newssting
BITING NEWS :
*ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,112...మరణాలు 71*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు కాలువలో విషవాయువు కలకలం

08-05-202008-05-2020 09:26:55 IST
Updated On 08-05-2020 10:17:29 ISTUpdated On 08-05-20202020-05-08T03:56:55.900Z08-05-2020 2020-05-08T03:56:47.161Z - 2020-05-08T04:47:29.965Z - 08-05-2020

పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు కాలువలో విషవాయువు కలకలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు విషవాయువు ప్రభావం విశాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే పశ్చిమగోదావరి జిల్లాలో విషవాయువు కలకలం రేపింది. చేబ్రోలు దగ్గర దుర్వాసనతో పాటు కళ్ళు మండుతున్నాయని స్థానికులు పోలీసులకు అర్ధరాత్రి సమాచారం ఇచ్చారు. దీంతో విశాఖ గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు అప్రమత్తం అయ్యారు. ఏలూరు ప్రధాన కాలువలో పోసిన పరిశ్రమ వ్యర్థాల వల్లేనని గుర్తించారు. వ్యర్థాలను దిగువకు  ప్రవహించేలా నీటిని విడుదల చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు స్థానికులు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు జాతీయ రహదారి వద్ద  అర్ధరాత్రి వేళ కలుషిత వాయువు కలకలం రేపింది. కలుషితమై దుర్వాసనతో పాటు కళ్ళు మండుతున్నాయని స్థానికులు చేబ్రోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేబ్రోలులోని సుబ్రమణ్య స్వామి ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనతో సమీపంలోని దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు.

ఎమ్మార్వో జాన్ రాజు ,గణపవరం సిఐ భగవాన్ ప్రసాద్, ఎస్ఐ వీర్రాజు పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఏలూరు ప్రధాన కాలువలో పరిశ్రమ వ్యర్థాలు పార పోసినట్లు గుర్తించారు. అనంతరం దీనివల్లే దుర్వాసన, కళ్లు మండటం జరిగిందని నిర్ధారించారు. దీంతో అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఈ వ్యర్థాన్ని దిగువకు  ప్రవహించేలా నీటిని జల్లారు. అసలే వేసవికాలం పారిశ్రామిక వ్యర్ధాలు, విషవాయువులు నీటిలో వదిలితే ఎండకు అవి  తమ ప్రభావం చూపుతుంటాయి. తాజాగా అదే జరిగిందంటున్నారు. 

రాత్రి పది గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి కాలువను పరిశీలిస్తే ఎవరో పారిశ్రామిక వ్యర్థాలను నీటిలో కలపడం వల్ల ఈ సమస్య వచ్చిందని తేలిందన్నారు సీఐ భగవాన్ ప్రసాద్. దీనిపై నీళ్ళు చల్లి ఆ వ్యర్థాలను కిందికి పంపించామన్నారు. 

విశాఖలో ప్రమాదకరమయిన రసాయన వాయువు లీక్‌ కావడంతో రోడ్లపై ఉన్న ప్రజలు ఎక్కడికక్కడే తీవ్ర అస్వస్థతకు గురయి 12 మంది మరణించారు. ఐదు కిలోమీటర్ల మేరకు వ్యాపించడంతో.. పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించారు పోలీసులు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోసాకి గ్యాస్ లీక్ అయినట్టు వార్తలు వచ్చాయి, వైజాగ్ లో లీకైన గ్యాస్ ను స్టైరీన్ గ్యాస్ గుర్తించారు. ఈస్టైరీన్ గ్యాస్ కారణంగా ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది. దీన్ని డైరెక్ట్ గా పీల్చడం వలన ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

 

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

మాకూ ఎగ్జామ్స్ వద్దు... సోషల్ మీడియాలో ఏపీ, టీఎస్ విద్యార్థుల ప్రచారం!

   an hour ago


హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

హైకోర్టుతో పాటు సుప్రీంలోనూ జగన్ సర్కార్‌కు మొట్టికాయలే

   2 hours ago


మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

మరో వివాదంలో టీటీడీ.. సప్తగిరి పత్రికలో వక్రీకరణలపై నిరసనలు

   4 hours ago


ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

ఏపీ మీదుగా 22 రైళ్ళు... ఈ స్టేషన్లలో ఆగవంటున్న రైల్వేశాఖ

   5 hours ago


ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

ఆదిలాబాద్ గిరిజన గూడాలలో దాహమో రామచంద్రా

   5 hours ago


కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

కాశ్మీర్లో తీవ్రవాదులకు షాక్.. భద్రతదళాల విజయం

   6 hours ago


ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

ఏమైనా తిట్టేయండి.. మేమున్నాం.. శ్రేణుల‌కు పార్టీల అభ‌యం

   6 hours ago


పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

పీసీసీ చీఫ్ ప‌ద‌విపై కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యం ఇదే..?

   7 hours ago


కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

కనీవినీ ఎరుగని రీతిలో ఇళ్ల పట్టాలు, గృహాల నిర్మాణం.. వైఎస్ జగన్

   7 hours ago


కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ ఆఫర్ తిరస్కరించిన పీకె.. అసలేం జరిగింది?

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle