుచేస్తున్న పలువురు రాజకీయ నాయకుల కంపెనీలు. తర్వాత వాటిని భారీ ధరకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో  ఆక్వా ఎగుమతులపై మంత్రి మోపిదేవి సమీక్ష నిర్వహించనున్నారు. 

 

19న రాజ్యసభ ఎన్నికలు..18 సీట్లకు పోలింగ్

19న రాజ్యసభ ఎన్నికలు..18 సీట్లకు పోలింగ్

   an hour ago


ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే... జగన్ పై కన్నా విమర్శలు

ఏడాది పాలనలో అన్నీ వైఫల్యాలే... జగన్ పై కన్నా విమర్శలు

   an hour ago


వైసీపీకి స్వ‌ప‌క్షంలో విప‌క్ష నేత‌గా మారిన‌ ఎంపీ

వైసీపీకి స్వ‌ప‌క్షంలో విప‌క్ష నేత‌గా మారిన‌ ఎంపీ

   2 hours ago


త్రిశంకు స్వర్గంలో ఎన్నికల కమిషనర్.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం

త్రిశంకు స్వర్గంలో ఎన్నికల కమిషనర్.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం

   5 hours ago


 గిరిజనుల చెంతకు చేరని సంక్షేమ ఫలాలు

గిరిజనుల చెంతకు చేరని సంక్షేమ ఫలాలు

   7 hours ago


ఏపీ వెళ్ళాలంటే ‘స్పందన’లో నమోదుచేయాల్సిందే!

ఏపీ వెళ్ళాలంటే ‘స్పందన’లో నమోదుచేయాల్సిందే!

   8 hours ago


జగన్ పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో వైరల్

జగన్ పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో వైరల్

   9 hours ago


నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు

నల్లగొండలో ఎంపీ వర్సెస్ మంత్రి.. మాటల తూటాలు

   11 hours ago


తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలంగాణలో ఒక్కరోజే 199 కేసులు.. అదుపు తప్పుతున్న తెలుగు రాష్ట్రాలు

   11 hours ago


కరోనా విరామం.. మళ్లీ టీపీసీసీ చీఫ్ రాజకీయం!

కరోనా విరామం.. మళ్లీ టీపీసీసీ చీఫ్ రాజకీయం!

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle