పాలకొల్లులో ఎస్వీరంగారావు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్.. పవన్ ప్లాన్
01-07-201901-07-2019 07:35:30 IST
Updated On 03-07-2019 12:53:54 ISTUpdated On 03-07-20192019-07-01T02:05:30.854Z01-07-2019 2019-07-01T01:57:23.617Z - 2019-07-03T07:23:54.668Z - 03-07-2019

2019ఎన్నికల్లో షాక్ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. తన అన్న చిరంజీవి అత్తగారి ఊరైన పాలకొల్లులో ఏదైనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలని నిర్ణయించారు. తెలుగు తేజాన్నివిశ్వవ్యాప్తం చేసిన దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరుతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రారంభించనున్నట్టు పార్టీ ప్రకటించింది. త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఇన్ స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి పాలకొల్లులో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎన్నికల క్షేత్రంలో నిలిచారు. భీమవరం, గాజువాక నుంచి పోటీచేసి ఓడిపోయారు.కానీ స్వంత జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తేవాలని పవన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆలోచన చేశారు. చిరంజీవి మామగారు పద్మశ్రీ అల్లు రామలింగయ్య, దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ లాంటి ఉద్దండులను సినీ రంగానికి అందించిన ఘనత పాలకొల్లుకు దక్కుతుంది. అలాంటివారిని గుర్తుంచుకోవడానికి ఈ ఇనిస్టిట్యూట్ దోహదం చేస్తుందని జనసేన పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాజా వన్నెంరెడ్డి, బన్నీ వాసుల నేతృత్వంలో నడిచే ఈ ఇన్స్టిట్యూట్కి హరిరామజోగయ్య చైర్మన్ కాగా, రాజా వన్నెంరెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారు. శిక్షణ విధానం, ఫ్యాకల్టీ సిద్ధంగా ఉందని.. నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలో ముహుర్తం ఖరారు చేస్తామని ఆ ప్రకటన తెలిపింది. మొత్తం మీద తెలుగు చలనచిత్రరంగంలో పాలకొల్లు ఖ్యాతి మరింతగా పెరుగుతుందని స్థానికులు, సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఇలాంటి అసెంబ్లీని ఎక్కడా చూడలేదు?’’
2 hours ago

సాక్షి రాసింది తప్పేనని ఒప్పుకున్న సీఎం జగన్
5 hours ago

దిశ ఎన్ కౌంటర్ ఎఫెక్ట్: హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య
6 hours ago

దిశ కేసులో ట్విస్ట్: నిందితుల్లో ఇద్దరు మైనర్లు
6 hours ago

ఉల్లి ధరల టీడీపీ.. హెరిటేజీతో వైసీపీ ఎదురుదాడి
7 hours ago

తెలంగాణలో తీరనున్న ఉల్లి లొల్లి.. ఇక సబ్సిడీ ధరకే!
8 hours ago

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?
8 hours ago

మానవహక్కుల సంఘానికి పోలీసుల నివేదిక
9 hours ago

రేపిస్టులకు మూడు వారాల్లో ఉరి శిక్ష: ఏపీ ప్రభుత్వ నిర్ణయం
10 hours ago

నిందితులకు మాత్రమే హక్కులున్నాయా.. ఎన్హెచ్ఆర్సీపై రోజా ధ్వజం
11 hours ago
ఇంకా