newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

పరవాడ గ్యాస్ లీకేజీ సంఘటనపై ఏపీ గవర్నర్, పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం

02-07-202002-07-2020 08:25:20 IST
Updated On 02-07-2020 11:08:26 ISTUpdated On 02-07-20202020-07-02T02:55:20.827Z02-07-2020 2020-07-02T02:54:47.919Z - 2020-07-02T05:38:26.701Z - 02-07-2020

పరవాడ గ్యాస్ లీకేజీ సంఘటనపై ఏపీ గవర్నర్, పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో తరచూ గ్యాస్ లీకేజీ ఘటను చోటుచేసుకుంటున్నాయి. ఎల్జీ పాలిమర్స్, పరవాడ గ్యాస్ లీకేజీ, నంద్యాలలో ఎస్పీవైరెడ్డి ఆగ్రో ఫార్మాలో గ్యాస్ లీకేజీ ఘటనలు విషాదం నింపిన సంగతి తెలిసిందే. విశాఖ గ్యాస్ లీకేజ్ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరించందన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.  విశాఖపట్నం పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ కర్మాగారంలో బెంజిమిడాజోల్ గ్యాస్ లీకేజీ జరిగిన సంఘటనపై గవర్నర్ విచారం వెలిబుచ్చారు.  

సంఘటనలో సంస్ధకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు ఆసుపత్రి పాలయ్యారు. గ్యాస్ లీకేజీని ప్రభుత్వ యంత్రాంగం అదుపులోకి తీసుకు రాగా,  బాధిత వ్యక్తులు పూర్తిగా కోలుకునే వరకు పూర్తి స్దాయి వైద్య సంరక్షణ, చికిత్స అందించాలని గవర్నర్ శ్రీ హరిచందన్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.

పరవాడ గ్యాస్ లీకేజీ సంఘటనలో తెనాలికి చెందిన షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, విజయనగరానికి చెందిన కెమిస్ట్ గౌరీశంకర్ ఈ ఘటనలో మృతి చెందారని తెలిపారు. అస్వస్థతకు గురైన చంద్రశేఖర్‌, ఆనంద్‌బాబు, జానకీరామ్‌, సూర్యనారాయణరాజులను గాజువాక ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అయితే హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలతో ఈ ఘటనపై సమగ్ర విచారణ సాగుతోంది. 

గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో తరచుగా చోటు చేసుకుంటున్న ఈ దుర్ఘటనలపై నిపుణులతో విచారణ చేపట్టాలన్నారు. ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు పవన్. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన, నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండీస్ట్రీస్ లో విషవాయువు లీక్ ఘటన మరువక ముందే సాయినార్ సంస్థలో విషవాయువు లీకై ఇద్దరు మృతి చెందడం బాధాకరమని పవన్ పేర్కొన్నారు.

మృతుల కుటుంబలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో వెంటనే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో చేపట్టిన విచారణలో కూడా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. పరిశ్రమల ప్రమాద ఘటనల్లో మృతి చెందినవారికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle